గొప్ప ఫీచర్స్ తో Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు

|

షియోమి సంస్థ దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లైన రెడ్‌మి K20 మరియు రెడ్‌మిK20 ప్రోలను ప్రారంభించింది. ఏదేమైనా షియోమి సంస్థ మొదటి నుండి దేశంలో ఒకపెద్ద ఈవెంట్ చేసినప్పుడు అది ప్రారంభించబోయేది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు. ఈ లాంచ్‌లతో పాటు షియోమి బ్రాండ్ తన భారతీయ కొనుగోలుదారుల కోసం తీసుకువచ్చే కొన్ని ఇతర ప్రోడక్టులు కూడా ఉన్నాయి.

xiaomi beckband bluetooth earphones

అదేవిధంగా ఈసారి కూడా షియోమి రెడ్‌మి K20 ప్రో, రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్‌లతో పాటు Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లను కూడా విడుదల చేసింది. షియోమి రూపొందించిన ఈ కొత్త ఇయర్‌ఫోన్‌లు మైక్రో-ఆర్క్ కలర్ డిజైన్‌తో వస్తాయి. మరియు ఇవి బ్లూటూత్ V5.0 కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు ఒక ఛార్జీతో 8 గంటల బ్యాటరీ లైఫ్ ని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని షియోమి పేర్కొంది.

xiaomi beckband bluetooth earphones

ఇది మాత్రమే కాదు ఈ ఇయర్ ఫోన్స్ ట్రై-బ్యాండ్ ఈక్వలైజేషన్ మరియు డైనమిక్ బాస్ వంటి ఫీచర్స్ లను కూడా అందిస్తాయి. షియోమి తన ఈవెంట్ కార్యక్రమంలో Mi రీఛార్జిబుల్ LED లాంప్ ధరను కూడా ప్రకటించింది. ఇది క్రౌడ్ ఫండింగ్ ప్రచారంలో భాగంగా అమ్మకానికి వెళ్లనుంది.

Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వివరాలు:

Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వివరాలు:

Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల మొదటి అమ్మకం జూలై 23 నుండి విక్రయించబడుతుందని చైనా తయారీదారు షియోమి ప్రకటించారు. వీటి యొక్క ధర 1,599 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్, Mi.com ద్వారా లభిస్తాయి. ఈ ఇయర్ ఫోన్లు మైక్రో-ఆర్క్ కోలార్ డిజైన్‌తో వస్తాయి. ఇయర్ ఫోన్లు యాంటీ-స్లిప్ అయిన స్కిన్-ఫ్రెండ్లీ రబ్బరు పదార్థంతో తయారయి చాలా సౌకర్యవంతంగా మరియు అనువైనదని షియోమి తెలిపింది. ఈ ఇయర్‌ఫోన్‌ల బరువు కేవలం 13.6 గ్రాములు మాత్రమే.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

Mi నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ వాయిస్ కమాండ్ ఫీచర్‌ను కూడా అనుమతిస్థాయి. ఇది వినియోగదారులను నావిగేట్ చేయడానికి, కాల్స్ తీసుకోవడానికి మరియు వారి డిమాండ్ మేరకు సంగీతాన్ని ప్లే చేయడానికి అనుమతిస్తుంది. ఇది మీ ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన వాయిస్ అసిస్టెంట్‌తో సులభంగా జత చేయబడుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే షియోమి యొక్క నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తాయి. అదనంగా అవి HFP, A2DP , HSP మరియు AVRCP ప్రోటోకాల్‌లకు కూడా మద్దతునిస్తాయి. ఈ Mi నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు 10 మీటర్ల వరకు మద్దతు ఇస్తాయి.

Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ బ్యాటరీ లైఫ్ మరియు ఇతర ఫీచర్లు:

Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ బ్యాటరీ లైఫ్ మరియు ఇతర ఫీచర్లు:

బ్యాటరీ విషయానికొస్తే Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు 120mAh బ్యాటరీని అందిస్తున్నాయి. ఈ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌కు మద్దతు ఇస్తాయని షియోమి పేర్కొంది. ఇయర్‌ఫోన్‌లలో బ్యాటరీ స్టాండ్‌బై సమయం 260 గంటలు . ఈ ఇయర్‌ఫోన్‌ల ఛార్జింగ్ 0 నుండి పూర్తిస్థాయికి వెళ్ళడానికి రెండు గంటల సమయం పడుతుందని షియోమి తెలిపింది. ఈ రెండు గంటల ఛార్జ్‌లో Mi నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు వినియోగదారులు 8 గంటల ప్లే టైమ్‌ని పొందగలరని చెప్పారు.

Mi రీఛార్జబుల్ LED లాంప్ వివరాలు:

Mi రీఛార్జబుల్ LED లాంప్ వివరాలు:

పైన చెప్పినట్లుగా ఇయర్‌ఫోన్‌లతో పాటు షియోమి Mi రీఛార్జిబుల్ ఎల్‌ఇడి లాంప్ ను కూడా ప్రకటించింది. ఇది 1,499 రూపాయలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్రచారం సందర్భంగా Mi రీఛార్జబుల్ LED లాంప్ 1,299 రూపాయల తగ్గింపు ధరతో లభిస్తుంది. క్రౌడ్ ఫండింగ్ ప్రచారం జూలై 18, 2019 నుండి ప్రారంభమవుతుందని షియోమి ప్రకటించారు.

Best Mobiles in India

English summary
xiaomi beckband bluetooth earphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X