Home
News

Bharti Airtel వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లాంచ్ త్వరలోనే...

ప్రపంచం మొత్తం మీద COVID-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు కేవలం వారి యొక్క ఇంటికి మాత్రమే పరిమితం అయ్యి వారి యొక్క అన్ని రకాల పనులను పూర్తిచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇటువంటి వారు తమ యొక్క గ్రూప్ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువగా వీడియో-కాన్ఫరెన్సింగ్ వంటి సేవలను వినియోగిస్తున్నారు.

వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్

వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్

వీడియో కాలింగ్ సేవలకు ఎక్కువ డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో భారతి ఎయిర్‌టెల్ కొత్తగా తన వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను ప్రారంభించనున్నది.

 

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎయిర్‌టెల్ తన వినియోదారులకు అద్భుతమైన డేటా ప్రయోజనాలను అందిస్తున్నది. దీనితో పాటుగా బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసే ఆలోచనలలో ఉంది. కాకపోతే ప్రారంభంలో ఎయిర్‌టెల్ సంస్థ తన బ్రాండెడ్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను కేవలం కంపెనీలకు మాత్రమే అందించనున్నది. తరువాత దాని యొక్క డిమాండ్‌ను అంచనా వేసిన తర్వాత సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది.

ఇండియా మార్కెట్లో వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీసులు

ఇండియా మార్కెట్లో వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీసులు

ప్రస్తుతం ఎక్కువగా వీడియో-కాన్ఫరెన్సింగ్ కోసం జూమ్, గూగుల్ హ్యాంగ్అవుట్‌, మైక్రోసాఫ్ట్ టీమ్ వంటి యాప్ లను వాడుతున్నారు. వీటికి పోటీగా గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ తన జియోమీట్‌ వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసింది. ఈ జియోమీట్‌ యాప్ గరిష్టంగా 100మంది ఒకే సారి మీటింగులో పాల్గొనడానికి అనుమతిని ఇస్తుంది.

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ ఫీచర్స్

ఎయిర్‌టెల్ వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ ఫీచర్స్

సైబర్ భద్రతా బెదిరింపులపై ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఎయిర్‌టెల్ డేటా స్థానికీకరణ మరియు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ ఉత్పత్తి అధిక స్థాయి భద్రతపై దృష్టి సారించింది. ప్రజలు ఇంటి నుండి పనిచేసేటప్పుడు సైబర్ భద్రత గురించి ఆందోళన చెందకుండా ఉండే విధంగా తయారుచేస్తున్నది. దీని యొక్క వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Plan to Launch Video Conferencing app Like Zoom and Duo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X