Android 11 beta అప్‌డేట్‌ను అందుకుంటున్న షియోమి,వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...
గూగుల్ సంస్థ ఇటీవలే ఆండ్రాయిడ్ 11 బీటాను ప్రారంభించింది. ఔత్సాహికులు తమ ఆండ్రాయిడ్ డివైస్ లలో కొత్త అప్‌డేట్‌ను ప్రయత్నించడానికి వీలు కల్పించారు. గూగుల్ ఇప్పటికే తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 11 బీటా 1 అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 11 బీటా అప్‌డేట్
ఇప్పుడు ఇతర బ్రాండ్ల యొక్క తమ తాజా ఫోన్లలో వినియోగదారులు రాబోయే ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అనుభవించగలరని ప్రకటించాయి. ఇందులో భాగంగా Mi10, Mi 10 ప్రో ఫోన్‌లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 బీటా 1 లభిస్తుందని షియోమి ధృవీకరించింది. మరోవైపు వన్‌ప్లస్ యొక్క సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో రెండింటికీ కూడా ఆండ్రాయిడ్ 11 బీటా అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ తెలిపింది. Also Read:Rs.20,000 ధర లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

షియోమి ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్
చైనీస్ టెక్ దిగ్గజం షియోమి దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 11 బీటా అప్‌డేట్ ను తీసుకువస్తున్నట్లు ధృవీకరించింది. ఇందులో భాగంగా మొదట పోకో F2 ప్రోతో పాటు Mi 10 సిరీస్‌లలో Mi 10 మరియు Mi10 ప్రోలకు ఆండ్రాయిడ్ 11 బీటాను విడుదల చేయనుంది. Mi10 సిరీస్ మరియు పోకో F2 ప్రో కోసం విడుదల అయిన ఆండ్రాయిడ్ 11 బీటాను షియోమి సంస్థ MIUI ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ ద్వారా తెలిపింది. అదేవిధంగా ఒప్పో ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్ ఫైండ్ X2 సిరీస్‌కు ఆండ్రాయిడ్ 11 బీటాను కలర్‌ఓఎస్‌తో లభిస్తుందని ప్రకటించింది. Also Read:BSNL తక్కువ ధర ప్లాన్‌లలో గొప్ప ప్రయోజనాలతో సరికొత్త సవరణలు...

వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్
వన్‌ప్లస్ సంస్థ కొత్తగా విడుదల చేసిన వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లు కూడా ఆండ్రాయిడ్ 11 బీటా యొక్క అప్‌డేట్ ను అందుకుంటున్నాయి. ఒక వేళ మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేసి ఉంటె కనుక దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో తెలిసిన కొన్ని సమస్యలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. వీటిని డౌన్‌లోడ్ చేయడానికి ముందు వినియోగదారులు వాటిని గుర్తుంచుకోవాలి అని తెలిపింది. ఫేస్ అన్‌లాక్ అందుబాటులో లేదని మరియు వీడియో కాలింగ్ కూడా పనిచేయదని వన్‌ప్లస్ తెలిపింది.

ఆండ్రాయిడ్ 11 బీటా సమస్యలు
ఆండ్రాయిడ్ 11 బీటా యొక్క అప్‌డేట్ లో కొన్ని సిస్టమ్ స్థిరత్వ సమస్యలు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇందులో కొన్ని UI స్క్రీన్‌లు కావాల్సిన రెసొల్యూషన్ కంటే తక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ పనిచేయదని ఫోరం ద్వారా కంపెనీ ధృవీకరించింది. ఆండ్రాయిడ్ 11 బీటా 1 ను డౌన్‌లోడ్ చేయడంలో ప్రమాదం ఉందని వన్‌ప్లస్ బ్రాండ్ సంస్థ గుర్తించింది. అందుకోసం వన్‌ప్లస్ 8 ప్రో మరియు వన్‌ప్లస్ 8 వినియోగదారులను డౌన్‌లోడ్ చేయవద్దని కూడా హెచ్చరించింది. ఇది సాధారణంగా బీటా అప్‌డేట్స్ విషయంలో ఉంటుంది.


Click it and Unblock the Notifications








