త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

Written By:

ఐటీ హార్డ్‌వేర్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ కంపెనీ ఆర్‌డీపీ వర్క్‌స్టేషన్స్ ల్యాప్‌టాప్‌ల రంగంలోకి అడుగుపెట్టింది. ఆర్‌డీపీ థిన్‌బుక్ పేరుతో 14.1 అంగుళాల ల్యాప్‌టాప్‌ను రూ.9,999లకే ప్రవేశపెట్టింది. భారత్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఉపకరణం ఇదేనని కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ల్యాపీని విడుదల చేశారు.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారంతో ఈ థిన్‌బుక్‌ను రూపొందించారు. ల్యాపీతో పాటు ఈ నెలలోనే విండోస్ ట్యాబ్లెట్ పీసీలను రూ.5,500లోపు ధరలో ప్రవేశపెడతామని కంపెనీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే అసెంబ్లింగ్ ప్లాంట్ తెలంగాణాలో ఏర్పాటు చేస్తామని దీని కోసం రూ. 20 కోట్లు దాకా వ్యయం చేస్తామని చెప్పారు. వీటితో పాటు ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కంపెనీకి 100 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇకపై మెసెంజర్ నుంచి సీక్రెట్ మెసేజ్‌లు పంపుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్,

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

డిస్ ప్లే విషయానికొస్తే ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జడ్8300 ప్రాసెసర్, అల్ట్రా షార్ప్ హెచ్‌డీ డిస్‌ప్లే,

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ 2.0, యూఎస్‌బీ 3.0,

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

వీజీఏ కెమెరా, డ్యూయల్ హెచ్‌డీ స్పీకర్స్, బ్లూటూత్, వైఫై, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

1.45 కిలోల బరువు, 20 మిల్లీమీటర్ల మందం.

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచర్లు

ఈ ల్యాపీలను కంపెనీ తైవాన్‌లో తయారు చేయిస్తోంది.

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

ల్యాపీని విడుదల చేస్తున్న తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కల్లకుంట్ల తారక రామారావు 

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

అందులోని ఫీచర్లను శ్రధ్దగా వింటున్న మంత్రి కేటీఆర్ 

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తో ఆర్ డీపీ కంపెనీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి. త్వరలో హైదరాబాద్ లో ప్లాంటు ప్రారంబిస్తున్నామని కంపెనీ ఫౌండర్ తెలిపారు. 

హైదనాబాద్ లో ప్రపంచఐటీ సదస్సు

ఇదిలా ఉంటే ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు వేదికగా తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎంపికైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి 50దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు

ఏటా జరిపే అంతర్జాతీయ సమావేశానికి వేదికను వరల్డ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసు అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) ఎంపిక చేస్తుంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

భారతదేశం నుంచి నాస్కామ్

ఒక దేశానికి ఒక ఐటీ సంబంధిత సంస్థను మాత్రమే సభ్యురాలిగా అనుమతిస్తారు. భారతదేశం నుంచి నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Local hardware start-up launches 14.1 inch laptop for Rs 10,000
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot