ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్లూటూత్ కోడెక్‌లను మార్చడం ఎలా?

|

బ్లూటూత్ ఆడియో ఇంకా క్రొత్తగా ఉన్నప్పుడు వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు మరియు వైర్డు హెడ్‌ఫోన్‌ల మధ్య సౌండ్ నాణ్యతలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. వైర్‌లెస్ ఆడియో ఉత్పత్తుల ధరల మాదిరిగానే ఆ తేడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను మంచి ఆడియో పనితీరుతో రూ. 5,000లలోపు నేరుగా పొందవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్లూటూత్ కోడెక్‌లను మార్చడం ఎలా?

 

అయినప్పటికీ వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగిస్తున్నప్పుడు మీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు మరియు ఇయర్‌ఫోన్‌ల నుండి కొంచెం ఎక్కువ నాణ్యమైన సౌండ్ పొందడానికి మీకు సహాయపడే చిన్న, శీఘ్ర మరియు సరళమైన ఫ్రీ ట్రిక్స్ ఉన్నాయి. అది బ్లూటూత్ కోడెక్‌ను సర్దుబాటు చేయడం. మీ Android స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ద్వారా ఆడియోను ఉచితంగా ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి.

బ్లూటూత్ కోడెక్ అంటే ఏమిటి?

బ్లూటూత్ కోడెక్ అంటే ఏమిటి?

బ్లూటూత్ అనేది ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ లేదా ‘కోడ్' పై ఆధారపడుతుంది. ఇది సోర్స్ డివైస్ నుండి డేటాను త్వరగా మరియు సజావుగా వైర్‌లెస్‌గా ప్రసారం చేయడానికి కంప్రెస్ చేయబడి ఉంటుంది. ఆపై హెడ్‌సెట్ లేదా స్పీకర్‌లోని డేటాను డీకంప్రెస్ చేస్తుంది. వేర్వేరు కోడెక్‌లు భిన్నంగా పనిచేస్తాయి. కొన్ని కొత్త మరియు అధునాతన కోడెక్‌లు ఎక్కువ డేటా ప్యాకెట్లను సమర్థవంతంగా బదిలీ చేయగలవు.

సర్వసాధారణంగా ఉపయోగించే బ్లూటూత్ కోడెక్ SBC (సబ్ బ్యాండ్ కోడెక్) సార్వత్రిక ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఇది ఈ రోజు చుట్టూ ఉన్న ప్రతి బ్లూటూత్ పరికరంలో ఉంది. అయినప్పటికీ AAC (అడ్వాన్స్‌డ్ ఆడియో కోడింగ్) క్వాల్కమ్ aptX మరియు సోనీ LDACలతో అధునాతన కోడెక్‌లు ఉన్నాయి.

ఇది ఎలా పని చేస్తుంది?:
 

ఇది ఎలా పని చేస్తుంది?:

చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఓరియో మద్దతు నుండి ఉపయోగంలో ఉన్న కోడెక్‌ను సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ సాధారణంగా డిఫాల్ట్‌గా SBC కోడెక్‌ను ఎంచుకుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీకు అందుబాటులో ఉంటే మీరు మంచి కోడెక్‌కు మారవచ్చు. AptX లేదా aptX HD కోడెక్‌లకు మద్దతిచ్చే హెడ్‌ఫోన్‌లతో క్వాల్కమ్ చిప్‌సెట్-శక్తితో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్ స్వయంచాలకంగా కోడెక్‌ను ఎంచుకుంటుంది.

ఇతర సమయాల్లో కోడెక్ మారడం ఒక మాన్యువల్ ప్రక్రియ. గుర్తుంచుకోండి ఇది పనిచేయడానికి హెడ్‌ఫోన్‌లు లేదా స్పీకర్ కూడా కోడెక్‌కు మద్దతు ఇవ్వాలి. అదృష్టవశాత్తూ ఇది ఆండ్రాయిడ్ 8.0 ఓరియో మరియు తరువాత వెర్షన్లలో పనిచేసే సులభమైన ప్రక్రియ.

ఏ కోడెక్ ఎంచుకోవాలి?:

ఏ కోడెక్ ఎంచుకోవాలి?:

మీ స్మార్ట్‌ఫోన్‌ బ్లూటూత్ ద్వారా హెడ్‌ఫోన్‌లకు ఏ కోడెక్‌లకు మద్దతు ఇస్తుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముందుగా మీరు కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేసే ముందు పరిశీలించాల్సిన విషయం ఇది. ఇవి క్వాల్కమ్ aptX మరియు సోనీ LDAC వంటి అధిక-నాణ్యత కోడెక్‌లకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ముక్యంగా చూడవలసిన విషయం. అయితే ఇది సాధారణంగా హై-ఎండ్ హెడ్‌ఫోన్‌లు మరియు ఇయర్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం.

సరసమైన ధర గల హెడ్‌ఫోన్‌లు SBC కాకుండా AAC కోడెక్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ సందర్భాలలో AAC కి మానవీయంగా మారడం మీ హెడ్‌ఫోన్‌లలో ఆడియో నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే SBC కన్నా AAC అధునాతన కోడెక్. హై-ఎండ్ హెడ్‌ఫోన్‌లు క్వాల్‌కామ్ aptX లేదా సోనీ LDAC కి మారడం వల్ల సౌండ్ క్వాలిటీ గణనీయంగా మెరుగుపడుతుంది. చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో aptX స్వయంచాలకంగా యాక్టివేట్ అయితే LDAC చాలా సందర్భాలలో మాన్యువల్‌గా యాక్టివేట్ అవుతుంది.

మీ Android స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ కోడెక్‌ను ఎలా మార్చాలి:

మీ Android స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ కోడెక్‌ను ఎలా మార్చాలి:

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే బ్లూటూత్ ద్వారా ఆడియో నాణ్యతను మెరుగుపరచడం కోసం బ్లూటూత్ కోడెక్‌ను ఎలా మార్చాలో తెలుసుకోవడానికి కింద కొన్ని సూచనలు ఉన్నాయి వాటిని పాటించండి :

1* మీ స్మార్ట్‌ఫోన్‌లో డెవలపర్ ఎంపికలను ఇప్పటికి చేయకన్న ఉంటే వాటిని సక్రియం చేయండి. మీ Android స్మార్ట్‌ఫోన్ యొక్క సెట్టింగ్‌లు> అబౌట్ ఫోన్ / అబౌట్ డివైస్ > ఫోన్ యొక్క బిల్డ్ నంబర్‌ను ఏడుసార్లు త్వరగా టాప్ చేయండి. ఇలా చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో డెవలపర్ ఎంపికలను ప్రారంభిస్తుంది. డివైస్ కోసం మరిన్ని ట్వీక్‌లు మరియు సెట్టింగ్‌లకు యాక్సిస్ ను ఇస్తుంది. డెవలపర్ ఎంపికలు యాక్టీవ్ అయిన తర్వాత వాటిని సెట్టింగుల మెనులో చూడవచ్చు.

2* ఇప్పుడు మీ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లను జత చేసి వాటిని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయండి.

3* సెట్టింగుల క్రింద ఉన్న డెవలపర్ ఎంపికలలో బ్లూటూత్ ఆడియో కోడెక్‌ను క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని నొక్కండి.

4* డిఫాల్ట్ SBC ఎంపిక కాకుండా కోడెక్లలో ఒకదాన్ని ఎంచుకోండి. మీ హెడ్‌ఫోన్‌లు కోడెక్‌కు మద్దతు ఇస్తే అది ఎంచుకున్న ఎంపికను ఉపయోగిస్తుంది మరియు సౌండ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
change bluetooth codec android support improve audio quality

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more