స్మార్ట్‌ఫోన్ ఆనారోగ్యాలకు క్రేజీ పరిష్కారాలు!

Posted By:

‘‘బియ్యంలో కాస్త ఆయిల్ జోడించి తక్కువ వేడి ఉష్టోగ్రత వద్ద వేయించండి'' ఇదేదో వంట తయారీ కార్యక్రమం అనుకుంటే పొరపడినట్లే. ఇలాంటి క్రేజీ ప్రక్రియలు ఆనారోగ్యం బారిన పడిన మీ స్మార్ట్‌ఫోన్‌ను కాపాడగలవు. వీటిని ఆచరించటం ద్వారా మీ
స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు. వివిధ రుగ్మతలకు గురైన ఫోన్‌ను సాధారాణ స్థితికి చేర్చేందుకు పలువురు సూచించిన వంటింటి క్రేజీ పరిష్కార మార్గాలను మీ ముందుంచుతున్నాం........

బెస్ట్ మొబైల్ ఫోన్‌లు (రూ.999 ధరల్లో)

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

మొబైల్ ఫోన్‌ల అసాధారణ ఆకారాలు!

తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేయించిన బ్లాక్‌బెర్రీ ( Baked Blackberry):

ఫిషింగ్.. బోటింగ్.. స్విమ్మింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గోనేముందు మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను మీ నుంచి దూరంగా ఉంచటం మంచిది. ఐదు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి తన బ్లాక్ బెర్రీ 8700 మోడల్ ఫోన్‌ను నీటిలో పడేసుకున్నాడు. ఫోన్ మళ్లి పనిచేస్తుందన్న ఆశ అతనికి లేదు. అయితే మిత్రుని సలహాతో తన తడిచిన బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను వెచ్చని ఓవెన్‌లో ఉంచి మిశ్రమ ఫలితాలను రాబట్టాడు. తడిచిన స్మార్ట్‌ఫోన్‌ను వేడిచేసి ముందు బ్యాటరీని తప్పనిసరిగా తొలగించాలి. అలాగే ఓవెన్ వేడి 200 డిగ్రీలై ఉండాలి. 20 నిమిషాల పాటు ఈ ప్రక్రియను కొనసాగించాలి.

తాగుబోతు ఆండ్రాయిడ్ (Drunken Android):

సముద్రపు నీటిలో తడిచిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఐసోప్రొపైల్ అనే మద్యాన్ని ఉపయోగించి 24 గంటల పాటు మర్దన చేయటం ద్వారా
ఫోన్ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. (గమనిక: చికిత్స సమయంలో ఫోన్‌ను పూర్తిగా ఆఫ్ చేయాల్సి ఉంటుంది).

టూత్‌పేస్ట్ మీ స్మార్ట్‌ఫోన్‌లను బలంగా చేస్తుంది (Toothpaste Builds Strong Phones, Too):

సీడీ ఇంకా డీవీడీలను క్లీన్ చేసేందుకు టూత్ పేస్ట్‌ను ఉపయోగించవచ్చన్న విషయం మనకు తెలిసిందే. అయితే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై ఏర్పడ్డ గీతలను మటుమాయం చేయటంలోనూ టూత్ పేస్ట్ దోహదపడుతుందట. టూత్‌పేస్ట్‌ను గీతలు ఏర్పడిన ఫోన్ స్ర్కీన్ పై అప్లై చేసి మెత్తటి కాటన్ గుడ్డతో శభ్రం చేయాల్సి ఉంటుంది.

శాకాహార నూనెతో ఫోన్ గీతలు మటుమాయం (Uses For Vegetable Oil):

శాకాహార (కాయగూరుల) నూనెలను ఉపయోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై ఏర్పడ్డ గీతలను మటుమయాం చేయేచ్చట. గీతలు ఏర్పడిన ఫోన్ స్ర్కీన్ పై నూనెను అప్లై చేసి మెత్తటి కాటన్ గుడ్డతో శభ్రం చేస్తే సరి.

ఐస్‌లో బ్యాటరీలు (Batteries On Ice):

సాధారణంగా కెమెరాలోని బ్యాటరీలను అప్పడప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంటాం. తక్కువుగా ఉపయోగించటంతో ఇవి మన్నికను కోల్పొతుంటాయి. వీటిని చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచటం ద్వారా మన్నికైన పనితీరును కనబరుస్తాయని పలువురు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting