అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

Written By:

ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా మరో ప్రత్యేక అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,099కే నేషనల్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇప్పటికే డేటా పాన్లలో ఉన్న వినియోగదారులకు డేటా పరిమితిని రెట్టింపు చేసింది.

Jio సిమ్ కోసం చూస్తున్నారా, ఇదుగోండి రూట్ మ్యాప్

అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ను అందిస్తున్న తొలి సంస్థ మాదేనని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. నెలకు రూ.549కే 5జీబీ డేటాను పొందుతున్న వినియోగదారులకు ఈ డేటా రెట్టింపుకానున్నదన్నారు.

జియో మరింత దూకుడు..ఈ ఫోన్లతో కూడా ఒప్పందం

అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

సబ్‌స్ర్కైబర్లకు అధిక లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక డేటా ఆఫర్లను ప్రకటించినట్లు ఆయన చెప్పారు. పదిరోజుల కాలపరిమితి కలిగిన 1జీబీ డేటాను 2జీబీకి పెంచింది. ఇందుకోసం సంస్థ రూ.156 చార్జీ విధిస్తున్నది. ఈ ప్రత్యేక డేటా ఆఫర్ పొందాలంటే వినియోగదారులు ప్రత్యేక టారిఫ్ వోచర్లతో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సంస్థ కాల్‌చార్జీలను 80 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే.

3జీ ఫోన్లకు 4జీ జియో సిమ్ ఉపయోగించడం ఎలా..?

అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో కంపెనీ వినియోగదారుల సంఖ్య పెరిగారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 11.39 లక్షల మంది వినియోగదారులు జతవగా, భారతీ ఎయిర్‌టెల్‌కు 9.78 లక్షలు, ఎయిర్‌సెల్‌కు 5.72 లక్షలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు 1.1 లక్షలు, వోడాఫోన్‌కు 46 వేల మంది చేరారు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే పలు టెలికం సంస్థలు డేటా చార్జీలను 67 శాతం వరకు తగ్గించిన విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ఆఫర్‌ ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకూ అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌, సెల్‌ఫోన్లకు ఉచితంగా కాల్స్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

మినిమం చార్జితోనే ఈ ఉచిత కాల్స్‌ను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఉచిత కాల్స్‌ తో మళ్లీ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లకు క్రేజ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెలలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ దాదాపు తొమ్మిదివేల కొత్త కనెక్షన్లను ఇచ్చినట్లు తెలిపింది.

 

 

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

ఇక ఇంటర్నెట్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ సేవల డేటా డౌన్‌లోడ్ వేగాన్ని (ఎఫ్‌యూపీ పరిమితి తర్వాత) ఈ నెల 1 నుంచి 1 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. గతంలో ఇది 512 కేబీపీఎస్‌గానే ఉండేదని పేర్కొంది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

ప్రస్తుత, కొత్త వినియోగదారులందరికీ తాజా మార్పు వర్తిస్తుందని...ఇందుకోసం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఓ ప్రకటనలో వివరించింది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌తో బ్రాడ్‌ బ్యాండ్‌, వైఫై కలిగిన రెండు మోడెంలను రూ.1500లకే అందిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ పీజీఎం రవిబాబు అన్నారు. ఈ ఆఫర్‌ ద్వారా నెలకు వంద రూపాయల చొప్పున వారికి మేమే 15 నెలలు తిరిగి చెల్లిస్తామన్నారు.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లు

మరి ప్రస్తుతానికి అయితే ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్ల దెబ్బకు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ పరిస్థితి అంత బాగోలేదు. ఇలాంటి ఆఫర్లు అయిన ఈ ప్రభుత్వ రంగ సంస్థను బతికిస్తే మంచిదే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write BSNL launches unlimited 3G plan for Rs 1,099, cuts rate by 50%
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot