Home
Computer

భారతదేశంలో HP ఎలైట్‌బుక్ ల్యాప్‌టాప్స్‌ విడుదల.. ఫీచర్లు చూస్తే ఫిదా, ధరలు చూస్తే షాక్!

HP EliteBook Laptops: HP కంపెనీ ఇండియాలో సరికొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. అవే HP ఎలైట్‌బుక్ అల్ట్రా, ఎలైట్‌బుక్ ఫ్లిప్, ఎలైట్‌బుక్ X మోడల్స్. ఈ ల్యాప్‌టాప్‌లన్నీ అదిరిపోయే ఫీచర్లతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో వస్తున్నాయి. ముఖ్యంగా, శక్తివంతమైన AMD రైజెన్, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌లతో ఇవి పనిచేస్తాయి. వీటిలో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) ఉండడం వల్ల, సెకనుకు 55 ట్రిలియన్ ఆపరేషన్స్ వరకు చేయగలవు.

అంటే AIకి సంబంధించిన పనులన్నీ చాలా వేగంగా జరిగిపోతాయి. అంతేకాదు, HP AI కంపానియన్, పాలి కెమెరా ప్రో వంటి ప్రత్యేక టూల్స్‌తో వస్తున్నాయి. వీటితో వీడియో కాన్ఫరెన్సింగ్ అనుభవం అదిరిపోతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మరి వీటి ధరలు పిచర్ల వివరాలు తెలుసుకుందామా..

HP EliteBook Ultra  EliteBook Flip  and EliteBook X Launches New Laptops in India

* ధరలు, వేరియంట్స్ వివరాలు..

HP ఎలైట్‌బుక్ X G1a 14-అంగుళాల మోడల్ అనేది ఈ సిరీస్‌లో తక్కువ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.2,21,723. ఇది గ్లేసియర్ సిల్వర్ రంగులో అందుబాటులో ఉంది. దీంతో పాటే విడుదలైన HP ఎలైట్‌బుక్ X G1i మోడల్ కూడా 14-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది.

X G1i మోడల్ రూ.2,23,456 ధరతో లాంచ్ అయ్యింది. ఇది అట్మాస్ఫియర్ బ్లూ, గ్లేసియర్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్స్‌ను HP ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీమియం ల్యాప్‌టాప్‌లకు దాదాపు రివ్యూలు కూడా అవసరం లేదు అంటారు. కానీ ఒకసారి రివ్యూలు చూసి తీసుకోవడం మంచిది.

* HP ఎలైట్‌బుక్ అల్ట్రా ఫీచర్లు

ఎలైట్‌బుక్ అల్ట్రా G1i మోడల్ ఈ సిరీస్‌లోనే టాప్ మోడల్. ఇందులో 120Hz 3K OLED డిస్‌ప్లే, స్మూత్ నావిగేషన్ కోసం హాప్టిక్ ట్రాక్‌ప్యాడ్ ఉన్నాయి. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 సిరీస్ 2 ప్రాసెసర్‌లతో వస్తుంది. AI పనుల కోసం 48 TOPS వరకు NPU పర్ఫార్మెన్స్ ఉంటుంది.

9-మెగాపిక్సెల్ కెమెరాతో పాటు డ్యూయల్ మైక్రోఫోన్స్, AI పవర్డ్ పాలి కెమెరా ప్రో ఉన్నాయి. వీడియో కాల్స్ కోసం ఆటో-ఫ్రేమింగ్, బ్యాక్‌గ్రౌండ్ అడ్జస్ట్‌మెంట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధరలు రూ.2,67,223 నుంచి ప్రారంభమవుతాయి. వీటిపై ఎర్లీ ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలను అఫీషియల్ స్టోర్స్‌లో తెలుసుకోవచ్చు.

* HP ఎలైట్‌బుక్ X

ఎలైట్‌బుక్ X G1a మోడల్ ఈ సిరీస్‌లోనే తక్కువ ధరలో లభించే మోడల్. ఇది AMD రైజెన్ 7 ప్రో, రైజెన్ 9 ప్రో ప్రాసెసర్లతో వస్తుంది. 55 TOPS వరకు NPU పర్ఫార్మెన్స్ ఉంటుంది. 64GB LPDDR5x RAM ఉంటుంది, ఇది 8000 Mbps స్పీడ్‌తో పనిచేస్తుంది. మల్టీ-టాస్కింగ్, AI ప్రాసెసింగ్ సునాయాసంగా జరిగిపోతాయి.

* HP ఎలైట్‌బుక్ ఫ్లిప్ ఫీచర్లు

ఎలైట్‌బుక్ X ఫ్లిప్ G1i 14-అంగుళాల మోడల్ స్పెసిఫికేషన్స్ అల్ట్రా మోడల్ లాగే ఉంటాయి. కానీ ఇది కాస్త ప్రత్యేకమైనది. దీన్ని ల్యాప్‌టాప్‌లాగా, టాబ్లెట్‌లాగా, టెంట్ మోడ్‌లో కూడా వాడుకోవచ్చు. బరువు కేవలం 1.4 కేజీలు. HP రీఛార్జబుల్ యాక్టివ్ పెన్‌కు సపోర్ట్ చేస్తుంది. నోట్స్ తీసుకోవడానికి, క్రియేటివ్ పనుల కోసం ఇది చాలా బాగుంటుంది.

* భద్రతకు పెద్ద పీట

ఈ ల్యాప్‌టాప్‌లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌లోనే ఉంటుంది. సెక్యూర్ లాగిన్స్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. HP ఎండ్‌పాయింట్ సెక్యూరిటీ కంట్రోలర్ సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు, షూర్ సెన్స్ AI టెక్నాలజీ మాల్వేర్‌ను గుర్తించి బ్లాక్ చేస్తుంది. మీ డేటా మొత్తం చాలా భద్రంగా ఉంటుంది.

* AI, కూలింగ్ టెక్నాలజీ

ఈ ల్యాప్‌టాప్‌లన్నీ HP స్మార్ట్ సెన్స్ టెక్నాలజీ, 40W థర్మల్ డిజైన్ పవర్ (TDP)తో వస్తాయి. దీనివల్ల కూలింగ్ చాలా బాగా ఉంటుంది. డ్యూయల్ టర్బో హై-డెన్సిటీ ఫ్యాన్స్ వేడెక్కకుండా చూసుకుంటాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం పాలి కెమెరా ప్రో ఆటో-ఫ్రేమింగ్, బ్యాక్‌గ్రౌండ్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
HP launched EliteBook Ultra, Flip, X laptops in India. AI-powered, featuring Ryzen and Intel Ultra processors, offering high performance and enhanced security. Available now online.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X