Home
Gadgets

Apple TV 4K (2020) లాంచ్ త్వరలోనే... ఫీచర్స్ ఇవే...

ప్రముఖ ఆపిల్ సంస్థ రిలీజ్ చేస్తున్న అన్ని రకాల ప్రోడక్ట్ లు మంచి గుర్తింపును పొందాయి. ఇందులో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు మరియు టీవీలు మంచి ఆదరణను పొందాయి. అలాగే ఈ సంస్థ నుండి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తోంది అంటే కనుక దాని మీద అధికంగా రూమర్స్ వస్తూవుంటాయి. అందులో భాగంగా ఆపిల్ టీవీ 4K అప్‌గ్రేడ్ మీద కొంతకాలంగా రూమర్స్ అధికం అయ్యాయి.

ఆపిల్ టీవీ 4K (2020)

ఆపిల్ టీవీ 4K (2020)

కుపెర్టినో దిగ్గజం ఇప్పటివరకు ఈ రూమర్స్ కు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కొత్త ఆపిల్ టీవీ 4K (2020) మోడల్ ఇప్పుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని మరియు దీనిని త్వరలో లాంచ్ చేస్తున్నట్లు టిప్‌స్టర్ పేర్కొన్నారు. కొత్త ఆపిల్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 64GB మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో వస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. దీనికి కొత్త ప్రాసెసర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ తన కొత్త tvOS వేరియంట్‌ను వచ్చే నెలలో WWDC 2020 లో ఆవిష్కరించనున్నది. ఇది కొత్త ఆపిల్ టివి 4K మోడల్‌లో అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఆపిల్ టీవీ 4K 2020 ప్రాసెసర్

ఆపిల్ టీవీ 4K 2020 ప్రాసెసర్

కొత్త ఆపిల్ టీవీ 4K 2020స్మార్ట్ టీవీ A12X బయోనిక్ చిప్‌ను కలిగి ఉండి నెప్ట్యూన్ T1125 అనే కోడ్ నేమ్ తో అభివృద్ధి చెందుతోంది. అంతే కాకుండా ఇది త్వరలో ప్రారంభమవుతుంది అని జోన్ ప్రాసెసర్ ట్వీట్ చేశారు. A12X చిప్ మొదటి సారిగా అక్టోబర్ 2018 లో మొదటి తరం 11-అంగుళాల ఐప్యాడ్ ప్రోలో ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆపిల్ టీవీ 4K మోడల్‌లో కూడా A10X చిప్ ను వినియోగిస్తున్నారు. ఆపిల్ టీవీ 4K (2020) మోడల్ 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుందని ప్రాసెసర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది ఆపిల్ టీవీ కుటుంబంలో స్టోరేజ్ అప్‌గ్రేడ్‌ను సూచించే ఇటీవలి పుకారుకు అనుగుణంగా ఉంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

జోన్ ప్రాసెసర్ ఎటువంటి కాంక్రీట్ లాంచ్ షెడ్యూల్‌ను అందించలేక పోయినప్పటికీ కొత్త మోడల్ దీనికి తగ్గట్టుగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ సంస్థ తయారుచేస్తున్న టీవీల యొక్క పరిణామాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ టీవీల పరిమాణాలను అధిగమించడంలో సంస్థకు మంచి రికార్డు ఉందని గమనించడం కూడా ముఖ్యం అని ఆయన అన్నారు. గత నెలలో ఐఫోన్ SE (2020) ప్రారంభ తేదీని వెల్లడించాడు మరియు ఇటీవల మాక్బుక్ ఎయిర్ 2020 విడుదల తేదీని అధికారిక ప్రకటనకు కొన్ని గంటల ముందు ట్వీట్ చేయగలిగాడు.

ఆపిల్ నుంచి కొత్త అద్భుతం?

ఆపిల్ నుంచి కొత్త అద్భుతం?

ఈ మధ్యకాలంలో ఆపిల్ తన వినియోగదారుల కోసం ఆన్‌లైన్‌లో కొత్త పరికరాలను ప్రకటించడం ద్వారా వారికి అధిక ఉత్సాహన్ని మరియు సంతోషాన్ని అందిస్తున్నది. గత నెలలో కొత్తగా 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో, ఐఫోన్ ఎస్‌ఇ (2020), మాక్‌బుక్ ఎయిర్ 2020, మరియు 11 అంగుళాల ఐప్యాడ్ ప్రో 2020 తో పాటు 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో 2020 ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఆపిల్ టీవీ 4 కె మోడల్ రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ ప్రకటన ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి రానున్నది అని ఆశించడం సురక్షితం.

ఆపిల్ కొత్త tvOS అప్‌డేట్‌

ఆపిల్ కొత్త tvOS అప్‌డేట్‌

ఇటీవలి టీవీఓఎస్ వెర్షన్ యొక్క బీటా కోడ్ ద్వారా కొత్త మోడల్ గురించి సూచన వెలువడింది. వచ్చే నెలలో జరిగే డబ్ల్యూడబ్ల్యుడిసి 2020 కార్యక్రమంలో ఆపిల్ కొత్త tvOS అప్‌డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో రాబోయే ఆపిల్ టివి మోడల్ కోసం కొన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి.

Best Mobiles in India

English summary
Apple TV 4K 2020 Launching Soon: Specifications Leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X