రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2

Posted By:

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ తన గెలాక్సీ టాబ్ ఎస్2 టాబ్లెట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. రెండు స్ర్కీన్ వర్షన్‌లలో ఈ టాబ్లెట్ లభ్యం కానుంది. మొదటి స్ర్కీన్ వర్షన్ 9.7 అంగుళాలు కాగా రెండవ స్ర్కీన్ వర్షన్ 8 అంగుళాలు. గెలాక్సీ టాబ్ ఎస్2, 5.6 మిల్లీమీటర్ల మందంతో మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. డివైస్‌లో ఏర్పాటు చేసిన సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే 94 శాతం సహజసిద్థమైన టోన్స్‌తో అత్యుత్తమ ట్రూలైఫ్ కలర్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో కూడిన 100జీబి క్లౌడ్ స్టోరేజ్, బిల్ట్‌ఇన్ ట్రాక్‌ప్యాడ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలను టాబ్ ఎస్2 కలిగి ఉంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో లభ్యమయ్యే గెలాక్సీ టాబ్ ఎస్2ను వై-ఫై, వై-ఫై + ఎల్టీఈ వర్షన్‌లలో పొందవచ్చు.

రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2

Read More : ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.4000కే!

గెలాక్సీ టాబ్ ఎస్2 (9.7 అంగుళాల వర్షన్) స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ 1.9గిగాహెర్ట్జ్ + క్వాడ్ 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ అప్లికేషన్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4GHz/5GHz), వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.1 బీఎల్ఈ), సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, ఫింగర్ స్కానర్, గైరో స్కోప్, కంపాస్, హాల్ సెన్సార్, ఆర్‌జీబీ సెన్సార్), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డివైజ్ చుట్టుకొలత 169 x 237.3 x 5.6మిల్లీ మీటర్లు, వై-ఫై వర్షన్ బరువు 389 గ్రాములు, ఎల్టీఈ వర్షన్ బరువు 392 గ్రాములు. 5870 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : తడిస్తే అంతే సంగతలు!

గెలాక్సీ టాబ్ ఎస్2 (8.0 అంగుళాల వర్షన్) స్పెసిఫికేషన్‌లు:

8.0 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ 1.9గిగాహెర్ట్జ్ + క్వాడ్ 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ అప్లికేషన్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4GHz/5GHz), వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.1 బీఎల్ఈ), సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, ఫింగర్ స్కానర్, గైరో స్కోప్, కంపాస్, హాల్ సెన్సార్, ఆర్‌జీబీ సెన్సార్), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డివైజ్ చుట్టుకొలత 169 x 237.3 x 5.6మిల్లీ మీటర్లు, వై-ఫై వర్షన్ బరువు 265 గ్రాములు, ఎల్టీఈ వర్షన్ బరువు 272 గ్రాములు. 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Samsung Galaxy Tab S2 launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot