అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై తలెత్తుతున్న ప్రశ్నలనేకం

Written By:

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్ 32 విమానం గల్లంతై ఇప్పటికీ అయిదు రోజులు కావస్తోంది. ఈ విమానాన్ని ఎలాగైనా కనిపెట్టాలని భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నాయి. 29 మంది భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న ఆ విమానం జాడ ఏమైందన్న ఇప్పటివరకు తెలియకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు బతికి ఉన్నారనే ఆశలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి.

తప్పులకు భారీ మూల్యం..లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు యాహూ పతనం

ఇప్పటిదాకా నిర్వహించిన ఆపరేషన్ లో అన్నీ ప్రతికూల సంకేతాలు అందాయని ఆ సంకేతాలు చెడునే సూచిస్తున్నాయని రక్షణ మంత్రి చెబుతున్నారు. అంతే కాకుండా గాలింపు చర్యలు ముమ్మరం చేయడానికి జాతీయ సముద్ర టెక్నాలజీకి చెందిన సాగర్ నిధి క్లాసికల్ మంచు ఓడను మారిషస్ నుంచి రప్పిచామని, ఇది ఎంత లోతులోనైనా ప్రయాణించగలదని చెప్పారు. అయితే, ఏ ప్రాంతంలో దీనిద్వారా ఆపరేషన్ చేపట్టాలనేది నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఏ32 విమానాలంటేనే సమస్యలకు నిలయమని తెలుస్తోంది

తెల్లని మంచులో రక్తపు జలపాతం..మిస్టరీ వీడింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

వాయుసేన విమానాలకు ప్రమాదాలు జరగడం కొత్త కాకపోయినా ఇటీవల జాడ తెలియకుండా పోయిన ఏఎన్ 32 విమానం మాత్రం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. రష్యా రూపొందించిన ఈ విమానాలను ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కొనుగోలు చేశారు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

అప్పటివరకూ ఉన్న ఏఎన్ 26 ప్థానంలో ఏఎన్ 32 విమానాలు వచ్చి చేరాయి. 125 ఏఎన్ 32 విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఇవి దాదాపుగా 32 సంవత్సరాల నుంచి ఈ విమానాలు భారత వాయుసేకు సేవలు అందిస్తున్నాయి.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

రక్షణ శాఖకు సంబంధించిన యంత్ర పరికరాలు, సిబ్బంది తరలింపు, వారికి ఆహారం తీసుకువెళ్లడం తదితర కార్యక్రమాలను ఏఎన్ 32 విమానాలు నిర్వహిస్తుంటాయి. 

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న విమానాలలో ఏఎన్ 32 తో బాటు డార్నియర్ విమానాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎంతగా మరమ్మతులు చేసినప్పటికీ ఏఎన్ 32 విమానాల్లో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

ఇప్పుడు అదృశ్యం అయిన చెన్నై- పోర్టుబ్లయర్ వాయుసేన విమానంలో కూడా తరచూ సమస్యలు తలెత్తేవని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. గత ఏడాది ఈ విమానానికి ఆధునిక హంగులు జోడించి మరమ్మతులు చేశారు. ఈ నెలలోనే మూడు సార్లు ఈ విమానానికి సమస్యలు వచ్చాయి.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

జులై రెండో తేదీన ఈ విమానం కచ్చితమైన రూట్లో ప్రయాణం చేయలేకపోతున్నదని గుర్తించారు. 7వ తేదీన ఎడమవైపున ఉన్న రెక్క మొదట్లో హైడ్రాలిక్ లీక్ ఉన్నట్లుగా గుర్తించారు. జులై 14న ఎడమ వైపు తలుపు నుంచి వత్తిడి లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

విమానం అదృశ్యం కావడానికి ఈ లోపాలు కారణం అనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఇలాంటి అంశాల్లో భారత వాయుసేన మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రం ఈ ప్రమాదం గుర్తు చేస్తున్నది.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

ఇక గతంలో జరిగిన ఏఎన్ -32 విమాన ప్రమాదాలను గమనిస్తే, 1986 మార్చి 25న హిందూ మహాసముద్రం మీదుగా ఏడుగురితో వెళుతున్న విమానం గల్లంతు కాగా, నేటికీ దాని జాడ తెలియలేదు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

1990 జూలై 15న తాంబరం నుంచి తిరువనంతపురం బయలుదేరిన మరో విమానం మార్గమధ్యంలో కుప్పకూలింది. 2009 జూన్ 10 న అరుణాచల్ ప్రదేశ్లో మరో ఏఎన్ -32 కూలిపోగా, 13 మంది దుర్మరణం పాలయ్యారు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

అయితే ఏఎన్ 32 రకం విమానం 48 సంవత్సరాల కిందట ఒకసారి ఇదే విధంగా కనిపించకుండాపోయింది. ఆ తర్వాత విమానం మాయం అయిన సంఘటన ఇదే. చండీగఢ్ నుంచి లేకు వెళుతుండగా అప్పటిలో ప్రమాదం సంభవించగా ఇప్పుడు చెన్నై నుంచి పోర్టుబ్లయర్ వైవు వెళుతుండగా బంగాళాఖాతంలో అదృశ్యమైపోయింది.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

బంగాళా ఖాతంలో నాలుగు రోజుల నుంచి ప్రస్తుతం 5 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విమానం శకలాల కోసం అన్వేషణ సాగుతుండగా, జాడ తెలిసే అవకాశాలు 50 శాతం ఉన్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) చెబుతోంది. ఇక ఈ విస్తీర్ణాన్ని 9 వేల కిలో మీటర్లకు పెంచాలని నిర్ణయించడంతో విమానం ఆచూకీ తెలిసే అవకాశం 20 శాతానికి పడిపోయిందని ఓ అధికారి తెలిపారు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

మరో వైపు గంటలు గడిచే కొద్దీ, విమానంలో బ్యాటరీలు పాడెపోయి, ఎటువంటి సిగ్నల్స్ వెలువడని పరిస్థితి సంభవిస్తే, దాని జాడ ఇక ఎన్నటికీ తెలిసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

13 నౌకలు, రాత్రి పూట స్పష్టంగా చూపించగల కెమెరాల సదుపాయమున్న రెండు పీ 8 ఐ సహా ఐదు విమానాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఏఎన్ -32, రెండు సీ -130 లతో పాటు ఎంఐ -17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

అడుగంటుతున్న ఆశలు..ఆ విమానాలపై కొత్త ప్రశ్నలనేకం

చెన్నై తీరం నుంచి 217 కిలో మీటర్ల దూరంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సాగింది. గాలింపు బృందాలు ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగి ఈ ప్రమాదం నుంచి అందరూ బయటపడాలని అందరం కోరుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Satellite imagery sought for missing indian air Force plane
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more