మోటరోలా రేజర్ 60 వచ్చేస్తోంది.. 50MP కెమెరా, 4500mAh బ్యాటరీ, 18GB వరకు ర్యామ్.. స్పెసిఫికేషన్లు లీక్..
Motorola Razr 60: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్. మోటరోలా నుంచి కొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఎడ్జ్ 60, రేజర్ 60 సిరీస్‌లను కంపెనీ త్వరలో తీసుకురానుంది. ఈ రేజర్ 60 సిరీస్‌లో కనీసం రెండు మోడల్స్ ఉంటాయి. ఒకటి రేజర్ 60, రెండోది రేజర్ 60 అల్ట్రా. ఇప్పటికే అల్ట్రా మోడల్ వివరాలు చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించాయి.
ఇప్పుడు స్టాండర్డ్ రేజర్ 60 పూర్తి స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చేశాయి. అవేంటో చూద్దాం. ముందుగా డిస్‌ప్లే , డిజైన్ ఎలా ఉందో తెలుసుకుంటే ఈ మోటరోలా రేజర్ 60 ఫోన్‌లో బయట వైపు (కవర్) 3.63 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిజల్యూషన్ 1056 x 1056 పిక్సెల్స్.

ఫోన్ తెరిచినప్పుడు లోపల 6.9 అంగుళాల పెద్ద OLED మడతబెట్టే స్క్రీన్ కనిపిస్తుంది. దీని రిజల్యూషన్ 1080 x 2460 పిక్సెల్స్ (Full HD+). అయితే, కొన్ని రిపోర్టుల ప్రకారం లోపలి స్క్రీన్ సైజు కొంచెం తక్కువగా 6.7 అంగుళాలు ఉండొచ్చని కూడా అంటున్నారు. అధికారికంగా ఇవి విడుదల అయ్యేంతవరకు ఈ విషయంలో స్పష్టత రాదు
* పర్ఫార్మెన్స్, ఛార్జింగ్
TENAA లిస్టింగ్ ప్రకారం, ఈ రేజర్ 60 ఫోన్‌లో 2.75GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ప్రాసెసర్ ఉంటుంది. ఇది బహుశా మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్ అయ్యుండొచ్చు. గత మోడల్ రేజర్ 50 లో వాడిన డైమెన్సిటీ 7300X కంటే ఇది అప్‌గ్రేడ్ అని భావిస్తున్నారు.
చైనా మార్కెట్ కోసం ఈ ఫోన్ వివిధ RAM, స్టోరేజ్ ఆప్షన్లలో లభించనుంది. 8GB, 12GB, 16GB, చివరికి 18GB RAM వరకు, అలాగే 128GB, 256GB, 512GB, ఏకంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఈ రేజర్ 60 లో డ్యూయల్-సెల్ బ్యాటరీ ఉంటుంది.
అంటే, రెండు బ్యాటరీలు (1,090mAh + 3,815mAh) కలిపి ఉంటాయి. మొత్తం సామర్థ్యం సుమారు 4,500mAh వరకు ఉంటుంది. ఇది గత రేజర్ 50 లోని 4,200mAh బ్యాటరీ కంటే మెరుగుదల. ఈ ఫోన్ 30W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
* కెమెరాలు
ఫొటోలు, వీడియోల కోసం రేజర్ 60 బయటి కవర్‌పై డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఫోన్ లోపల, మడతబెట్టే డిస్‌ప్లేలో సెల్ఫీల కోసం 32MP కెమెరాను అమర్చారు. లాంచ్ తేదీ లేదా ధర గురించి మోటరోలా అధికారికంగా ఇంకా ఏమీ చెప్పలేదు.
* ధర
డిజైన్ పరంగా ఈ రేజర్ 60 కూడా దాదాపు రేజర్ 50 లాగే ఉంటుందని అంచనా. కాబట్టి, ధర కూడా పెద్దగా పెరగకుండా సుమారు అదే రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తంగా చూస్తే, మోటరోలా రేజర్ 60 తన పాత మోడల్ కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌లతో వస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్ద బ్యాటరీ, మెరుగైన చిప్‌సెట్, పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో ఇది మడతబెట్టే ఫోన్‌ల మార్కెట్‌లో గట్టి పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








