Home
How to

వేసవి కాలంలో ఎయిర్ కూలర్‌తో AC తరహా చల్లదనం కావాలా.. ఈ చిట్కాలు పాటించండి..!

వేసవి పూర్తిగా ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ప్రారంభం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. చల్లదనం కోసం ఎక్కువ మంది ఎయిర్‌ కండిషనర్‌ (AC), ఎయిర్‌ కూలరలపై ఆధారపడుతున్నారు. అయితే AC ని కొనుగోలు చేసేందుకు కనీసం రూ.30 వేల అయినా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఎయిర్‌ కూలర్‌లు రూ.5 వేల నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌ కూలరే ఎందుకు :
AC లతో పోలిస్తే కూలర్‌ల (Air Coolers) నిర్వహణ కూడా తక్కువ ఉంటుంది. దీంతోపాటు ఇంట్లో లేదా ఆఫీస్‌లో నచ్చిన ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఏసీ తరహా చల్లదనాన్ని కూలర్‌ ద్వారా పొందవచ్చు.

how to get effective cooling with Air coolers here are the best tips

సూర్యకాంతికి దూరంగా :
సూర్యకాంతి నేరుగా పడే ప్రాంతాలకు ఎయిర్‌ కూలర్‌ ను దూరంగా ఉంచండి. ఎండ నేరుగా పడితే కూలర్‌ కూలింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. కూలర్‌ ను ఉంచేందుకు సరైన ప్రదేశం అందుబాటులో లేకుంటే.. సూర్యకాంతి నేరుగా పడకుండా ఉండేలా షెడ్‌, కర్టెన్‌లను వినియోగించుకోవచ్చు.

తేమ తక్కువగా ఉండేలా :
ఎయిర్‌ కూలర్‌ను కిటికీలు, వెంటిలేషన్ మెరుగ్గా ఉన్న ప్రాంతంలో అమర్చాలి. ఫలితంగా ఫ్రెష్‌ ఎయిర్‌ ను తీసుకొని, త్వరగా గది చల్లగా మార్చుతుంది. తక్కువ తేమ (Humidity) ఉన్న వాతావరణంలో కూలర్‌లు సరైన పనితీరును కనబరుస్తాయి. మీరు తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లయితే డీహ్యూమిడిఫైయర్‌ ను ఉపయోగించాల్సి ఉంటుంది.

వాటర్ ఛాంబర్‌ :
ప్రస్తుతం అనేక కూలర్‌ వాటర్‌ ఛాంబర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఛాంబర్‌లను కూలింగ్‌ వాటర్‌ తో నింపడం వల్ల, చాలా తక్కువ సమయంలో గది ఉష్ణోగ్రత చల్లగా మారుతుంది. దీంతోపాటు ఐస్‌ ప్యాక్స్‌ ను కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల కూలింగ్‌ సామర్థ్యం ఎక్కువ సమయం ఉంటుంది.

సరైన మెయింటెనెన్స్‌ :
దీంతోపాటు ఎయిర్‌ కూలర్‌లు సరైన పనితీరు కనబరచాలంటే క్రమం తప్పకుండా వాటర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసుకోవాలి. ట్యాంక్‌లో ఎటువంటి బ్యాక్టీరీయా సహా ఇతర వ్యర్థాలు లేకుండా చేసుకోవాలి. దీంతోపాటు ఎయిర్‌ కూలర్‌ ఫిల్టర్‌లను తరచూ శుభ్రం చేయాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది.

కూలింగ్ ప్యాడ్స్‌ :
దీంతోపాటు మెరుగైన కూలింగ్‌ కోసం వెట్‌ కూలింగ్‌ ప్యా్‌డ్స్‌ను ఉపయోగించాలి. మరియు కూలింగ్ ప్యాడ్స్‌ను తరచూ తనిఖీ చేస్తుండాలి. ఎటువంటి లోపం ఉన్నట్లు భావిస్తే మరమ్మతులు చేయడం లేదా కొత్తవి కొనుగోలు చేసి అమర్చుకోవాలి.

ఫ్యాన్ వినియోగించవచ్చా :
సాధారణంగా AC ని వినియోగిస్తున్నప్పుడు త్వరలో రూం చల్లగా మారాలంటే ఫ్యాన్‌ను ఉపయోగించాలి. అదే విధంగా కూలర్‌లను వినియోగిస్తున్న సమయంలోనూ ఫ్యాన్స్‌ను వినియోగించవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలోనూ చల్లదనం గది మొత్తం వ్యాప్తిస్తుంది.

ఫీచర్‌లు :
తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకొని ఎక్కువ కూలింగ్‌ ను అందించే ఎయిర్‌ కూలర్‌లను కొనుగోలు చేసుకోవాలి. దీంతోపాటు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌లు కలిగిన కూలర్‌లను ఎంచుకోవాలి. స్పీడ్‌ సెట్సింగ్స్‌ మార్చుకోవడం, రిమోట్‌ కంట్రోల్‌, టైమర్‌ ఉన్న కూలర్లను ఎంచుకోవాలి.

FAQs
ఎయిర్ కూలర్‌ లేదా ఎయిర్‌ కండిషనర్‌ ఏదీ కొనుగోలు చేయాలి?

ఎయిర్‌ కూలర్‌ తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. మరియు నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఎయిర్‌ కండిషనర్‌ (AC) ధర ఎక్కువగా ఉంటుంది. ధర ఆధారంగా మీరే నిర్ణయం తీసుకోగలరు.

ఎయిర్ కూలర్‌ లేదా ఎయిర్‌ కండిషనర్‌ కచ్చితంగా సర్వీస్‌ చేయించాలా?

కొన్ని రోజులు లేదా కొన్ని నెలల విరామం అనంతరం వినియోగిస్తుంటే మాత్రం సర్వీసింగ్ చేయించి వినియోగించడం ఉత్తమం.

ఎయిర్ కూలర్‌ లేదా ఎయిర్‌ కండిషనర్‌ కొనుగోలు సమయంలో ఏమేం చూడాలి?

బ్రాండ్‌, స్టార్‌ రేటింగ్‌, ఫీచర్‌లు, నిర్వహణ కోసం సర్వీసింగ్ సెంటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మీ గది సామర్థ్యం ఆధారంగా కొనుగోలు చేసుకోవాలి.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
how to get effective cooling with Air coolers here are the best tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X