Mi Pad పై రూ.2,000 తగ్గింపు, త్వరపడండి
Mi Pad (16జీబి వర్షన్) టాబ్లెట్ పై Mi India రూ.2000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా తగ్గింపులో భాగంగా ఎంఐ ప్యాడ్‌ను రూ.10,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను Mi.com, Flipkart.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. Mi Pad పనితీరు విషయానికొస్తే ఈ డివైస్‌ను ప్రత్యేకించి గేమర్స్ ఇంకా ఇ-బుక్ రీడర్స్ కోసం డిజైన్ చేసారు. టాబ్లెట్‌లో పొందుపరిచిన ఎన్-విడియా టెగ్రా కే1 2.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఇంకా హై-రిసల్యూషన్ డిస్‌ప్లేలు ఆకట్టుకుంటాయి.

3జీబి ర్యామ్ ఫోన్ జస్ట్ రూ.6,999కే!
Mi Pad పూర్తి స్పెసిఫికేషన్స్:
7.9 అంగుళాల ఐపీఎస్ హై రిసల్యూషన్ డిస్‌ప్లే (326 పీపీఐతో), డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ బ్యాక్ ఇల్యూమినేటెడ్ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎన్-విడియా టెగ్రా కే1 2.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6,700 ఎమ్ఏహెచ్ లితియమ్-ఐయోన్ పాలిమర్ బ్యాటరీ.
ఇంకా చదవండి : ఇక xiaomi ల్యాప్‌టాప్‌లు


Click it and Unblock the Notifications








