మీ ఫోన్‌లో జియో సిమ్ పనిచేస్తుందా..లేదా..ఈ కోడ్‌తో తెలుసుకోవచ్చు

By Hazarath
|

మీరు 4జీ ఫోన్ వాడుతున్నారా..అయితే మీ మొబైల్ జియోకి పనిచేస్తుందో లేదోనని సందేహపడుతున్నారా.. అయితే ఇప్పుడు అలాంటి వాటికి రాంరాం చెప్పి మీరే నేరుగా మీ ఫోన్ జియో సిమ్ కి పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. ఇందు కోసం మీరు మీ ఆండ్రాయిడ్ 4 జీ మొబైల్ నుంచి స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ 4636 హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ (* # * # 4636 # * # *) ఈ నంబర్లు నొక్కితే చాలు చివరి హ్యాష్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ సర్వీస్ పై నాలుగు ఆప్షన్స్ వస్తాయి.

6o సెకన్లు ఇంటర్నెట్ ఆగిపోతే..షాకింగ్ నిజాలు

jio

దాంట్లో మొదటిది డ్రైవ్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఫోన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాన్ని ఎంచుకుని కిందకు స్క్రోల్ చేస్తే నెట్ వర్క్ టైప్ అని ఉంటుంది. అక్కడ మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్ కనిపిస్తాయి. మీ ఫోన్ ఎల్టీఈ లేక వోల్టా (వీవోఎల్టీఈ) అనేది కూడా అక్కడ కనిపిస్తుంది.అక్కడ కేవలం ఎల్టీఈ ఉంటే అది 4 జీ డేటా ట్రాన్స్‌ఫర్ అలాగే వోల్ట్ అని ఉంటే డేటాతో పాటు వాయిస్ కాల్స్ సపోర్ట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి.

రూ.50కే 1 జిబి : జియోలో అసలు ఈ ప్లాన్ లేనే లేదట

పోర్టబుల్ ద్వారా మీ పాత నంబర్‌తోనే జియో సిమ్ పొందడం ఎలాగో ఓ సారి చూద్దాం.

#1

#1

 పోర్ట్ 'అని టెక్ట్స్ మెసేజ్ టైప్ చేసి 1900 సర్వీస్ నెంబర్కు పంపాలి. ఈ సందేశం ద్వారా మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి సందేశం చేరుతుంది. 4 జీ హ్యాండ్సెట్ వినియోగదారులు మాత్రమే ఈ ప్రక్రియను అనుసరించాలి.

#2

#2

మై జియో యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆఫర్ కోడ్ను పొందుపరచండి. తరువాత దగ్గర్లోని రిలయన్స్ స్టోర్కు వెళ్లండి. పోర్ట్ అవుట్ కోడ్, ఫ్రీ వెల్కమ్ ఆఫర్ కోడ్, హ్యాండ్సెట్తో వెళ్లి రిలయన్స్ బ్రాంచిలో సంప్రదించండి.

#3

#3

 అడ్రస్ ఫ్రూఫ్, ఆధార్ ఫ్రూఫ్స్ జతచేసి రిలయన్స్ స్టోర్లో సమర్పించండి. ఇలా అందించిన వారం రోజుల లోపు సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతోంది. 19 రూపాయలు చార్జి అయినట్లు సందేశం వస్తుంది.

#4

#4

మీరు అంతకుముందు వినియోగిస్తున్న సిమ్ నో సర్వీస్ మెసేజ్ చూపిస్తుంది. కొత్త సిమ్ కార్డ్ తీసుకున్న రీప్లేస్ చేయాలి.

#5

#5

సిమ్ కార్డ్ వేసిన కొద్ది గంటల్లో నెట్వర్క్ వస్తుంది. రిలయన్స్ జియో కొత్త సిమ్ తీసుకున్న కస్టమర్లకు ఏ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయో, పోర్ట్ పెట్టుకున్న వారికి అవే ప్రయోజనాలు చేకూరుతాయి.

#6

#6

మీరు వాడుతున్న సిమ్ కార్డ్ 90 రోజులకు పైబడితేనే ఈ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి. 90 రోజుల ముందు వారికి ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు.

Best Mobiles in India

English summary
Here Write How to know if your smartphone supports jio sim

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X