త్వరపడండి: సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

Posted By:

సౌత్ కొరియన్ టెక్‌ దిగ్గజం సామ్‌సంగ్ ధర తగ్గింపు మంత్రంతో ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)కు కొత్త కళను తీసుకువచ్చింది. గతంలో గెలాక్సీ ఎస్3(రూ.28,000), గెలాక్సీ ఎస్ డ్యుయోస్ (రూ.12,000) హ్యాండ్‌సెట్‌ల ధరలను తగ్గించి మార్కెట్లో సంచలనం రేపిన సామ్‌సంగ్ తాజగా గెలాక్సీ నోట్2 పై రూ.5000 తగ్గింపును ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2 తొలిగా సెప్టంబర్ 2012లో ఆవిష్కరించారు. అప్పటి ధర రూ.39,900. ప్రత్యేక ధర తగ్గింపులో భాగంగా ఈ ఫాబ్లెట్‌ను రూ.34,900కు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న గెలాక్సీఎస్4ను మార్చి 15లోపు ఆవిష్కరించే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్.. దిమ్మతిరిగే లుక్!

ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'

త్వరపడండి: సామ్‌సంగ్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

గెలాక్సీ నోట్2 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, 3,100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting