Home
News

d2h Combo Offer: D2h HD STBను కొనాలనుకుంటున్నారా!!! అయితే ఈ ఆఫర్ చూడండి...

డిటిహెచ్ రంగంలో అధిక సంఖ్యలో చందాదారులను కలిగి ఉన్న డిష్ టీవీ యాజమాన్యంలోని D2h ఇప్పుడు తన వినియోగదారులకు ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది. D2h యొక్క HD సెట్-టాప్ బాక్స్ మరియు d2h మ్యాజిక్ స్టిక్ రెండు కలిపి తక్కువ ధర వద్ద కాంబో ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఇప్పుడు ఖచ్చితమైన ధరలతో D2h యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది.

D2h కాంబో ఆఫర్

D2h కాంబో ఆఫర్

D2h తన చందాదారులకు ముందునుంచి కూడా సరసమైన ధరల వద్ద అద్భుతమైన ఒప్పందాలను మరియు ఆఫర్లను అందించడంలో అందరికంటే ముందు ఉన్నది. డి 2 హెచ్ సంస్థ గత సంవత్సరం మ్యాజిక్ స్టిక్‌ను రూ.399 ధర వద్ద విడుదల చేసింది. అలాగే ఈ ఆపరేటర్ తన HD సెట్-టాప్ బాక్స్ ను రూ.1,998 ధర వద్ద అందిస్తున్నది.

D2h కాంబో ఆఫర్ ధర

D2h కాంబో ఆఫర్ ధర

D2h ప్రవేశపెట్టిన కాంబో ఆఫర్లో భాగంగా ఈ రెండింటిని రూ.2,198 ధర వద్ద పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్‌తో D2h యూజర్లు ఎక్కువ మొత్తం ఆదా చేయగలరు. అయితే రాబోయే రోజుల్లో ఈ ఆఫర్‌కు కొన్ని మార్పులు జరగవచ్చు. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Mi NoteBook 14 Series ల్యాప్‌టాప్‌లతో దూసుకొస్తున్న షియోమి!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

D2h HD STB మరియు మ్యాజిక్ స్టిక్ కాంబో ఆఫర్

D2h HD STB మరియు మ్యాజిక్ స్టిక్ కాంబో ఆఫర్

డి 2 హెచ్ ఇంతకుముందు డి 2 హెచ్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ ధరను మ్యాజిక్ స్టిక్‌తో కలిపి రూ.1,599 గా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు కాంబో ఆఫర్‌లో ఒక నెల గోల్డ్ హెచ్‌డి ఛానల్ ప్యాక్ యొక్క సభ్యత్వం కూడా ఉంది. అయితే డి 2 హెచ్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ యొక్క ధర ఒక్కటే రూ.1,799 గా ఉండటంతో వెబ్‌సైట్‌లో లిస్టింగ్ తప్పుగా జాబితా చేయబడింది.

D2h కాంబో ప్లాన్ లో 1 నెల ప్లాటినం HD సభ్యత్వం

D2h కాంబో ప్లాన్ లో 1 నెల ప్లాటినం HD సభ్యత్వం

D2h HD STB ప్లస్ తో కలిపి మ్యాజిక్ స్టిక్ యొక్క కాంబో ఆఫర్ యొక్క కొత్త అప్ డేట్ ల ప్రకారం దీని ధర రూ.2,198 గా ఉంది. ప్రస్తుతం కాంబో కోసం ఆపరేటర్ ఎటువంటి డిస్కౌంట్ ఆఫర్ అందించడం లేదు. అయితే వినియోగదారులు ఈ కాంబో ఆఫర్లో భాగంగా ఒక నెల ప్లాటినం హెచ్‌డి సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. ఒక కస్టమర్ ఈ ఉత్పత్తులను విడిగా ఎంచుకుంటే కనుక వారు హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌తో HD గోల్డ్ ప్యాక్‌ను ఎంచుకోవడానికి వారు రూ.200 అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. Also Read:Disney+ Hotstar VIP ను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్,జియోలలో ఏది బెస్ట్?

d2h మ్యాజిక్ స్టిక్ ఆఫర్ ఫీచర్స్

d2h మ్యాజిక్ స్టిక్ ఆఫర్ ఫీచర్స్

ZEE5, సోనీ LIV, వాచో వంటి మరెన్నో ప్రసిద్ధి చెందిన ఛానల్లు ఒకే OTT ప్లాట్‌ఫారమ్‌ల మీద ప్రపంచానికి అందించడానికి d2h సంస్థ తన మ్యాజిక్ స్టిక్ ను పరిచయం చేసింది.అలాగే 30,000+ అలెక్సా ఫీచర్లకు కూడా మ్యాజిక్ స్టిక్ యాక్సిస్ ను ఇస్తుంది. d2h మ్యాజిక్ స్టిక్ వాయిస్-ఎనేబుల్ ఫీచర్ తో వస్తుంది. ఇది వినియోగదారులను వాతావరణ అప్ డేట్ లు, మ్యూజిక్ వంటివి మరెన్నో వివరాలను వాయిస్ ద్వారా కనుగొనడానికి అనుమతిస్తుంది. d2h మ్యాజిక్ స్టిక్ రూ.399 ధర వద్ద లభిస్తుంది. అయితే వాయిస్-ఎనేబుల్డ్ D2h మ్యాజిక్ స్టిక్ యొక్క ధర రూ.1,199. ఇది వాయిస్-రిమోట్, వై-ఫై మరియు బ్లూటూత్ డాంగల్ ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
D2h Brings HD RF Set-Top Box, d2h Magic Stick for Rs 2,198
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X