ఇకపై మెసెంజర్ నుంచి సీక్రెట్ మెసేజ్‌లు పంపుకోవచ్చు
మెసెంజర్ వాడేవారికి శుభవార్త..మీరు ఇకపై మెసెంజర్ ద్వారా సీక్రెట్‌గా మెసేజ్‌లు పంపుకోవచ్చు.ఇప్పుడు ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌కి ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్‌ను తెచ్చేసింది.దీని ద్వారా యూజర్లు ఎంపిక చేసుకున్న సంభాషణలకు పూర్తిగా ఎన్ క్రిప్షన్ సౌకర్యాన్ని ఫేస్‌బుక్ కల్పించనుంది. అయితే ఈ సీక్రెట్ కన్వర్జేషన్‌లో సింగిల్ డివైజ్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని, ఒక డివైజ్ ద్వారా సీక్రెట్ సంభాషణ చేసి, మరొక డివైజ్‌లో ఆ సంభాషణ చూడాలనుకుంటే కుదరదని ఫేస్‌బుక్ వెల్లడించింది.
సంబరాలతో ఖుషీ ఖుషీగా ఫేస్‌బుక్

ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుందని డెస్క్‌టాప్‌లో వాడే మెసెంజర్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని ఫేస్‌బుక్ వెల్లడించింది. వాట్సప్‌లాగా అన్ని చాట్‌లకు ఈ ఫీచర్ వర్తించదు.ఈ ఫీచర్‌ను ప్రతి చాట్‌కు యూజర్లు మాన్యువల్‌గానే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెసెంజర్ యాప్‌ను ఓపెన్ చేసుకుని, సీక్రెట్ సంభాషణ ఎవరితో చేయాలనుకున్నారో వారిని యూజర్లు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?

యూజర్ పేరును టాప్ చేసి పట్టుకుంటే రహస్య సంభాషణ ఫీచర్ వారికి యాక్టివేట్ అవుతుంది. దీంతోపాటు ఈ సీక్రెట్ కన్వర్జేషన్ ఆప్షన్‌కు తర్వాత ఐకాన్‌గా టైమర్ ఉండనుంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌లు కనిపించకుండా టైమ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే జీఐఎఫ్స్, వీడియోస్ లాంటి కొన్ని ప్రముఖ ఫీచర్లకు ఈ సీక్రెట్ సంభాషణ వర్తించదని ఫేస్‌బుక్ తెలిపింది.
అసుస్ నుంచి 13 ఎంపీ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్
ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌లోకి లాగిన్ కావొచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి 10 ముఖ్యమైన విషయాలు
ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి
టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








