అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్
ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఫైర్ టీవీ వినియోగదారులకు ఆపిల్ టీవీ ఒక మంచి శుభవార్తను ఇస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఫైర్ టీవీ వినియోగదారులకు ఇప్పుడు ఆపిల్ టీవీ యాప్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. 60 కి పైగా దేశాలలో అమెజాన్ ఫైర్ టీవీని యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వారందరు ఆపిల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది.

అమెజాన్ మరియు ఆపిల్ సంస్థలు కుదుర్చుకున్న ఈ అధికారిక భాగస్వామ్యం గురించి అమెజాన్ పత్రికా ప్రకటనలో వివరించింది. అమెజాన్ ఫైర్ టీవీ వినియోగదారులు తమ ఫైర్ టివిలో ఆపిల్ యొక్క యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఆపిల్ సంస్థ కొనుగోలు చేసిన సినిమాలు, టివి షోలు మరియు ఛానెళ్ల యొక్క ప్రీమియర్ షోలను చూడవచ్చు.

నవంబర్ 1 నుండి ఫైర్ టీవీ వినియోగదారులు ఆపిల్ టీవీ యాప్ ద్వారా అందిస్తున్న వీడియో స్ట్రీమింగ్ యొక్క అన్ని టీవీ షోలు మరియు సినిమాలను చూడగలరు. ముఖ్యంగా ఆపిల్ టీవీ + వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ నవంబర్ 1 నుండి అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫైర్ టీవీ వినియోగదారులు ఆపిల్ టీవీ వినియోగదారులకు అందుబాటులో ఉన్న అన్ని సర్వీస్ లను ఉపయోగించగలరు.

మరో మాటలో చెప్పాలంటే నవంబర్ 1 నుండి అమెజాన్ ఫైర్ టీవీ వినియోగదారులు ఆపిల్ యొక్క కొత్త ప్రత్యేకమైన టీవీ షోలను చూడటానికి అనుమతిని ఇస్తుంది. ఇవే కాకుండా ఇప్పటికే ఉన్న ఐట్యూన్స్ లైబ్రరీ నుండి సినిమాలు మరియు షోలను కొనుగోలు చేయవచ్చు మరియు అద్దెకు తీసుకొనవచ్చు.

అలెక్సా వాయిస్ రిమోట్
నవంబర్ 1 నుండి వినియోగదారులు అలెక్సా వాయిస్ రిమోట్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఫైర్ టివి లేదా జత చేసిన ఎకో డివైస్ తో చేర్చబడి ఉంటుంది. ఇది తమ అభిమాన టీవీ షోలు మరియు సినిమాలను చూడటం కోసం సులభంగా ప్రారంభించడానికి మరియు ఆపిల్ టివి+ అందిస్తున్న కొత్త ఆపిల్ ఒరిజినల్‌లను కనుగొనటానికి ఉపయోగపడుతుంది.

అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా
వినియోగదారులు "ఆపిల్ టీవీ యాప్‌ను కనుగొనండి" అని అలెక్సా వాయిస్ రిమోట్‌ను అడగడం ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు "అలెక్సా, డికిన్సన్ చూడాలి" లేదా "అలెక్సా, ఫైండ్ డ్రామాస్" లేదా మీరు చూడాలనుకునే టీవీ షోలు మరియు సినిమాల పేరును చెప్పాడం ద్వారా వాటిని చూడవచ్చు. అలెక్సా వాయిస్ రిమోట్‌కు యాక్సిస్ లేని వినియోగదారులు మూవీస్ లేదా టీవీ షోలను సెర్చ్ చేయవచ్చు.

ఆపిల్ టీవీ యాప్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ మరియు భారతదేశాలలో ఫైర్ టీవీ స్టిక్ (2 వ జనరేషన్) మరియు ఫైర్ టీవీ స్టిక్ 4K కోసం అందుబాటులో ఉంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, న్యూజిలాండ్, బ్రెజిల్, ఐర్లాండ్, మెక్సికో మరియు మరెన్నో దేశాలతో సహా 50 కి పైగా దేశాల్లోని ఫైర్ టివి బేసిక్ ఎడిషన్ కస్టమర్లు ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చని అమెజాన్ ధృవీకరించింది.


Click it and Unblock the Notifications








