10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో మన్నికైన స్మార్ట్‌ఫోన్ కోసం మీ వేట ప్రారంభమైందా..?, అయితే.. ఈ శీర్షక మీకో ఉత్తమ మార్గదర్శి కావొచ్చు. ప్రస్తుత రోజుల్లో ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.6,000 నుంచి రూ.10,000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
(చదవండి: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు)
ఈ క్రింది స్లైడ్‌షోలో మీకు పరిచయం కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లతో మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిని మీరు ఓ లుక్కేస్కోండి...
(చదవండి: 4జీ డ్యుయల్ సిమ్‌తో హువాయి స్మార్ట్‌ఫోన్‌లు)

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
హువాయి హానర్ 4సీ
ధర రూ.8,999
ప్రీమియమ్ క్వాలిటీ ఫీచర్లతో హువాయి హానర్ 4సీ బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో హై-ఎండ్ ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వేగవంతమైన పనితీరు, కెమెరా క్వాలిటీ, మన్నికైన బ్యాటరీ బ్యాకప్ వంటి అంశాలు ఫోన్ చరిష్మాను మరింత పెంచేసాయి. అసాధారణమైన బ్యాటరీ లైఫ్‌తో లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్
డివైస్‌లలో హువాయి హానర్ 4సీ ఒకటి.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
మోటరోలా మోటో ఇ (సెకండ్ జనరేషన్)
ధర రూ.6,999
మోటరోలా తన మోటో ఇ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌ను ధర తగ్గట్టుగా స్టైలిష్‌గా డిజైన్ చేసింది. అయితే, పనితీరు విషయంలో ఈ విషయం కాస్తంత నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మోటో ఇ (సెకండ్ జనరేషన్)తో పోలిస్తే హువాయి ‘హానర్ 4సీ'నే ఉత్తమ ఎంపిక.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
హువాయి హానర్ బీ
ధర రూ.4,999
ఈ ఫోన్‌లోని పెద్దదైన స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్లాట్స్, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ, మన్నికైన బ్యాటరీ లైఫ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
నోకియా లుమియా 535
ధర రూ.7,200
విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి ఫీచర్లు లుమియా 535కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
హెచ్‌టీసీ డిజైర్ 526జీ ప్లస్
ధర రూ.9294
హెచ్‌టీసీ నుంచి భారీ అంచనాలతో విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ జస్ట్ ఓకే అనిపించుకుంది.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
లెనోవో ఏ6000 ప్లస్
ధర రూ.7,499
లెనోవో ఏ6000కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన లెనోవో ఏ6000 ప్లస్ కాస్తంత పర్వాలేదనిపించినప్పటికి కెమెరా విషయంలో ఆకట్టుకోలేకపోయింది.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
హువాయి హానర్ హోళీ
ధర రూ.6,999
రూ.7,000 ధర పరిధిలో హువాయి హానర్ హోళీ స్మార్ట్‌ఫోన్‌ను ఉత్తమ ఎంపికగా అభివర్ణించవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌కు ఉండవల్సిన అన్ని లక్షణాలు ఈ ఫోన్‌లో సమృద్థిగా ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్‌లోని కెమెరా ఫీచర్ ఆకట్టుకుంటుంది.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2
ధర రూ.7,325
గెలాక్సీ కోర్ 2 మన్నికైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నప్పటికి హువాయి హానర్ 4సీ, హువాయి హానర్ 4ఎక్స్ (4జీ) ఫోన్‌ల ముందు తేలిపోయిందనే చెప్పాలి.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ప్రైమ్
ధర రూ.8,830
గెలాక్సీ కోర్ ప్రైమ్ తరహా స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు రూ.8,830 కంటే తక్కువ ధర ట్యాగ్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ
ఫోన్‌లోని అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, డీసెంట్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో
షియోమీ రెడ్మీ 2
ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఆకట్టుకునేలా ఉన్నప్పటికి, డిస్‌ప్లే విషయంలో నిరుత్సాహపడక తప్పదు.


Click it and Unblock the Notifications








