రూ.30,000లోపే 4K స్మార్ట్ టీవీలు.. 43", 55" సైజుల్లో శాంసంగ్, ఏసర్, టీసీఎల్, రెడ్‌మీ డీల్స్..
Amazon Smart TV Deals: ఐపీఎల్ సందడి అయిపోయింది. ఈ సమయంలోనే, అమెజాన్ అదిరిపోయే ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో మీ బడ్జెట్‌కు సరిపోయేలా, అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా రూ. 30,000 లోపు ధరలో శాంసంగ్, ఏసర్, టీసీఎల్, రెడ్‌మీ వంటి టాప్ బ్రాండ్ టీవీలు లభిస్తుండటం విశేషం.
4K రిజల్యూషన్, HDR సపోర్ట్, డాల్బీ ఆడియో, స్మార్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఈ టీవీల్లో ఉన్నాయి. తక్కువ ధరలో మంచి టీవీ కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి సమయం. మరి ఏయే టీవీ లపై, ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం పదండి.

Samsung గెలాక్సీ ఫోన్‌లో Always On డిస్‌ప్లేను నచ్చినట్టు మార్చుకోవాలా.. సులభమైన పద్ధతులు మీకోసం..
* శాంసంగ్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో
శాంసంగ్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో (D సిరీస్) టీవీ ఈ సేల్‌లో ఒక ప్రత్యేక ఆకర్షణ. 43-అంగుళాల 4K LED డిస్‌ప్లే (3840 x 2160) తో వస్తున్న ఈ టీవీ, చాలా స్పష్టమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. 50Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా HD డిమ్మింగ్, 4K అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లతో ఉన్నాయి.
మోషన్ ఎక్సలరేటర్, HDR సపోర్ట్, ఫిల్మ్ మేకర్ మోడ్, కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ వంటి ఫీచర్లు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. 20W ఆడియో సిస్టమ్‌తో పాటు క్యూ-సింఫనీ ఇంటిగ్రేషన్ ఉండటం వలన సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అచ్చం సినిమా థియేటర్‌లో చూసినట్లే అనుభూతి కలుగుతుంది.
బిక్స్‌బీ, స్మార్ట్‌థింగ్స్ హబ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అసలు ధర రూ.31,490 కాగా, ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్స్ తర్వాత కేవలం రూ.29,490కే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ చాలా నమ్మకమైన బ్రాండ్ సర్వీస్ సెంటర్లు కూడా అనేక చోట్ల అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీన్ని కొనొచ్చు.
* ఏసర్‌ప్యూర్ స్విఫ్ట్ 55-అంగుళాల టీవీ
పెద్ద స్క్రీన్ టీవీ కావాలనుకునే వారికి ఏసర్‌ప్యూర్ స్విఫ్ట్ 55-అంగుళాల టీవీ ఒక మంచి ఛాయిస్. 60Hz 4K LED ప్యానెల్‌తో పాటు HDR10+ సపోర్ట్ ఉండటంతో కలర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి, కాంట్రాస్ట్ బాగుంటుంది. ఏసర్ వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 టెక్నాలజీతో పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగుపడుతుంది.
24W స్పీకర్లతో పాటు డాల్బీ అట్మాస్, DTS HD సపోర్ట్ ఉండటం వలన సౌండ్ అదిరిపోతుంది. గూగుల్ టీవీ OSతో పనిచేసే ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. దీని అసలు ధర రూ.33,999 కాగా, ఇప్పుడు డిస్కౌంట్స్‌తో కలిపి రూ.30,499కే లభిస్తుంది.
* టీసీఎల్ P655 సిరీస్ 55-అంగుళాల టీవీ
టీసీఎల్ P655 సిరీస్ టీవీ AI టెక్నాలజీతో వస్తుంది. 55-అంగుళాల 4K డిస్‌ప్లేతో పాటు AiPQ ప్రాసెసింగ్, మైక్రో డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉండటంతో పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వీడియోలు స్మూత్‌గా ప్లే అవుతాయి.
2GB RAM, 16GB స్టోరేజ్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. 24W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటంతో సౌండ్ క్వాలిటీ చాలా క్లియర్‌గా, చాలా శక్తివంతంగా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.1,500 డిస్కౌంట్ తర్వాత ఈ టీవీని కేవలం రూ.28,490కే సొంతం చేసుకోవచ్చు.
* రెడ్‌మీ F సిరీస్ 43-అంగుళాల టీవీ
చిన్న సైజులో స్మార్ట్ ఫీచర్లతో టీవీ కావాలనుకునే వారికి రెడ్‌మీ F సిరీస్ 43-అంగుళాల టీవీ బెస్ట్ ఆప్షన్. 4K ప్యానెల్‌తో పాటు MEMC టెక్నాలజీ ఉండటం వల్ల వీడియోలు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ కలర్ క్వాలిటీని పెంచుతుంది. 24W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, DTS-X, DTS HD సపోర్ట్ ఉండటంతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది.
ఫైర్ టీవీ OSతో పనిచేసే ఈ టీవీలో అలెక్సా సపోర్ట్, గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంది. డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, HDMI, USB పోర్ట్‌లు కూడా ఉన్నాయి. డిస్కౌంట్స్ తర్వాత ఈ టీవీని కేవలం రూ.24,499కే కొనుక్కోవచ్చు. చిన్న ఇళ్ల కోసం ఇది చాలా గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు.
* ఇప్పుడు టీవీ కొనడం మంచిదేనా..
ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతోంది, ఈ సమయంలో మీ పాత టీవీని కొత్త టీవీతో అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. అది కూడా తక్కువ ధరలో.. మీకు చిన్న 43-అంగుళాల టీవీ కావాలన్నా, లేదా పెద్ద 55-అంగుళాల టీవీ కావాలన్నా, ఈ సేల్‌లో 4K రిజల్యూషన్, స్మార్ట్ ఫీచర్లు, క్వాలిటీ ఆడియోతో టీవీలు అన్నీ రూ.30,000లోపే లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications







