Home
Gadgets

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.42 వేల 50-అంగుళాల 4K టీవీ రూ.24 వేలకే.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. త్వరపడండి..!

Blaupunkt 50 inch 4K Google TV: సినిమా చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో మునిగిపోవాలన్నా.. టీవీ మాత్రం అదిరిపోయేలా ఉండాలి కదా. అందుకే మీకోసం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. బ్లాపంక్ట్ (Blaupunkt) కంపెనీకి చెందిన 50-అంగుళాల 4K స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు, టీవీ ఫీచర్లు తెలుసుకుంటే వెంటనే ఆ టీవీని ఆర్డర్ పెట్టకుండా ఉండలేరు.

* బ్లూపంక్ట్ 50-అంగుళాల 4K స్మార్ట్ టీవీ

బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ G2 సిరీస్ (Blaupunkt CyberSound G2 Series) 50 అంగుళాల అల్ట్రా HD 4K స్మార్ట్ గూగుల్ టీవీ అసలు ధర అక్షరాలా రూ.41,999. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 40 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ టీవీని మీరు కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.

Flipkart Deal Blaupunkt 50-inch 4K Google TV Gets a Massive Price Cut

మీ దగ్గర కొన్ని ప్రత్యేకమైన బ్యాంక్ కార్డులు ఉంటే.. అదనంగా రూ. 1250 తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే అప్పుడు ఈ టీవీ మీ సొంతం కావాలంటే మీరు చెల్లించాల్సింది జస్ట్ రూ.23,749 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీకి ఎనిమిది వేలకు పైగా రివ్యూలు వచ్చాయి. చాలామంది బాగుందని చెప్పడంతో దీనికి 5కి 4.5 రేటింగ్ లభించింది.

* బ్లాపంక్ట్ 4K స్మార్ట్ టీవీ ఫీచర్లు

ధర తక్కువైనా, ఫీచర్లలో మాత్రం ఈ టీవీ ఏమాత్రం తగ్గదు. బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ G2 సిరీస్ 50 అంగుళాల 4K గూగుల్ టీవీలో ఉన్న ఫీచర్లు చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ టీవీ LED డిస్‌ప్లేతో వస్తోంది. అందుకే పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుంది. 4K అల్ట్రా HD రిజల్యూషన్ ఉండటంతో పిక్చర్స్ క్లారిటీగా ఉంటాయి.

పైగా 60Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫాస్ట్ యాక్షన్ సీన్స్ కూడా స్మూత్‌గా కనిపిస్తాయి. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల వెలుతురులోనూ స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. IPS ప్యానెల్ వాడటం వల్ల కలర్స్ చాలా సహజంగా, అందంగా కనపడతాయి. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటంతో సినిమా చూస్తున్న అనుభూతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

మోషన్ సెన్సార్, డిజిటల్ నాయిస్ ఫిల్టర్ వంటి ఫీచర్లు అదనంగా పిక్చర్ క్వాలిటీని మరింత పెంచుతాయి. ముఖ్యంగా ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తోంది. అంటే స్క్రీన్ చుట్టూ అంచులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల ఏ యాంగిల్ నుంచి చూసినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

* సౌండ్ క్వాలిటీకి తిరుగులేదు

ఈ టీవీలో సౌండ్ కూడా చాలా బాగుంటుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో ఏకంగా 60W స్పీకర్లు ఇచ్చారు. సినిమాలు చూసేటప్పుడు, పాటలు వినేటప్పుడు సౌండ్ అదిరిపోతుంది. అంతేకాదు.. మీ మూడ్‌కు తగ్గట్టు స్టాండర్డ్, మ్యూజిక్, మూవీ, స్పోర్ట్స్ వంటి ఆడియో మోడ్స్ కూడా ఉన్నాయి.

* పర్ఫార్మెన్స్ కూడా టాప్ క్లాస్..

బ్లాపంక్ట్ సైబర్‌సౌండ్ G2 సిరీస్ 50-అంగుళాల 4K గూగుల్ టీవీలో చాలా శక్తివంతమైన క్వాడ్-కోర్ మీడియాటెక్ ARM కార్టెక్స్ A53 చిప్‌సెట్ ఉంది. మాలి క్వాడ్-కోర్ GPU గ్రాఫిక్స్ సపోర్ట్‌తో గేమ్స్ కూడా సూపర్ స్పీడ్‌తో ఆడొచ్చు. హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు.

* స్మార్ట్ ఫీచర్స్‌తో అదరగొట్టేస్తుంది..

ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే మీకు కావాల్సిన గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్ (YouTube), నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) వంటి ఓటీటీ యాప్స్‌ను కూడా ఈజీగా వాడుకోవచ్చు.

క్రోమ్‌కాస్ట్ (Chromecast), ఎయిర్‌ప్లే (AirPlay) సపోర్ట్ కూడా ఉంది. ఇంకా కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికొస్తే.. 2 USB పోర్ట్‌లు, 3 HDMI పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్, ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. టీవీలో 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ కూడా ఇచ్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers Blaupunkt 50 inch 4K Google TV at discount. Features 60W speakers, Dolby audio, Google TV OS, and 4K ultra HD display, available for under twenty five thousand rupees.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X