రిలయన్స్ జియో దుమ్మురేపింది

Written By:

టెలికాం ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో జియో దుమ్ము రేపింది. ఇతర టెల్కోలను సవాల్ చేస్తూ పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని జియో అవలీలగా చేధించింది. జియో 10 కోట్ల మంది యూజర్స్‌ను చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బుధవారం ప్రకటించారు. జియో సేవలను ప్రారంభించిన సమయంలో అతితక్కువ సమయంలోనే 100 మిలియన్ కస్టమర్లను చేరుకోవాలని టార్గెట్‍గా పెట్టుకున్నాం.

హానర్ 6X, బెస్ట్ అనేందుకు కొన్ని కారణాలు

రిలయన్స్ జియో దుమ్మురేపింది

కానీ నెలల వ్యవధిలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని మేము అంచనావేయలేదు. ఆధార్ ఆధారిత మమ్మల్ని మిలియన్ కస్టమర్లను చేరుకోవడానికి సహకరించిందని ముఖేష్ అంబానీ చెప్పారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరమ్ 2017 ఇంటరాక్టివ్ సెషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇకపై నిమిషాల్లో పాన్‌కార్డు మీ చేతికి

రిలయన్స్ జియో దుమ్మురేపింది

2015 డిసెంబర్ 27 నుంచి కంపెనీ తొలుత తమ ఉద్యోగులకు ఉచితంగా 4జీ సర్వీసులు ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసింది. అనంతరం కస్టమర్లందరికీ 2016 సెప్టెంబర్ 5 నుంచి జియో ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 83 రోజుల్లోనే జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకుంది.

రిలయన్స్ జియో దుమ్మురేపింది

ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియోకు డిసెంబర్ 31 వరకు 72.4 మిలియన్ల సబ్‌స్రైబర్లు ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో 100 మిలియన్ సబ్‌స్కైబర్ బేస్‌ను చేధించినట్టు ముఖేష్ అంబానీ తెలిపారు.

English summary
Reliance Jio crosses 100 million customers: Mukesh Ambani read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot