JioMeet వీడియో-కాన్ఫరెన్స్ మీటింగులో బ్యాక్ గ్రౌండ్ మార్చడం ఎలా?
ఇండియాలో ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీసులకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌లో జియోమీట్ అనే కొత్త యాప్ ను లాంచ్ చేసింది. ఈ జియోమీట్ యాప్ వీడియో-కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాంలో నేరుగా జూమ్‌తో పోటీపడుతు దీని కంటే మెరుగైన ఫీచర్లను అందిస్తుంది.

జియోమీట్ యాప్ ఫీచర్స్
వీడియో-కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ యాప్ లో సుమారు 100 మంది సభ్యులు ఒకే సారి పాల్గొనడానికి ఎటువంటి పరిమిత సమయం లేకుండా 24 గంటలపాటు గ్రూప్ వీడియో కాల్‌లో ఉండటానికి అనుమతిస్తుంది. మరోవైపు కూడా జూమ్ కూడా తన గ్రూప్ వీడియో కాల్‌లో ఒకరికి అయితే అపరిమిత సమయం వరకు అనుమతిస్తుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ 100 వరకు గల గ్రూప్ సమావేశాలకు 40 నిమిషాల పరిమిత సమయం వరకు అనుమతి లభిస్తుంది.

జూమ్ Vs జియోమీట్
జూమ్‌తో పోల్చినప్పుడు జియోమీట్ వినియోగదారు అనుభవాన్ని మెరుగ్గా అందిస్తుంది. ఇందులో మీటింగ్ ను ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు అలాగే పాస్‌వర్డ్ సహాయంతో సమావేశాలను రక్షించవచ్చు కూడా. ఇందులో స్క్రీన్ షేరింగ్ మరియు రికార్డింగ్ ఎంపికలు రెండింటిలోనూ ఉన్నాయి. వాస్తవానికి జూమ్ యొక్క అన్ని ఫీచర్స్ జియోమీట్‌లో ఉన్నాయి. వీడియో నాణ్యత విషయానికి వస్తే జియోమీట్ HD వీడియోను అనుమతిస్తుంది. జియోమీట్ లో జరిగే సమావేశాల కోసం మూడవ పార్టీ కెమెరా యాప్ లు లేదా ప్రత్యేక వీడియో కెమెరాను కూడా ఉపయోగించవచ్చు. జూమ్ కూడా ఈ ఫీచర్ లను కలిగి ఉంది.

జూమ్ Vs జియోమీట్ వీడియో బ్యాక్ గ్రౌండ్ మార్చడం
వీడియో యొక్క బ్యాక్ గ్రౌండ్ ను మార్చే విషయానికి వస్తే జూమ్ యాప్ మీ యొక్క కంప్యూటర్‌లో ఉన్న ఏదైనా చిత్రంతో బ్యాక్ గ్రౌండ్ ను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే జియోమీట్ లో మీకు కావలసిన బ్యాక్ గ్రౌండ్ని పొందడానికి సెట్టింగులలో కెమెరా సోర్స్ మార్చవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం జియోమీట్‌లో ఇంటర్‌ఫేస్ బగ్గీ ఉండడం వలన ఇది ఎల్లప్పుడూ పనిచేయకపోవచ్చు. అలాగే జియోమీట్‌లో మూడవ పార్టీ కెమెరా యాప్ సోర్స్ ఎంచుకోబడినప్పుడు లాగ్ ఉంటుంది. జియోమీట్‌లో బ్యాక్ గ్రౌండ్ ను మీరు మార్చడానికి మీరు ప్రయత్నించాలనుకుంటే దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోమీట్‌లో వీడియో బ్యాక్ గ్రౌండ్ మార్చే పద్ధతులు
1. మొదట "Snapcamera.snapchat.com" నుండి మీ విండో 10 లేదా మాకోస్‌లో స్నాప్ కెమెరా యాప్ ను డౌన్‌లోడ్ చేయండి.
2. డౌన్‌లోడ్ చేసిన తరువాత స్నాప్ కెమెరాను ఇన్‌స్టాల్ చేసి దానిని ఓపెన్ చేయండి.
3. ఇందులో సెర్చ్ లెన్స్ బాక్స్ కింద సెర్చ్ చేసి మీకు కావలసిన బ్యాక్ గ్రౌండ్ ను ఎంచుకోండి.

స్నాప్ కెమెరా లెన్స్
4. ఆఫీస్ లేదా ఇతర స్టాటిక్ ఫొటోస్ వంటి లెన్స్‌లున్న బ్యాక్ గ్రౌండ్ ను సెర్చ్ చేయవచ్చు.
5. స్నాప్ కెమెరాను బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేస్తూ ఉండండి.

JioMeet స్నాప్ కెమెరా
6. తరువాత JioMeet ను ఓపెన్ చేసి మీ యొక్క మీటింగును ప్రారంభించండి.
7. PC లేదా Mac లోని JioMeet యాప్ లోని సెట్టింగ్‌లకు వెళ్లి వీడియో కింద డిఫాల్ట్ వెబ్ కెమెరాకు బదులుగా స్నాప్ కెమెరాను ఎంచుకోండి.
8. వీడియో సోర్స్ ని మార్చడం ద్వారా బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్న స్నాప్ కెమెరా అవుట్‌పుట్‌ను ప్రసారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


Click it and Unblock the Notifications