Home
How to

హోలీ వేడుకలలో జర భద్రం.. మీ ఫోన్ పాడు కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

Protect Your Phone: హోలీ పండుగ రానే వచ్చింది. హోలీ అంటే రంగుల కేళి, సంతోషాల సంబరం. అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడిపే పండుగ ఇది. అందుకే ఈరోజు చాలామంది ఈ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ ఈ హడావిడిలో మీ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నీరు, రంగులు, దుమ్ము వల్ల పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా చూసుకోకపోతే, రంగు నీళ్లు మీ ఫోన్‌లోకి చేరి, తుప్పు పట్టేలా చేస్తాయి.

సరిగ్గా పనిచేయకుండా పోయేలా చేస్తాయి. లేదా పూర్తిగా పాడైపోయేలా కూడా చేస్తాయి. అందుకే, పండుగను ఎంజాయ్ చేస్తూనే మీ ఫోన్‌ను భద్రంగా ఉంచుకోవడానికి, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అలాంటి వాటిలో 8 జాగ్రత్తలు ఈ ఆర్టికల్ లో చెబుతున్నాం.

Protect Your Phone from Water Damage During Holi 2025 with These Tips

* జిప్-లాక్ బ్యాగ్ వాడాలి

మీ ఫోన్, ఇయర్‌బడ్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రంగా ఉంచడానికి జిప్-లాక్ బ్యాగ్ చాలా సులువైన, మంచి పద్ధతి. ఈ బ్యాగులు నీటిని, దుమ్మును, రంగులను ఫోన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆన్‌లైన్‌లోనూ, మీ దగ్గరలోని షాపుల్లోనూ లభిస్తాయి. వీటి ధర కూడా తక్కువే.

* అన్‌లాక్ పద్ధతి మార్చాలి

మీ ఫోన్ ఫేస్ లేదా ఫింగర్‌ప్రింట్ గుర్తింపుతో అన్‌లాక్ చేసేలా సెట్ చేసుకుని ఉంటే, హోలీ పండుగ మొదలవ్వడానికి ముందే దాన్ని పిన్ లేదా పాటర్న్ లాక్‌కి మార్చుకోవాలి. తడి చేతులు, రంగులు అంటుకున్న ముఖం వల్ల బయోమెట్రిక్ సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్పుడు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడం కష్టమవుతుంది.

* IP రేటింగ్స్‌ను నమ్మొద్దు

చాలా కొత్త స్మార్ట్‌ఫోన్లు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తున్నాయి. కానీ ఈ పరీక్షలు పరిశుభ్రమైన నీటితో, కచ్చితమైన పరిస్థితుల్లో చేస్తారు. హోలీ రంగులు, రసాయనాలు కలిపిన నీరు మీ ఫోన్‌ను పాడు చేయగలవు. పైగా చాలా వారెంటీలు నీటి వల్ల పాడైతే వర్తించవు.

* పోర్ట్స్‌, ఓపెనింగ్స్‌ మూసేయాలి..

నీరు, రంగుల పొడులు ఛార్జింగ్ పోర్ట్‌లు, స్పీకర్లు, మైక్రోఫోన్‌లలోకి సులువుగా చేరిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే, ఈ ఓపెనింగ్‌లన్నిటినీ టేప్‌తో మూసేయండి. స్పీకర్లకు టేప్ వేసిన తర్వాత సౌండ్ సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి, మీ ఫోన్‌ను వైబ్రేషన్ మోడ్‌లో పెట్టడం మంచిది.

* పవర్ బ్యాంకులు వద్దు

పవర్ బ్యాంకులు నీటిని తట్టుకునేలా ఉండవు. ఒకవేళ నీళ్లు తగిలితే ప్రమాదకరంగా మారొచ్చు. అవి తడిస్తే, పనిచేయడం ఆపేయొచ్చు లేదా కొన్నిసార్లు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది.

* తడిసినప్పుడు ఛార్జింగ్ వద్దు

ఒకవేళ ఫోన్ తడిస్తే పొరపాటున కూడా ఛార్జింగ్ పెట్టకండి. తడి ఉన్న ఫోన్‌ను ఛార్జ్ చేస్తే లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి పాడైపోతుంది. ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ పూర్తిగా ఆరే వరకు వెయిట్ చేయాలి. ఫోన్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్, వేడి గాలి వాడొద్దు. వేడి తగిలితే ఫోన్ లోపలి భాగాలు పాడైపోయే ప్రమాదముంది.

* ఒకవేళ ఫోన్ తడిస్తే

వెంటనే మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. పొడి గుడ్డతో తుడవండి. ఫోన్ కేస్‌లు, సిమ్ కార్డులు తీసేయాలి. అప్పుడు ఫోన్ త్వరగా ఆరుతుంది. బియ్యం కన్నా సిలికా జెల్ ప్యాకెట్లు వాడటం బెటర్. ఎందుకంటే బియ్యంలోని దుమ్ము, పిండి పదార్థాలు ఫోన్‌లోకి చొరబడతాయి.

ముఖ్యంగా ఛార్జింగ్ పోర్టులోకి వెళ్లినట్లయితే వాటిని బయటికి తీయడం కష్టమవుతుంది. ఈ క్రమంలో ఛార్జింగ్ పోర్టు పాడయ్యే అవకాశం ఉంది. అందుకు బదులు ఫోన్‌ను సిలికా జెల్ ప్యాకెట్లతో గాలి చొరబడని డబ్బాలో కనీసం 24–48 గంటలు పెట్టాలి, అది తేమను పీల్చుకుంటుంది. లేదంటే ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గాలి తగిలేలా చేయొచ్చు.

* వేడి, హాట్ ఎయిర్ వద్దు

ఫోన్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్ లేదా వేడి గాలి అస్సలు వాడొద్దు. ఇలా చేస్తే తేమ ఫోన్ లోపలికి వెళ్లిపోతుంది లేదా లోపలి భాగాలు పాడైపోతాయి. బదులుగా ఏరోసోల్ ఎయిర్ డస్టర్ వాడితే ఫోన్‌లోని నీటిని సురక్షితంగా తొలగించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు హోలీని ఎంజాయ్ చేస్తూనే మీ ఫోన్‌ను కాపాడుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Protect your phone this Holi with zip-lock bags, port covers, and a PIN lock. Avoid charging when wet and keep power banks away for safety.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X