Home
How to

COVID-19 పరీక్షా కేంద్రాలను గూగుల్ మ్యాప్స్, యాప్ ద్వారా కనుగొనడం ఎలా?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా చాలా మంది భయాందోళనలకు గురిఅవుతున్నారు. ప్రజలు ముందుజాగ్రత్తగా పరీక్షలను చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది పరీక్షలను చేయడానికి భయపడుతూ ఉంటారు.

COVID-19 పరీక్షా కేంద్రాలు

COVID-19 పరీక్షా కేంద్రాలు

మీకు దగ్గరలో గల COVID-19 పరీక్షా కేంద్రాలను కనుగొనడంలో గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత సహాయం చేస్తుంది అని కంపెనీ ప్రకటించింది. మీకు సమీపంలోని COVID-19 పరీక్షా కేంద్రాలపై సమగ్ర సమాచారాన్ని కనుగొనడంలో వినియోగదారులకు సహాయపడటానికి గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ మరియు గూగుల్ మ్యాప్స్‌లలో కొత్త ఫీచర్‌ను జోడిస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. Also Read:Android 11 beta అప్‌డేట్‌ను అందుకుంటున్న షియోమి,వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

 

గూగుల్ - COVID-19 ట్రాకింగ్ ఫీచర్

గూగుల్ - COVID-19 ట్రాకింగ్ ఫీచర్

గూగుల్ యొక్క COVID-19 ట్రాకింగ్ ఫీచర్ ఇంగ్లీష్ మరియు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ మరియు గుజరాతీలతో సహా మరో ఎనిమిది భాషలలో లభిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్ లలో అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: D2h HD STBను కొనాలనుకుంటున్నారా!!! అయితే ఈ ఆఫర్ చూడండి...

గూగుల్ యాప్ లలో COVID-19 ఫీచర్

గూగుల్ యాప్ లలో COVID-19 ఫీచర్

గూగుల్ యాప్ లలో "కరోనావైరస్ టెస్టింగ్," "కోవిడ్ 19 టెస్టింగ్" లేదా "కోవిడ్ టెస్టింగ్" వంటి కీలకమైన పదాలతో మీరు సెర్చ్ చేయడంతో మీకు దగ్గరలో ఉన్న అధీకృత COVID-19 పరీక్షా కేంద్రాల యొక్క పూర్తి సమాచారాన్ని చాలా సులభంగా పొందవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ లో COVID-19 ఫీచర్

గూగుల్ అసిస్టెంట్ లో COVID-19 ఫీచర్

గూగుల్ అసిస్టెంట్‌ ద్వారా మీకు దగ్గరలో గల COVID-19 పరీక్షా కేంద్రాల వివరాలను సెర్చ్ చేస్తున్నపుడు వినియోగదారులు సెర్చ్ ఫలితాల పేజీలో 'టెస్టింగ్' టాబ్‌ను గుర్తించగలుగుతారు. ఇది వినియోగదారులకు తమ సమీపంలో గల టెస్టింగ్ ల్యాబ్‌ల జాబితాను మరియు వారి సేవలను ఉపయోగించే ముందు అవసరమైన కీలక సమాచారంను మరియు దాని యొక్క మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అలాగే ఈ టాబ్ కరోనావైరస్ యొక్క సంబంధిత అప్ డేట్ సమాచారంను దాని దిగువన తెలియజేస్తుంది.

గూగుల్ మ్యాప్స్ లో COVID-19 ఫీచర్

గూగుల్ మ్యాప్స్ లో COVID-19 ఫీచర్

గూగుల్ సెర్చ్ మరియు గూగుల్ మ్యాప్స్ లలో కూడా COVID-19 ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది మీకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇది ఒక నిర్దిష్ట ట్యాబ్ క్రింద ఫలితాలను చూపుతుంది. ఇందులో పరీక్షా కేంద్రాలకు రూట్ మ్యాప్ ను కూడా చూపుతుంది. ముఖ్యంగా మూడు యాప్ లలో వినియోగదారులు పరీక్షా కేంద్రం ప్రైవేట్ సంస్థ లేదా ప్రభుత్వం నడుపుతుందా అని కూడా తనిఖీ చేయవచ్చు.

గూగుల్ లో COVID-19 ఫీచర్ పనితీరు

గూగుల్ లో COVID-19 ఫీచర్ పనితీరు

అధీకృత టెస్టింగ్ ల్యాబ్‌లపై వినియోగదారులకు సమాచారం అందించడానికి కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు మైగోవ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గూగుల్ తన ట్విట్టర్ యొక్క అకౌంటులో ఒక ట్వీట్‌ ద్వారా పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ 300 నగరాల్లోని 700 కి పైగా పరీక్షా కేంద్రాలను గూగుల్ సెర్చ్, అసిస్టెంట్ మరియు మ్యాప్‌ల ద్వారా సులభంగా గుర్తించగలదు. దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని పరీక్షా కేంద్రాలను గుర్తించడానికి మరియు జోడించడానికి గూగుల్ ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తోంది.

Best Mobiles in India

English summary
Find Official COVID-19 Testing Centers Nearby your Place on Google
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X