ఇకపై పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్ మీ చేతికి

Written By:

పాస్‌పోర్టు మంజూరు చేయాలంటే ముందుగా పోలీస్‌ తనిఖీ చాలా కీలకం! పోలీసు అధికారి వచ్చి వివరాలు నమోదు చేసుకుని అన్నీ సవ్యంగా ఉన్నాయని నివేదిక పంపితేగానీ.. పాస్‌పోర్టు చేతికందదు! ఇకపై పాస్‌పోర్టు నిమిత్తం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాన్ కార్డుతో పాటు ఫారం అనెక్సర్-ఐ కూడా అదనంగా సమర్పిస్తే, ఎటువంటి పీవీఆర్ (పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు) లేకుండానే పాస్ పోర్టు జారీ కానుంది. ఈ మేరకు గతంలోనే కేంద్రం నిర్ణయాలు వెలువడగా, ఇప్పుడవి ఆచరణలోకి వచ్చాయి.

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

Rs.20,000 below mobiles 

ఇకపై పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్ మీ చేతికి

సాధారణ పాస్ పోర్టు విధానాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని విశాఖపట్నం పాస్ పోర్టు కేంద్రం అధికారి ఎన్ఎల్పీ చౌదరి వెల్లడించారు. దరఖాస్తుదారు సమర్పించే పత్రాలను ఆన్‌లైన్ లో పరిశీలనకు అందుబాటులో ఉంచుతామని, పీవీఆర్ లేకుండా పాస్ పోర్టు అందించేందుకు ఎలాంటి అదనపు రుసుములనూ వసూలు చేయబోమని ఆయన అన్నారు. పోలీస్‌ తనిఖీ పూర్తికాకముందే అంటే దరఖాస్తు పరిశీలన పూర్తయిన రోజే పాస్‌పోర్టు మంజూరు చేస్తారు. అది మూడు రోజుల్లోగా దరఖాస్తుదారుకు చేరుతుంది.

Rs.30.000 mobiles

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

ఇకపై పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్ మీ చేతికి

ఆ తరువాత పోలీసు నివేదిక ఆధారంగా ఏమైనా తేడాఉంటే షోకాజ్‌ నోటీసు ఇచ్చి విచారణ చేస్తారు. వెంటనే పాస్‌పోర్టు కావాలనుకునేవారు ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, ఫొటో గుర్తింపు కార్డు, పాన కార్డుల్లో ఏవైనా మూడింటిని సమర్పించాలి. ఈ మూడింటిలో పేరు, ఇతర వివరాలు అన్నీ ఒకేలా ఉండాలి. అప్పుడే పాస్‌పోర్టును పోలీస్‌ తనిఖీకి ముందే జారీ చేస్తారని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి తెలిపారు. ఈ పత్రాలతో పాటు తప్పనిసరిగా పుట్టిన తేదీ ధ్రువపత్రం, నాన్ ఈసీఆర్‌ పత్రాలు, అనెక్షర్‌-1 సమర్పించాలి.

అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

 

 

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని Apply సెక్షన్‌‌‌లో కనిపించే రిజిష్టర్ (Register) లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించవచ్చు.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు "Pay and Schedule Appointment" అనే లింక్ పై క్లిక్ చేయండి. బుకింగ్ అపాయింట్‌మెంట్‌‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టిండి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

మీ దరఖాస్తుకు సంబంధించి ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిన తరువాత "Print Application Receipt" లింక్ పై క్లిక్ చేయండి. మీరు పొందే ఈ రిసిప్ట్‌లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ పొందుపరచబడి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయడం ఎలా..?

పొందిన అప్లికేషన్ రిసిప్ట్‌ తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకుని అపాయింట్‌మెంట్ బుక్ కాబడిన సమాయానికి సంబంధింత పాస్‌పోర్ట్ సేవ కేంద్రానికి హాజరు కావటం వల్ల ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Passport to be issued before police verification
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot