టాబ్లెట్ ఫైట్.. ‘వామ్మీ మ్యాగ్నస్ vs గెలాక్సీ నోట్ 800’

Posted By:

దేశీయంగా పోర్టబుల్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ట్యాబ్లెట్ పీసీల సంస్కృతి విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ బ్రాండ్ వికెడ్‌లీక్ ‘వామ్మీ మ్యాగ్నస్'పేరుతో 10 అంగుళాల ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‍‌ను విపణిలోకి తీసుకువచ్చంది. ధర రూ.15,499. ఈ తక్కువ ధర కంప్యూటింగ్ డివైజ్‌లోని స్పెసిఫికేషన్‌లు సామ్‌సంగ్ గెలాక్సీ నోట్800తో తలపడేవిగా ఉన్నాయి. సామ్‌సంగ్ నుంచి అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో ఇటీవల విడుదలైన ‘గెలాక్సీ నోట్ 800' దేశీయ మార్కెట్లో రూ.31,190కి లభ్యమవుతోంది. వీటి ఎంపికలో భాగంగా వినియోగదారులకు అవగాహన కలిగించే కమ్రంలో వామ్మీ మ్యాగ్నస్, గెలాక్సీ నోట్ 800 స్సెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

2015లో ల్యాప్‌టాప్ ఏలా ఉండబోతోంది..?

బరువు ఇంకా చుట్టుకొలత......

వామ్మీ మ్యాగ్నస్: చుట్టుకొలత 267 x 177 x 8మిల్లీ మీటర్లు, బరువు 620 గ్రాములు,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: చుట్టుకొలత 262 x 180 x 8.9 మిల్లీ మీటర్లు, బరువు 580 గ్రాములు,

డిస్‌ప్లే.....

వామ్మీ మ్యాగ్నస్: 10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: 10.1అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

కేకపుట్టిస్తున్న ఫేస్‌బుక్ ఫోన్! (ఫోటో గ్యాలరీ)

ప్రాసెసర్....

వామ్మీ మ్యాగ్నస్: 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 4412 క్వాడ్ ప్రాసెసర్,

టాబ్లెట్ ఫైట్.. ‘వామ్మీ మ్యాగ్నస్ vs గెలాక్సీ నోట్ 800’

ఆపరేటింగ్ సిస్టం....

వామ్మీ మ్యాగ్నస్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (4.2 జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (4.1జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),

కెమెరా.....

వామ్మీ మ్యాగ్నస్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800:5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

జెట్ ఇంజన్ సైకిల్.. చూస్తే దిమ్మ తిరగాలా!

స్టోరేజ్...

వామ్మీ మ్యాగ్నస్: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

వామ్మీ మ్యాగ్నస్: వై-ఫై, మినీ యూఎస్బీ పోర్ట్, మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: 3జీ సిమ్ కార్డ్‌స్లాట్, బ్లూటూత్ సపోర్ట్, వై-ఫై, మినీ యూఎస్బీ పోర్ట్, మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

బ్యాటరీ...

వామ్మీ మ్యాగ్నస్: 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 6 నుంచి 7 గంటలు, స్టాండ్‌బై 30 రోజులు),
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800: 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై 90 రోజలు),

ధర.......

వామ్మీ మ్యాగ్నస్: ధర రూ.15,499,
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800:35,190.

తీర్పు......

ఈ 10 అంగుళాల ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‌లు అధికముగింపు స్సెసిఫికేషన్‌లు కలిగి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తక్కువ ధర, వేగవంతమైన ప్రాసెసర్ ఇంకా 4కే వీడియో ప్లేబ్యాక్‌లను కోరుకునేవారికి వామ్మీ మ్యాగ్నస్ ఉత్తమ ఎంపిక. అత్యుత్తమ కెమెరా పనితీరు, టచ్‌విజ్ సపోర్ట్, బ్లూటూత్ కనెక్టువిటీ ఇంకా వాయస్ కాలింగ్ ఫీచర్‌లను కోరుకునే వారికి గెలాక్సీ నోట్ 800 బెస్ట్ చాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot