ట్రాఫిక్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడం ఎలా?

|

భారతదేశం అంతటా అనేక రహదారులలో కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియమాలను అమలు చేయడంతో మీరు చేసే ట్రాఫిక్ ఉల్లంఘనలు అన్ని కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు. కెమెరా సంగ్రహించిందని తెలియకుండా మీరు ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించి ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఇ-చలాన్ జారీ చేయబడుతుంది. అలాగే ఏదైనా ప్రత్యేకమైన నిబంధనను ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు మిమ్మల్ని అడ్డుకున్న తర్వాత కూడా ఇ-చలాన్ జారీ చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో

ఈ చలానాలను చెల్లించేంతవరకు అందరికి మెసెజ్ లు మరియు నోటిఫికెషన్స్ వస్తూఉంటాయి. ఈ నోటిఫికేషన్లు రాకుండా ఉండటానికి పౌరులు ఆన్‌లైన్‌లో తక్షణమే ట్రాఫిక్ జరిమానాలను చెల్లించటానికి అవకాశం ఉంది. మీ యొక్క కారు లేదా బైక్ ద్వారా చేసిన తప్పిదాల కోసం ఇ-చలాన్ జారీ చేయబడిందో లేదో తనిఖీ చేయడం కోసం మరియు ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ట్రాఫిక్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడానికి మరియు కనుగొనడానికి  కింద పద్ధతులు పాటించండి.

ట్రాఫిక్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడానికి మరియు కనుగొనడానికి కింద పద్ధతులు పాటించండి.

1. వెబ్‌సైట్‌ను యాక్సిస్ చెయ్యడానికి మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుండి "echallan.parivahan.gov.in" ను ఎంటర్ చేయండి.

2. చలాన యొక్క స్థితిని తనిఖీ చేయడానికి "చెక్ చలాన స్టేటస్" ఎంపికపై క్లిక్ చేయండి.

 

 వాహన నంబర్

3. తరువాత మీరు మీ వాహన నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా చలాన నంబర్‌ ద్వారా లాగిన్ అవవచ్చు.

4. మూడు సంఖ్యలలో దేనినైనా నమోదు చేసిన తర్వాత చలాన వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

5. లైసెన్స్ నంబర్ మరియు వాహన నంబర్‌ను ఉపయోగించి కొన్నిసార్లు వేర్వేరు చలానాలను జారీ చేయడం జరుగుతుంది అని గమనించండి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవడానికి రెండింటినీ ఉపయోగించి ప్రయత్నించండి.

 

వివరాలు

6. చలాన వివరాలు కనిపించిన తర్వాత ‘పే నౌ' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

7. డబ్బులు కట్టడానికి మీ యొక్క మొబైల్ లో లభించే OTP తో మీరు మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించాలి.

8. మీరు సంబంధిత రాష్ట్ర ఇ-చలాన్ చెల్లింపు వెబ్‌సైట్‌కు మళ్ళించబడతారు. తరువాత నెక్స్ట్ బటన్ ను క్లిక్ చేయండి.

 

డెబిట్ మరియు క్రెడిట్ కార్డు

9. చెల్లింపు నిర్ధారణ పేజీ కనిపిస్తుంది. ‘ప్రొసిడ్ విత్ నెట్-పేమెంట్' పై క్లిక్ చేయండి.

10. ఆన్‌లైన్‌లో చెల్లించడానికి మీకు గల డెబిట్ మరియు క్రెడిట్ కార్డు యొక్క గేట్‌వేను ఎంచుకోండి మరియు పేమెంట్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Check and pay Traffic challan Through online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X