వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

Posted By:

 వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

ఇప్పుడు వాట్సాప్ సంభాషణలను ఎంచక్కా మీ గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ తాజాగా విడుదలు చేసిన కొత్త వర్షన్ 2.12.45తో ఈ చర్య సాధ్యమవుతోంది. ఈ కొత్త వర్షన్ యాప్ లో పొందుపరిచిన ఓ ఆఫ్షన్ ద్వారా చాట్ సంభాషణలను మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. అది ఏలా అంటే...? (వాట్సాప్‌కు పోటీగా రిలయన్స్ జియో)

 వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

ముందుగా ఏపీకే మిర్రర్ సైట్‌లోకి వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఇప్పటికే మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ స్థానంలో ఇన్‌స్టాల్ చేయండి.

 వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఏలా..?

ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Chat Settings > Chat backup > Backup Frequencyని ఎంపిక చేసుకోండి. (ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?)

తదుపరి చర్యలో భాగంగా మీ గూగుల్ అకౌంట్‌ను యాప్‌కు అనుసంధానించేందుకు ఓకే బటన్ పై క్లిక్ చేసి అనుమతిని మంజూరు చేయండి. అంతే.. మీరు విజయవతంగా మీ వాట్సాప్ అకౌంట్‌ను గూగుల్ డ్రైవ్ అకౌంట్‌కు కాన్ఫిగర్ చేసినట్లే. ఇప్పటి నుంచి మీ వాట్సాప్ సంభాషణలు గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి ఆటోమెటిక్‌గా బ్యాకప్ కాబడతాయి.

English summary
How to Backup WhatsApp Chat using Google Drive. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting