Airtel, Jio, Vi 2021: 1GB డైలీ డేటా ప్లాన్‌లలో పైచేయి ఎవరిది...
ఇండియాలో గల అన్ని టెలికాం ఆపరేటర్లు 2020లో అందరికి మంచి ప్రయోజనాలను అందించాయి. ఆపరేటర్లుఅన్ని తమ వినియోగదారులకు రోజువారీ ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటా కింద చాలా రకాల ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో తక్కువగా '1GB డైలీ డేటా' ను అందిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగదారులు 1.5GBకంటే ఎక్కువ రోజువారీ డేటా ప్లాన్‌లను పొందడానికి ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు రెండు రకాల సిమ్ లను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఒకదానిని రోజువారి అధిక GBతోను మరియు రెండవ దానిని 1GB రోజువారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్నట్లు అయితే కనుక 2021 నేటి నుంచి టెల్కోలు అన్ని 1GB రోజువారీ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను జాబితా గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ 1 జిబి డైలీ డేటా ప్లాన్ వివరాలు
1GB రోజువారీ డేటా ప్లాన్‌లను అందిస్తున్న కేటగిరీలో భారతి ఎయిర్‌టెల్ ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. రూ.199 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 1GB రోజువారీ డేటాను అందించడంతో పాటుగా అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా హెలొటూన్స్, వింక్ మ్యూజిక్ చందా మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వంటి వాటికి కూడా ఉచిత యాక్సిస్ ను ఒక సంవత్సరానికి కలిగి ఉంటుంది.

రిలయన్స్ జియో 1GB డైలీ డేటా ప్లాన్ వివరాలు
1GB రోజువారీ డేటా ప్రయోజనంతో రిలయన్స్ జియో కూడా ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. రూ.149 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే జియో కాకుండా నాన్-జియో కాల్స్ చేయడానికి FUP నిమిషాల పరిమితి లేదు. టెల్కో వినియోగదారులకు వాయిస్ కాలింగ్‌ను అపరిమితంగా చేసింది. వీటితో పాటుగా రోజుకు 100SMSల ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే Jio యొక్క అన్ని యాప్ ల కాంప్లిమెంటరీ చందా కూడా అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్ కూడా ఎయిర్టెల్ యొక్క రూ.199 ప్లాన్ వలె 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

వోడాఫోన్ ఐడియా 1GB డైలీ డేటా ప్లాన్ వివరాలు
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో కూడా తన వినియోగదారులకు 1GB రోజువారీ డేటాను 219 రూపాయల ప్లాన్‌తో అందిస్తుంది. ఇది వినియోగదారులకు 1GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా Vi సినిమాలు & TV లకు ఉచిత యాక్సిస్ ను కూడా అందివ్వనున్నది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు ‘యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్' కింద 2GB డేటాను అదనంగా కూడా అందిస్తుంది.

Airtel vs Jio vs Vi
1GB రోజువారీ డేటా ప్లాన్‌లలో ధరల పరంగా చూసుకుంటే రిలయన్స్ జియో చాలా చౌకైనది. వాయిస్ కాలింగ్, SMS మరియు డేటా ప్రయోజనాలు అన్ని ప్లాన్‌లలో సమానంగా ఉంటాయి. అయితే వోడాఫోన్ ఐడియా 1GB రోజువారీ డేటా ప్లాన్‌లో 28 రోజుల యాక్సిస్ ఉంది. కానీ జియో మరియు ఎయిర్‌టెల్ రెండూ కూడా 24 రోజుల యాక్సిస్ ను మాత్రమే అందిస్తున్నాయి. అదే సమయంలో జియో మరియు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే వోడాఫోన్ ఐడియా యొక్క ప్లాన్ అత్యంత ఖరీదైనది.


Click it and Unblock the Notifications








