Home
How to

Netflix స్ట్రీమింగ్ సేవలను 2021లో ఉచితంగా పొందడం ఎలా??

నూతన సంవత్సరం 2021 ప్రారంభం అయింది. ప్రభుత్వం నిర్ణయించిన సామాజిక దూర నిబంధనలను బట్టి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా కాకుండా నిశ్శబ్ద మార్గంలో జరుపుకున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఇప్పటికి చాలా మంది ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నందున వినోదం కోసం ఎక్కువ మంది స్ట్రీమింగ్ సేవలను ఇష్టపడతారు. స్ట్రీమింగ్ సేవలను అందించే ముఖ్యమైన వాటిలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ను అదనపు మొత్తం చెల్లించకుండా ఉచితంగా యాక్సెస్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సేవలు

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సేవలు

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ యొక్క సేవల కోసం ఇంతకు ముందు ఒక నెల ఉచిత ట్రయల్‌ను అందించేది. కానీ సంస్థ దీనిని ప్రస్తుతం అందించడం ఆపివేసింది. డిసెంబర్ నెలలో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ కూడా అందుబాటులో ఉంచింది. ఇది రెండు రోజుల పాటు తన యొక్క సేవలను వినియోగదారులకు అందరికి ఉచితంగా అందించింది. ఇతర సేవల మాదిరిగా కాకుండా టెలికాం సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌ను ఎంపికగా ఉచితంగా అందించవు.

VI పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్

VI పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్

వోడాఫోన్-ఐడియా (VI) యొక్క పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ గల వినియోగదారులు తమ రెడ్‌ఎక్స్ ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్ ను పొందినట్లయితే వారు నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా పొందవచ్చు. నెలకు రూ.1099 ధరతో ప్రారంభమయ్యే మరియు ఆరు నెలల లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉన్న రెడ్‌ఎక్స్ ప్లాన్ ఒక సంవత్సరం చందా నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ మీ టీవీ & మొబైల్‌లో సంవత్సరానికి 5988 రూపాయల విలువైన నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తుంది. మీరు వోడాఫోన్ యొక్క ఈ కనెక్షన్‌ను పొందిన తర్వాత క్రొత్త అకౌంటుకు లేదా ఇప్పటికే ఉన్న నెట్‌ఫ్లిక్స్ అకౌంటుకు నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ మొత్తం మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంటుకు నేరుగా జమ అవుతుంది. అంతేకాకుండా మీరు ఒక సంవత్సరం పాటు ఈ సేవను ఉచితంగా ఆస్వాదించగలుగుతారు. రెడ్‌ఎక్స్ ప్లాన్ ఉన్న ఎవరైనా ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను పొందవచ్చు.

జియో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్

జియో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్

జియో టెలికాం సంస్థ కూడా తన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ చందాను ఉచితంగా అందిస్తున్నది. అయితే ఇది రూ 199 ప్రాథమిక మొబైల్-ఓన్లీ చందాకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే ఈ సర్వీస్ కేవలం మీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ను యాక్టివేట్ చేయడానికి కస్టమర్‌లు తమ ఫోన్‌లలో మైజియో యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తరువాత జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్ ఆధారాలతో లాగిన్ అవ్వాలి. తరువాత యాప్ యొక్క హోమ్‌పేజీలోని నెట్‌ఫ్లిక్స్ బ్యానర్‌పై "ఇప్పుడు సక్రియం చేయి" పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు ఇప్పటికే ఉన్న నెట్‌ఫ్లిక్స్ అకౌంటుతో నెట్‌ఫ్లిక్స్‌లో లాగిన్ అవ్వాలి లేదా క్రొత్త అకౌంట్ ను సృష్టించడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు మీ యొక్క నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ను పంచుకొని అత్యధికంగా నాలుగు స్క్రీన్లలో ఒకేసారి ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How To Get Netflix Streaming Services For Free in 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X