డిష్ టివి యొక్క 3 రకాల STBల ప్రయోజనాలు ఏమిటో తెలుసా??
డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ప్రొవైడర్ డిష్ టివి ఇప్పుడు తన చందాదారులకు మూడు రకాల సెట్-టాప్ బాక్సులను(STB) అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ తన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని వారాల తర్వాత ఈ ప్రకటన చేసింది. ఎయిర్టెల్ యొక్క సూట్ తరువాత డిష్ టివి తన Dish SMRT Hubను అందించడం ప్రారంభించింది.

డిష్ టివి ఇప్పుటికే రెండు రకాల STBలను అందిస్తోంది ఇప్పుడు దీనితో కలిపి మూడవది. కొత్తగా వచ్చిన మూడవ రకం సెట్-టాప్ బాక్స్ ఆండ్రాయిడ్ టీవీపై ఆధారంగా పని చేస్తుంది. ఇది మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ SD మరియు HD సెట్-టాప్ బాక్సులతో కలుపుతున్నది. ఈ మూడవ రకం సెట్-టాప్ బాక్స్‌ను వీటికి జత చేయడం వల్ల డిష్ టీవీ వినియోగదారులకు మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మూడు సెట్-టాప్ బాక్స్‌ల యొక్క వాటి లక్షణాలు మరియు ధరలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సెట్-టాప్ బాక్సుల వివరాలు
సెట్-టాప్ బాక్సుల జాబితాలోని మొదటిది డిష్ NXT. దీని యొక్క కంపెనీ ధర రూ.1,490లు. దీనిని కొనుగోలు చేసినప్పుడు దీనితో పాటు ఏదైనా ఛానల్ ప్యాక్‌ను ఒక నెల పాటు ఉచితంగా అందిస్తుంది. డిష్ టివి సెట్-టాప్ బాక్స్ కోసం రూ.2,000 విలువైన దునియా కూపన్లతో పాటు జీవితకాల వారంటీని కూడా అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఈ డివైస్ స్టీరియోఫోనిక్ సౌండ్, రిమైండర్‌లను జోడించే సామర్థ్యం, ఇష్టమైన ఛానెల్‌లను గుర్తించడం మరియు డిజిటల్ పిక్చర్ నాణ్యతను అందిస్తుంది.

రెండవ సెట్-టాప్ బాక్స్ విషయానికి వస్తే HD TV ఛానెల్‌లను ఎక్కువ నాణ్యతతో అందించే బాక్స్ DishNXT HD. డిష్ SMRT హబ్‌కు ముందు డిష్ టీవీ చందాదారులకు HD ఛానెల్‌లను అందిస్తున్న ఏకైక STB.ఇది కూడా డిష్ NXT మాదిరిగా ఒక నెల ఉచిత ఛానల్ ప్యాక్ చందాతో డిటిహెచ్ ఆపరేటర్ దీనిని 1,590 రూపాయల ధర వద్ద అందిస్తున్నది. అలాగే కూపన్లు మరియు వారంటీతో సహా మిగిలిన అన్ని ప్రయోజనాలు డిష్ NXT ఎస్‌డి సెట్-టాప్ బాక్స్‌తో వినియోగదారులకు లభించే వాటికి సమానంగా ఉంటాయి. వాస్తవానికి సెట్-టాప్ బాక్స్‌లు రెండూ స్మార్ట్ స్టిక్ పార్రింగ్ మినహా అన్ని లక్షణాలతో వస్తాయి. HD సెట్-టాప్ బాక్స్ ఈ లక్షణాన్ని వినియోగదారులకు అలెక్సా మద్దతును అందిస్తుంది.

మూడవ సెట్-టాప్ బాక్స్ విషయానికి వస్తే ఇటీవల ప్రారంభించిన డిష్ SMRT హబ్. ఆండ్రాయిడ్ టీవీ పవర్ తో పని చేసే టీవీలను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇది ఖచ్చితంగా సరిపోతుంది.

ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, వాచో వంటి ఇతర OTT యాప్ లతో వస్తుంది. ఇది పైన పేర్కొన్న OTT యాప్ లతో పాటు శాటిలైట్ టీవీ యొక్క ప్లేబ్యాక్‌ను కూడా అనుమతిస్తుంది. అదనంగా వినియోగదారులు డిష్ SMRT హబ్‌లో మీకు నచ్చిన అదనపు యాప్ లు మరియు గేమ్ లను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

కొత్త చందాదారుల కోసం సెట్-టాప్ బాక్స్ ధర 3,999 రూపాయలు. అలాగే ప్రస్తుతం వున్న డిష్ టీవీ చందాదారులు ఈ కొత్త సెట్-టాప్ బాక్స్‌కు అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తే వారు మాత్రం కేవలం రూ.2,499 చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








