గూగుల్ మ్యాప్స్‌లో మీ ఇల్లు, షాపును నిమిషాల్లో చేర్చవచ్చు.. ఎలాగో తెలుసుకోండి!
Google Maps: గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ చాలా పాపులర్ అయ్యింది. ఇది దారి తెలీనప్పుడు దిక్సూచిలా పనిచేస్తుంది. ఇందులో చాలా ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నాయి. వాటిలోని ఒక ఫీచర్ తో మీ హోం, వర్క్ అడ్రస్‌లను సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతిసారి అడ్రస్ టైప్ చెయ్యకుండానే టక్కున డైరెక్షన్స్ చూసుకోవచ్చు. అంతేకాదు, మీ షాపు లేదా ఏదైనా పబ్లిక్ ప్లేస్‌ను కూడా మ్యాప్స్‌లో యాడ్ చేస్తే, ఎవరికైనా ఈజీగా కనిపెట్టేయొచ్చు.
చాలామందికి ఇది ఎలా చెయ్యాలో తెలీదు. మీ హోం, షాపు లేదా మ్యాప్‌లో మిస్సైన ప్లేస్‌ని గూగుల్ మ్యాప్స్ లో ఎలా యాడ్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చూద్దాం. ముందుగా వ్యక్తిగత అవసరాల కోసం ఇంటి అడ్రస్‌ను గూగుల్ మ్యాప్స్ లో ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

* ఇంటిని గూగుల్ మ్యాప్స్‌లో చేర్చడం
స్టెప్ 1: మీ హోం లొకేషన్‌కు ఈజీగా వెళ్లాలంటే, గూగుల్ మ్యాప్స్ లో 'హోం’ అని సేవ్ చేసుకోవచ్చు. ఇది పర్సనల్, మీకు మాత్రమే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్‌లో (Android/iPhone) గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్‌లో "హోం" అని టైప్ చేయాలి.
స్టెప్ 2: ఒకవేళ అడ్రస్ అడిగితే, మీ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. (ఎగ్జాంపుల్: "12-3-45, హైదరాబాద్, తెలంగాణ"). పిన్ కరెక్ట్‌గా మీ హోం దగ్గరే ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాంగ్ ప్లేస్‌లో ఉంటే, పిన్‌ని కరెక్ట్ స్పాట్‌కి డ్రాగ్ చేయాలి. 'సెట్ హోం’ లేదా 'సేవ్’ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
* కంప్యూటర్‌లో చేర్చడం
స్టెప్ 1: గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ మెనూ క్లిక్ చేసి “యువర్ ప్లేసెస్” ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. “లేబుల్డ్” ట్యాబ్ కింద, “హోం” ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ అడ్రస్ ఎంటర్ చేసి “సేవ్” క్లిక్ చేయాలి, అంతే.
స్టెప్ 2: ఇప్పుడు మీరు Google Maps లో “హోం” అని సెర్చ్ చేసినా లేదా గూగుల్ అసిస్టెంట్‌ను “నావిగేట్ టు హోం” అని అడిగినా, తక్షణమే డైరెక్షన్స్ చూపిస్తుంది. ఇంటికి వెళ్లాలనుకున్నప్పుడు ఈ డైరెక్షన్స్ ఈజీగా ఫాలో అవుతూ వెళ్లొచ్చు. వేరే వారికి కూడా ఇంటి లోకేషన్ షేర్ చేస్తే వారూ ఈజీగా చేరుకుంటారు.
* షాపు లేదా హౌస్ లాంటి పబ్లిక్ ప్లేస్‌ను చేర్చొచ్చు
మీకు షాపు ఉంటే లేదా మీ హౌస్‌ని అందరికీ కనిపించేలా మ్యాప్‌లో పెట్టాలనుకుంటే, దాన్ని గూగుల్ మ్యాప్స్ లో “యాడ్ ఎ మిస్సింగ్ ప్లేస్” గా యాడ్ చెయ్యొచ్చు. మీరు సబ్‌మిట్ చేసిన తర్వాత గూగుల్ రివ్యూ చేసి మ్యాప్స్‌లో చూపిస్తుంది.
* మొబైల్ ఫోన్‌లో షాప్ చేర్చడం
స్టెప్ 1: గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ షాపు లేదా హౌస్ అడ్రస్ కోసం సెర్చ్ చేయండి. ఒకవేళ అది మ్యాప్‌లో లేకపోతే, మ్యాప్‌లో ఆ లొకేషన్‌ను లాంగ్ ప్రెస్ చేసి పిన్ డ్రాప్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి “యాడ్ ఎ మిస్సింగ్ ప్లేస్” ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
స్టెప్ 2: డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ముందుగా షాపు లేదా హౌస్ నేమ్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు "కిరణ్ స్టోర్" లేదా "రామ్ నివాస్". కేటగిరీ సెక్షన్‌లో షాపు కోసం “స్టోర్/షాప్” అని, హౌస్ కోసం “రెసిడెన్షియల్” అని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3: అడ్రస్ సెక్షన్‌లో మొత్తం అడ్రస్ టైప్ చేయాలి. ఫోన్ నంబర్, వెబ్‌సైట్ ఉంటే ఆ వివరాలను కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకొని చివరగా "సబ్‌మిట్” ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. అంటే ఈజీగా మొబైల్‌లోనే గూగుల్ మ్యాప్స్ వేదికగా మీ షాపు చేర్చినట్లు అవుతుంది.
* కంప్యూటర్‌లో షాపు చేర్చడం..
స్టెప్ 1: గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్ లో ఉన్న మెనూ క్లిక్ చేసి “యాడ్ ఎ మిస్సింగ్ ప్లేస్” ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అడిగిన వివరాలన్నీ చాలా జాగ్రత్తగా పూరించాలి.
స్టెప్ 2: పిన్‌ను మ్యాప్‌లో కరెక్ట్‌గా ప్లేస్ చేయండి. “సబ్‌మిట్” క్లిక్ చేయండి. గూగుల్ మీ సబ్‌మిషన్‌ను రివ్యూ చేస్తుంది, ఒకవేళ అప్రూవ్ అయితే, కొన్ని రోజుల్లో అది మ్యాప్స్‌లో కనిపిస్తుంది.
* బిజినెస్‌ను చేర్చడం
మీకు షాపు లేదా బిజినెస్ ఉంటే, 'గూగుల్ మై బిజినెస్' ద్వారా లిస్ట్ చేయడం మంచిది. దీనివల్ల కస్టమర్లకు ఓపెనింగ్ అవర్స్, రివ్యూస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లాంటి వివరాలు అన్నీ తెలుస్తాయి. గూగుల్ మై బిజినెస్ వెబ్‌సైట్‌కి వెళ్లి సైన్ ఇన్ అయ్యాక, "యాడ్ యువర్ బిజినెస్" క్లిక్ చేసి షాపు పేరు, అడ్రస్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
ఫోన్ నంబర్, వెబ్‌సైట్ వంటి వివరాలు కూడా జోడించవచ్చు. గూగుల్ మీకు పోస్ట్ కార్డు ద్వారా వెరిఫికేషన్ కోడ్ పంపుతుంది, అది రావడానికి 5 నుంచి 14 రోజులు పట్టవచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మీ బిజినెస్ గూగుల్ మ్యాప్స్ లో కనిపించడం మొదలవుతుంది.


Click it and Unblock the Notifications








