షియోమి యొక్క కొత్త Mi వాచ్‌ కలర్‌ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి

|

షియోమి సంస్థ గత నెలలో Mi వాచ్‌ను లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు మరో స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ గొప్ప ఫీచర్లను పూర్తిగా కొత్త ప్యాకేజీలో అందిస్తున్నట్లు ఉంది. షియోమి దీనిని Mi వాచ్ కలర్ అని పిలుస్తోంది.

 Mi వాచ్
 

ఫ్యాషన్ వైపు ఎక్కువగా దృష్టిని సారించి Mi వాచ్ యొక్క సరసమైన వెర్షన్‌గా కనిపిస్తుంది. ఇప్పటివరకు షియోమి వేర్వేరు విభాగాలతో పాటు వాచ్ యొక్క విభిన్న కలర్ వైవిధ్యాలను లీక్ చేసింది. అయితే ఇప్పుడు Mi వాచ్ కలర్ యొక్క మరిన్ని ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Rs.400 బడ్జెట్‌ ధరలో లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న టెల్కోలు

Mi వాచ్ కలర్ స్మార్ట్‌వాచ్‌

షియోమి నుండి వచ్చిన అధికారిక పోస్టర్ల విషయానికి వస్తే డయల్ కోసం Mi వాచ్ కలర్ స్మార్ట్‌వాచ్‌ నలుపు, వెండి మరియు గోల్డ్ వంటి మూడు కలర్ ఎంపికలతో వస్తుంది. Mi వాచ్ కలర్ బ్యాండ్లు పెద్ద సేకరణతో కూడా వస్తుంది. అన్ని రెండర్ల విషయంలో Mi వాచ్ శామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ మాదిరిగానే కనిపిస్తుంది. Mi వాచ్ కలర్ 1.39-అంగుళాల వృత్తాకార డిస్ప్లే ను కలిగి ఉంటుందని షియోమి తెలిపింది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

లీక్ అయిన అన్ని టీజర్ పోస్టర్ల ద్వారా షియోమి యొక్క Mi వాచ్ కలర్‌లో హృదయ స్పందన మానిటర్, అనుకూలీకరించదగిన వాచ్ ఫేసెస్, వాయిస్ అసిస్టెంట్‌కు మద్దతు, బార్‌కోడ్ ఆధారిత పేమెంట్స్ మరియు ఇతర స్మార్ట్ ఫీచర్లలో అనేక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉంటాయని వెల్లడించింది. ఇంటర్ఫేస్ ద్వారా వెళితే Mi వాచ్ కలర్ Mi వాచ్ యొక్క గూగుల్ యొక్క వేర్ MIUI ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తోనే రన్ అవుతున్నట్లు తెలుస్తుంది.

Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

ఫీచర్స్
 

ఫీచర్స్

లీక్ అయిన అన్ని టీజర్ పోస్టర్లతో పాటు రిటైల్ బాక్సుల యొక్క కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇవి స్మార్ట్‌వాచ్ గురించి చాలా సమాచారాన్ని వెల్లడిస్తాయి. వృత్తాకార డిస్ప్లే ను కలిగిన Mi వాచ్ కాలర్ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉన్నది. డిస్ప్లే 454 x 454 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది లైవ్-ఆధారిత సేవల మద్దతు కోసం GPS మరియు GLONASS ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇది 420 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది కనీసం ఒక రోజు బ్యాకప్‌ను అందిస్తుంది.

Mi వాచ్ కలర్‌

జనవరి 3 న చైనాలో Mi వాచ్ కలర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు షియోమి ప్రకటించింది. షియోమి ఫ్యాషన్ మరియు కలర్ లపై అధికంగా వెళుతున్నందున Mi వాచ్ కంటే కొంచెం తక్కువ ధర నిర్ణయించబడుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 చిప్‌ను కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.

మి వాచ్

షియోమి గ్లోబల్ మార్కెట్లలో మి వాచ్ కలర్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకుంటే, అది గూగుల్ యొక్క వేర్ ఓఎస్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అయితే వాచ్ కోసం ఎంఐయుఐ మాదిరిగానే కస్టమైజేషన్ ఎంపికలను కలిగి ఉండవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi's Mi Watch Color Features,Specifications and Photos Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X