OnePlus TV: సరసమైన ధరలకే స్మార్ట్ టీవీ!!! త్వరలోనే ప్రారంభం...
ఇండియాలో స్మార్ట్ టీవీ రంగం మరింత పోటీగా మారనున్నది. ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీలను విడుదల చేసారు. ఇప్పటికే రియల్ మి, షియోమి వంటి సంస్థలు సాంసంగ్ మరియు LG వంటి బ్రాండ్ లకు పోటీగా తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను విడుదల చేశారు. ఇప్పుడు ఈ విభాగంలోకి వన్‌ప్లస్ సంస్థ కూడా చేరనున్నది.

వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ
జూలై 2 న వన్‌ప్లస్ కంపెనీ తక్కువ ధరలో లభించే స్మార్ట్ టీవీని లాంచ్ చేయనున్నట్లు వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు. 55-అంగుళాల వన్‌ప్లస్ టీవీ 2019 సెప్టెంబర్‌లో కంపెనీ తన వన్‌ప్లస్ టీవీ క్యూ 1 సిరీస్‌తో పాటు విడుదల చేసింది. Also Read:OnePlus 8 Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లతో మంచి అవకాశం!!!! త్వరపడండి...

వన్‌ప్లస్ స్మార్ట్ టివి సాఫ్ట్‌వేర్
వన్‌ప్లస్ సంస్థ తన స్మార్ట్ టివిలో అత్యంత అధునాతన సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌ల కలయికను కలిగి ఉంది. ఇది స్పష్టమైన ఇంటర్నెట్ అనుభవాన్ని అందించడానికి వీలుగా రూపొందించబడింది అని సంస్థ తెలిపింది. చైనా నుండి వచ్చిన ఇతరుల మాదిరి కాకుండా వన్‌ప్లస్ ప్రీమియం విభాగంలో 55-అంగుళాల టీవీని రూ .69,900 ధర వద్ద మరియు ప్రో ధర వేరియంట్ ను రూ.99,900 ధర వద్ద విడుదల చేసింది. Also Read:కార్డ్‌లెస్ విత్ డ్రా ఇకపై చాలా ఈజీ, ఇలా చేయండి

సరసమైన ధరలో వన్‌ప్లస్ టీవీ లాంచ్ షెడ్యూల్
వన్‌ప్లస్ ఇండియా యొక్క చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంస్థ ఎంట్రీ లెవల్ మరియు మిడ్-రేంజ్ విభాగాలను లక్ష్యంగా చేసుకొని కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వన్‌ప్లస్ టీవీ యొక్క ధర ట్యాగ్ వివరాలను పేర్కొనకపోయినప్పటికి ఇది జులై 2 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వన్‌ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీ ధరల వివరాలు
వన్‌ప్లస్ సంస్థ కొత్తగా విడుదల చేయనున్న తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీ యొక్క ధర US $ 200 లేదా 15,000 రూపాయల ధరల వద్ద ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇంకా మిడ్-రేంజ్ సిరీస్ స్మార్ట్ టీవీ యొక్క ధరలు రూ.20,000 నుండి 40,000 రూపాయల మధ్య ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. Also Read:ఒకే IMEI నెంబర్ మీద పనిచేస్తున్న 13,500 వివో స్మార్ట్‌ఫోన్లు!!! జర జాగ్రత్త...

షియోమి ఎంట్రీ లెవల్ స్మార్ట్ టివి
ఎంట్రీ లెవల్ మరియు మిడ్-రేంజ్ స్మార్ట్ టీవీ విభాగాలలో ఇండియాలో ప్రస్తుతం షియోమి సంస్థ ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఇండియాలో షియోమి సంస్థ ఇప్పుడిప్పుడే టాప్ స్మార్ట్ టివి బ్రాండ్‌గా ఎదుగుతున్నది అని షియోమి ఇండియా ఎండి మను కుమార్ జైన్ ఏప్రిల్‌లో తన ట్వీట్‌లో పేర్కొన్నారు. షియోమి సంస్థ ప్రస్తుతం భారతదేశంలో 32% మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియాలో సామ్‌సంగ్ మరియు ఎల్‌జీలకు 14% మార్కెట్ వాటా ఉండగా, సోనీకి 11% మార్కెట్ వాటా ఉందని హైలైట్ చేసింది.

షియోమి మరియు రియల్‌మితో పోటీ పడటానికి వన్‌ప్లస్ టీవీ
జూలై 2 న వన్‌ప్లస్ సంస్థ భారతీయ వినియోగదారుల కోసం ఎంట్రీ లెవల్ విభాగంలో తన స్మార్ట్ టీవీలను ఆవిష్కరించాలని యోచిస్తున్నప్పటికీ ఎంట్రీ లెవల్ మరియు మిడ్-రేంజ్ విభాగాలలో కొన్ని రోజుల ముందే కొన్ని సంస్థలు తమ స్మార్ట్ టీవీలతో కొత్తగా ప్రవేశించాయి. అందులో ముఖ్యంగా జూన్ మొదటి వారంలో నోకియా యొక్క 43-అంగుళాల స్మార్ట్ టీవీ వేరియంట్‌ను రూ.31,999 ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ లో అందిస్తున్నది. దీని యొక్క మొదటి అమ్మకాలు జూన్ 8 నుండి మొదలుకానున్నాయి. ఇందులో 32 అంగుళాల వేరియంట్‌ను మరియు 43 అంగుళాల వేరియంట్‌ను కూడా వేరు వేరు ధరల వద్ద అందిస్తున్నాయి.

ఎంట్రీలెవల్ స్మార్ట్ టీవీల ధరలు
ఇండియాలో స్మార్ట్ టీవీ యొక్క మార్కెట్ లో అందిరికంటే ముందు వరుసలో ఉన్న షియోమి సంస్థ రూ.40,000 ధరల పరిధిలో అనేక వేరియంట్‌లను అందిస్తున్నప్పటికీ దాని రియల్‌మితో స్మార్ట్ టీవీని 12,499 రూపాయల ధర వద్ద అందిస్తున్నది. అలాగే గత వారంలో ఇండియాలో విడుదల అయిన రియల్‌మి యొక్క స్మార్ట్ టీవీ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ కూడా రూ.12,500 ధర వద్ద అందిస్తున్నది.


Click it and Unblock the Notifications