త్వరపడండి, రూ. 649కే వీఆర్ హెడ్‌సెట్

Written By:
బింగోస్ టెక్నాలజీస్ సంస్థ బింగో వీ - 200 వీఆర్ పేరిట ఓ నూతన వీఆర్ (వర్చువల్ రియాలిటీ) హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ హెడ్‌సెట్ యూజర్లకు రూ.649 ధరకే లభిస్తోంది. కొనుగోలు చేయాలనుకున్నవారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ వీఆర్ హెడ్‌సెట్‌లో 42 ఎంఎం అడ్జస్టబుల్ ఆప్టికల్ లెన్స్ ఉన్నాయి.
త్వరపడండి, రూ. 649కే వీఆర్ హెడ్‌సెట్
దీంతో హెడ్‌సెట్‌కు ఉండే ప్రత్యేకమైన బటన్ సహాయంతో లెన్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫోన్‌ను 360 డిగ్రీల కోణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. అంతేకాకుండా ఈ హెడ్‌సెట్‌కు ఓ బ్లూటూత్ రిమోట్ కంట్రోలర్ కూడా ఉచితంగా ఇస్తున్నారు.
త్వరపడండి, రూ. 649కే వీఆర్ హెడ్‌సెట్
ఈ రిమోట్ సహాయంతో హెడ్‌సెట్‌లో ఉన్న ఫోన్‌ను కంట్రోల్ చేయవచ్చు. ముందు భాగంలో ఉండే కవర్‌ను ఓపెన్ చేయడం ద్వారా హెడ్‌సెట్‌లో 4.7 నుంచి 6 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల ఫోన్లను పెట్టుకుని వీఆర్ వీడియోలు, ఫొటోలను తిలకించవచ్చు.

English summary
Bingo V200 VR Box Made in India headset launched for Rs. 649 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot