Home
Computer

2025లో ఉత్తమ ల్యాప్‌టాప్స్ కోసం చూస్తున్నారా.. రూ.40 వేలలోపు లభించే 5 మంచి ల్యాప్‌టాప్స్ ఇవే!

Best Affordable Laptops: ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగం చేసేవాళ్ల వరకు, ఇంకా అందరికీ కూడా చాలా అవసరమైన వస్తువు అయిపోయింది. 2025లో మార్కెట్ చూస్తే.. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్స్‌తో నిండిపోయింది. తక్కువ ధరలోనూ మంచి ఫీచర్లు, పర్ఫార్మెన్స్ లభిస్తున్నాయి. వర్క్, చదువు లేదా ఎంటర్టైన్మెంట్ కోసం ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే, రూ.40వేల లోపు బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ ఎంచుకోవడం చేసుకోవడం చాలా ముఖ్యం.

టాప్ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు శక్తివంతమైన ప్రాసెసర్లు, వేగవంతమైన స్టోరేజ్, మంచి బ్యాటరీ లైఫ్‌తో ల్యాప్‌టాప్స్‌ని అందిస్తున్నాయి. మీకోసం 40 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ జాబితా సిద్ధం చేశాం. వీటిని పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే క్వాలిటీ, ఇంకా డబ్బుకి గొప్ప విలువనిచ్చే అంశాల ఆధారంగా ఎంపిక చేశాం.

Best Affordable Laptops in 2025 High Performance at Low Prices

* లెనోవో ఐడియాప్యాడ్ 3 (AMD రైజెన్ 3 7320U)

లెనోవో ఐడియాప్యాడ్ 3 ల్యాప్‌టాప్ స్టూడెంట్స్, ఇల్లు లేదా సుదూర ప్రాంతాల నుంచి పని చేసేవాళ్లకి మంచి ఎంపిక. ఇది AMD రైజెన్ 3 7320U ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్ వేగంగా పనిచేస్తుంది. చాలా ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ అందిస్తుంది. 8GB DDR4 ర్యామ్, 512GB SSD ఉండటం వల్ల ల్యాప్‌టాప్ స్మూత్‌గా పనిచేస్తుంది.

15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఉంది కాబట్టి ఇందులో వీడియోలు, సినిమాలు చూసేటప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. 45Wh బ్యాటరీ ఉండటం వల్ల చాలా సేపు ఛార్జింగ్ ఉంటుంది. వైఫై 5, బ్లూటూత్ 5.0 వంటి వాటికి మద్దతు ఇస్తుంది. దీని బరువు 1.85 కేజీలు.

* డెల్ ఇన్‌స్పిరాన్ 15 3000 (ఇంటెల్ కోర్ i3 12th జెన్)

డెల్ ఇన్‌స్పిరాన్ 15 3000 ల్యాప్‌టాప్ చాలా దృఢంగా ఉంటుంది. మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇది 12వ తరం ఇంటెల్ కోర్ i3-1215U ప్రాసెసర్‌తో వస్తుంది. దీనివల్ల పని, వినోదం వంటి అవసరాలకు చాలా బాగా సరిపోతుంది. 8GB DDR4 ర్యామ్, 512GB SSD ఉండటం వల్ల అనేక పనులు ఒకేసారి వేగంగా చేసుకోవచ్చు.

ఇందులో అందించిన 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో పిక్చర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 41Wh బ్యాటరీ, వైఫై 5, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. బరువు 1.8 కేజీలు మాత్రమే కాబట్టి, ప్రయాణాలు చేసేవాళ్లకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్‌లో దీని ధర తనిఖీ చేయొచ్చు.

* HP 15s (ఇంటెల్ కోర్ i3 12th జెన్)

HP 15s ల్యాప్‌టాప్ రోజువారీ పనుల కోసం నమ్మకమైన ఆప్షన్. ఇది 12వ తరం ఇంటెల్ కోర్ i3-1215U ప్రాసెసర్‌తో వస్తుంది. దీనివల్ల ల్యాప్‌టాప్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. 8GB DDR4 ర్యామ్, 512GB SSD ఉండటం వల్ల ఒకేసారి అనేక పనులు కూడా సులభంగా చేయొచ్చు.

15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే స్పష్టమైన బొమ్మలను చూపిస్తుంది. 41Wh బ్యాటరీతో మంచి బ్యాకప్ వస్తుంది. కనెక్టివిటీ కోసం వైఫై 5, బ్లూటూత్ 5.0 ఉన్నాయి. ఇది బరువు 1.69 కేజీలే కాబట్టి, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. అమెజాన్ లాంటి వెబ్‌సైట్స్‌లో దీని ధర తనిఖీ చేయొచ్చు.

* ఏసర్ అస్పైర్ 3 (AMD రైజెన్ 5 3500U)

ఏసర్ అస్పైర్ 3 తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్ అయినా దాని పనితీరు మాత్రం అదిరిపోతుంది. ఇది AMD రైజెన్ 5 3500U ప్రాసెసర్‌తో వస్తుంది. దీనివల్ల మల్టీ టాస్కింగ్, తేలికైనా గేమింగ్ కూడా ల్యాగ్స్ లేకుండా చేసుకోవచ్చు. ఇందులో 8GB DDR4 ర్యామ్, 512GB SSD స్టోరేజీ అందించారు.

మంచి ప్రాసెసర్‌, తగినంత స్టోరేజీ ఉండటం వల్ల ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో వీడియోలు, ఇతర చిత్రాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 48Wh బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. వైఫై 5, బ్లూటూత్ 5.0లకు సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.9 కేజీలు.

* అసూస్ వివోబుక్ 15 (ఇంటెల్ కోర్ i3 11th జెన్)

అసూస్ వివోబుక్ 15 ల్యాప్‌టాప్ బరువు చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 11వ తరం ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది డైలీ టాస్క్‌లకి పర్ఫెక్ట్. 8GB DDR4 ర్యామ్, 512GB SSD ఉండటం వల్ల ల్యాప్‌టాప్ చాలా వేగంగా పనిచేస్తుంది.

15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో వీడియోలు చాలా క్వాలిటీతో వస్తాయి. 37Wh బ్యాటరీ ఇస్తారు కాబట్టి ఎక్కువ గంటలు చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు. వైఫై 5, బ్లూటూత్ 5.0 వంటి వాటికి మద్దతు ఇస్తుంది. దీని బరువు 1.8 కేజీలు. ఈ ఐదు ల్యాప్‌టాప్స్ కూడా డబ్బుకి తగ్గ ఫీచర్లు అందిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Explore 2025's top 5 laptops under Rs 40,000, these are perfect for students, professionals, offering great performance features and value within budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X