Xiaomi Mi బాక్స్ 4K, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి!!!

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ రోజు ఇండియాలో తన సరికొత్త Mi10 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా 4K స్ట్రీమింగ్ పరికరం Mi బాక్స్ మరియు Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 లను కూడా విడుదల చేసింది. నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు యాక్సిస్ ను అందించే Mi బాక్స్ 4K స్ట్రీమింగ్ డివైస్ యొక్క ధర కేవలం రూ.3,499 గా ప్రకటించింది.

షియోమి Mi బాక్స్ 4K

ఈ డివైస్ ఆండ్రాయిడ్ 9 తో రన్ అవుతూ 2Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలి 450 GPU, 2GB DDR3 ర్యామ్ మరియు 8GB eMMC స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ పరికరం డాల్బీ ఆడియోకు తోడుగా 4K రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 వీడియోలకు మద్దతు ఇస్తుందని షియోమి తెలిపింది. ఈ డివైస్ బ్లూటూత్ 4.2 తో పాటు USB 2.0 మరియు HDMI 2.0 పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ పోర్టుల సహాయంతో బయటి స్పీకర్లను కనెక్ట్ చేయడంతో పాటు డిజిటల్ అవుట్ పోర్ట్‌తో సహా బహుళ కనెక్టివిటీ ఎంపికలు ఉంటాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి Mi బాక్స్ 4K డేటా సేవర్ ఫీచర్స్

షియోమి Mi బాక్స్ 4K డేటా సేవర్ ఫీచర్స్

షియోమి ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి మాట్లాడుతూ Mi బాక్స్ 4k నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ మరియు యూట్యూబ్‌ వంటి మరిన్ని వీడియో స్ట్రీమింగ్ యాప్‌లను ముందే ప్రీలోడ్ చేయబడి ఉంటుంది అని తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్

Mi బాక్స్ 4K సహాయంతో మీరు ఏ రకమైన టివితోనైనా కనెక్ట్ చేయవచ్చు. ఇది హెచ్‌డి టివిలు లేదా ఫుల్ హెచ్‌డి టివి లేదా 4K టివిలతో కూడా పనిచేస్తుంది అని షియోమి యొక్క వర్చువల్ లాంచ్ ఈవెంట్‌లో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో 4K శీర్షికలు ఎక్కువగా ప్రసారం అవుతున్నందున వాటిని యాక్సిస్ చేయడానికి షియోమి Mi బాక్స్ 4K సహాయం చేస్తుంది అని తెలిపారు.

Mi బాక్స్ 4K డివైస్

Mi బాక్స్ 4K డివైస్

Mi బాక్స్ 4K డివైస్ గూగుల్ Chromecast ఫీచర్ ను కలిగి ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌తో సహా ఏదైనా పరికరాన్ని టీవీలో ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. Mi బాక్స్ 4K లో గూగుల్ అసిస్టెంట్ ఉన్నందువలన ఇది వినియోగదారులను వారి వాయిస్‌ని ఉపయోగించి కంటెంట్‌ను సెర్చ్ చేయడానికి మరియు కనుగొనటానికి వీలు కల్పిస్తుంది.

డేటా సేవర్ ఫీచర్‌ మద్దతు

డేటా సేవర్ ఫీచర్‌ మద్దతు

డేటా సేవర్ ఫీచర్‌కు మద్దతిచ్చే మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్ట్రీమింగ్ డివైస్ Mi బాక్స్ 4K అని లాంచ్ ఈవెంట్ లో తెలిపారు. అంతేకాకుండా ఇది వినియోగదారులకు వారి డేటా వినియోగం గురించి తరచూ నోటిఫికేషన్లను పంపుతుంది. అలాగే వైఫైని ఉపయోగించకుండా స్థానిక కంటెంట్‌ను టీవీలో ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. OTA అప్ డేట్ ద్వారా డేటా సేవర్ ఫీచర్ ప్రారంభించబడుతుందని షియోమి తెలిపింది.

షియోమి Mi బాక్స్ 4K VS ఫైర్ టివి

షియోమి Mi బాక్స్ 4K VS ఫైర్ టివి

ఆండ్రాయిడ్‌తో రన్ అయ్యే ఈ డివైస్ యొక్క ప్లే స్టోర్‌లో 5000 కి పైగా యాప్‌లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. షియోమి తన వర్చువల్ లాంచ్ ఈవెంట్‌లో Mi బాక్స్ 4K ని ఫైర్ టివితో పోల్చారు. దీని ప్రాసెసర్, కనెక్టివిటీ ఎంపికలు మరియు ఎక్కువ యాప్ లకు మద్దతును ఇవ్వడం ఇందులో హైలైట్ చేస్తుంది.

గీక్‌బెంచ్

షియోమి Mi బాక్స్ 4K మల్టీ గీక్బెంచ్ కోర్ స్కోరు 1752 ను కలిగి ఉంది. ఇది 1.3Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఫైర్ టివి మరియు 1080P రిజల్యూషన్ వరకు మద్దతు గల సింగిల్ కోర్లో గీక్‌బెంచ్ స్కోర్‌లను 430 గా ఇచ్చింది. అదేవిధంగా 1.7 Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఫైర్ టివి 4K సింగిల్ కోర్లో 691 మరియు మల్టీ కోర్లో 1910 స్కోర్‌లను తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ షియోమి ఫైర్ టీవీకి "పరిమిత అనువర్తనాలకు" మద్దతు ఉందని మరియు Chromecast కి మద్దతు ఇవ్వదని హైలైట్ చేసింది. Mi బాక్స్ 4K యొక్క ధర 3,499 రూపాయలు. అలాగే ఫైర్ టివి యొక్క ధర 3,999 రూపాయలు. ఇంకా హెచ్‌డిఆర్ 10 + వీడియోకు సపోర్ట్ చేసే హై స్పెక్స్‌డ్ ఫైర్ టివి 4K ధర 5,999 రూపాయలు.

Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2

Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2

షియోమి Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను కూడా సంస్థ ఈ రోజు లాంచ్ చేసింది. రెండవ తరం Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ తక్కువ ధరను కలిగి ఉండి లాటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్ (LHDC) కు మద్దతుతో "లీనమయ్యే హై డెఫినిషన్ ఆడియో" ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 కేసులో బహుళ అదనపు ఛార్జీలతో 14 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఒకే ఛార్జీలో ఉన్న పరికరం 4 గంటల సమయాన్ని అందిస్తుంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 కేవలం రూ.4499 ధర వద్దనే లభిస్తుందని షియోమి తెలిపింది. అయితే మే 12 నుంచి మే 17 మధ్య పరికరాన్ని కొనుగోలు చేసే వినియోగదారుల కోసం దీనిని రూ.3999 కు కంపెనీ ప్రత్యేక ధర వద్ద అందిస్తున్నట్లు షియోమి తెలిపింది. ఈ పరికరం మి.కామ్ మరియు అమెజాన్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Box 4K and Mi True Wireless Earphones 2 Launched : Price, Spec Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X