WhatsApp మెసేజ్ లను షెడ్యూల్ చేయడం ఎలా?
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మరొకరికి వెంటనే మెసేజ్ లను పంపడానికి ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్‌లో టన్నుల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. కాని వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేసే సామర్థ్యం ఇంకా లేదు.

మీరు మీకు నచ్చిన వారి యొక్క పుట్టినరోజు లేదా పెళ్ళి రోజున అందరి కంటే ముందుగా అర్ధరాత్రి విష్ చేయడానికి షెడ్యూల్ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ రెండింటిలోనూ వాట్సాప్‌లో మెసేజ్ లను షెడ్యూల్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. అవి ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

SKEDit
వాట్సాప్‌లో మెసేజ్ లను షెడ్యూల్ చేయడానికి వాట్సాప్‌కు అధికారిక ఫీచర్ లేదు. అయితే మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే మీరు మూడవ పార్టీ యాప్ ల సహాయంతో వాట్సాప్‌లో మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. షెడ్యూల్ చేసిన మెసేజ్ లను సరైన సమయానికి పంపే మూడవ పార్టీ యాప్ లు చాలా ఉన్నాయి. కానీ అందులో ఒక్కటి SKEDit అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. Android లో వాట్సాప్ మెసేజ్ ను ఎలా షెడ్యూల్ చేయాలో తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించండి.

ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ ను షెడ్యూల్ చేసే దశలు
స్టెప్ 1
1. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా SKEDit ను డౌన్‌లోడ్ చేసి దానిని ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 2
2. మొదట దీనిని ప్రారంభించడానికి ఇందులో మీరు సైన్ అప్ చేయాలి.

స్టెప్
3. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మెయిన్ మెనూలో వాట్సాప్ నొక్కండి.

స్టెప్ 4
4.తదుపరి స్క్రీన్‌లో మీరు అనుమతులు ఇవ్వాలి. యాక్సిస్ ను ప్రారంభించడానికి ఎనేబుల్ యాక్సిస్ > SKEDit> యూస్ సర్వీసును టోగుల్ చేయండి. అనుమతులు ఇచ్చిన తరువాత ఇప్పుడు యాప్ కి తిరిగి వెళ్ళండి.

స్టెప్ 5
మీరు ఇప్పుడు వివరాలను పూరించాలి. ఇందులో మెసేజ్ ను పంపవలసిన వారి నెంబర్ ను జోడించి, మీ యొక్క మెసేజ్ ను నమోదు చేయండి. అలాగే షెడ్యూల్ తేదీ మరియు సమయాన్ని సెట్ చేయండి మరియు మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్ ను పునరావృతం చేయాలనుకుంటున్నారా లేదా అని ఎంచుకోండి.

స్టెప్ 6
పంపే ముందు నన్ను అడగండి అనే చివరి టోగుల్ ను మీరు కింద చూస్తారు. దీన్ని టోగుల్ చేయండి> అందులో టిక్ చిహ్నాన్ని నొక్కండి> మీ మెసేజ్ ఇప్పుడు షెడ్యూల్ చేయబడుతుంది. మీ షెడ్యూల్ మెసేజ్ యొక్క రోజు మరియు సమయం వచ్చినప్పుడు మీ ఫోన్‌లో ఆ చర్యను పూర్తి చేయమని అడుగుతూ నోటిఫికేషన్ అందుకుంటారు. అప్పుడు "సెండ్" మీద నొక్కండి. మీ షెడ్యూల్ చేసిన మెసేజ్ నిజ సమయంలో పంపబడుతుందని మీరు చూస్తారు.

స్టెప్ 7
టోగుల్ చేయబడే ముందు నన్ను అడగండి అనే టిక్ చిహ్నాన్ని మీరు నొక్కినప్పుడు మీ ఫోన్ స్క్రీన్ లాక్‌ని నిలిపివేయమని అడుగుతుంది. అలాగే మీ ఫోన్ యొక్క బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను కూడా నిలిపివేయమనే ఆప్షన్ ను ఎంచుకోండి. ఇలా చేస్తే మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్ స్వయంచాలకంగా పంపబడుతుంది. అంటే ఫోన్‌లో ఏదైనా ఇన్‌పుట్ ఇవ్వమని మిమ్మల్ని అడగరు. ఈ ప్రక్రియను తక్షణం చేస్తుంది. స్క్రీన్ లాక్ లేకపోవడం అనేది మీ ఫోన్ యొక్క ప్రైవసీను ప్రభావితం చేస్తుంది. ఇది ఒక్కటే ఇందులో అతి పెద్ద లోపం. అందువల్ల మేము ఈ విధంగా వాట్సాప్ మెసేజ్ లను షెడ్యూల్ చేయమని సిఫారసు చేయము. కావున దీనిని ఉపయోగించే ముందు ఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు నిర్ణయం మీ చేతులలోనే ఉంది.


Click it and Unblock the Notifications








