ఫేస్‌బుక్ ద్వారా పసికందు విక్రయం..తండ్రే నిందితుడు!

Posted By:

ఫేస్‌బుక్ ద్వారా పసికందు విక్రయం!

దేశం నేరాలతో అట్టుడుకుతోంది. తాజాగా ఓ పసికందుకును ఫేస్‌బుక్ డీల్ ఆధారంగా రూ.8క్షలకు విక్రయించిన సంఘటన సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో సంచలనంగా మారింది. శిశువును కోల్పొయిన ఆ మాతృమూర్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన లుధియానా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన కోణంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వెల్లడైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

లుడియానా ప్రాంతానికి చెందిన నూరీ, ఏప్రిల్ 3న ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 10న ఆ శిశువును నూరీ భర్త ఫిరోజ్ ఖాన్ అపహరించి ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు 8లక్షలకు విక్రయించాడు. ఈ డీల్ వ్యవహారంలో ఫిరోజ్  ఖాన్‌కు ముగ్గురు సహాయపడ్డారు. ఫిరోజ్ ఖాన్‌కు సహాపడిన వారిలో ఒకరైన గురుప్రీత్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా సదురు శిశువును ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్‌కు చూపించి తద్వారా డీల్ సెట్ చేయటం జరిగింది.

ప్రిన్స్ మహేష్‌ స్పెషల్!

పవన్ కళ్యాణ్ స్పెషల్

రెండో పెళ్లి చేసుకునే దురుద్ధేశ్యంతో ఉన్న ఫిరోజ్ ఖాన్ భవిష్యత్‌లో తన పై ఎటువంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు గాను ముందస్తు జాగ్రత్తగా తన వారసత్వంతో జన్మించిన శిశువును విక్రయించినట్లు లుధియానా కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈశ్వర్ సింగ్ వెల్లడించారు. ఫిరోజ్ ఖాన్‌కు సహకరించిన ఇర్ఫాన్, నర్సు సునీతా ఇంకా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిశువును కొనుగోలు చేసిన అమిత్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఇంటిని సీజ్ చేసి పసికందును స్వాధీనం చేసుకుని తల్లి నూరీకి అప్పగించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot