దడ పుట్టిస్తున్న ఆపిల్ అమ్మకాలు..అప్పుడే ఐఫోన్ 7 అవుట్ ఆఫ్ స్టాక్

Written By:

ఆపిల్ గతంలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని రీతిలో అమ్మకాల సునామిని తలపిస్తోందని కంపెనీ చెబుతోంది. తొలిసారిగా ఐఫోన్ అభిమానుల కోసం మెరిసే ఫోన్ జెట్ బ్లాక్ కలర్‌ను తీసుకొచ్చింది.అయితే ఆపిల్ నుంచి తొలిసారిగా ఇటువంటి ఫోన్లు రావడంతో ఐఫోన్ అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ ల మీద పడ్డారు. ఇంకేముంది ఆ ఫోన్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లలోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోవడం..

Iphone 7, Iphone 7 plus, Iphone 6

ఆధార్ కార్డు ఉంటే రూ.1700కే ఐఫోన్ 7..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ కలర్ ఐఫోన్7

సరికొత్తగా మెరిసే గాడ్జెట్లపై ఎక్కువ ఆసక్తి కనబరిచే స్మార్ట్‌ఫోన్ అభిమానుల కోసం ఆపిల్ కంపెనీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన జెట్ బ్లాక్ కలర్ ఐఫోన్7 స్టాక్ అప్పుడే అయిపోయిందట. ఐఫోన్ 7 ప్లస్ ,ఐఫోన్7 జెట్ బ్లాక్ ఫోన్లన్నీఇప్పటికే అమ్ముడుపోయాయని ఆపిల్ కంపెనీ వెల్లడించింది.

వినియోగదారులకు నిరాశే

ముందస్తు రిజిస్ట్రేషన్లతో ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయినట్టు ప్రకటించిన ఆపిల్, ఈ ఫోన్ కొనుక్కుందామని ఆశగా స్టోర్‌కు విచ్చేసే వినియోగదారులకు ఇవి పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. నేరుగా వీటిని తీసుకోలేరని కూడా తెలిపింది.

రిజర్వేషన్ లేకుండా వచ్చే కస్టమర్లకు

ఈ ఫోన్ రిజర్వేషన్ లేకుండా వచ్చే కస్టమర్లకు సప్లై చేయలేకవచ్చని కంపెనీ వెల్లడించింది. పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఐఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

పరిమితంగా మాత్రమే

అయితే శుక్రవారం నుంచి అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతోనే అన్ని అమ్ముడుపోవడంతో, ఇప్పుడు పరిమితంగా మాత్రమే ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనున్నాయి.

కొన్ని రోజులు వేచిచూడాల్సిందే

ఆపిల్ జెట్ బ్లాక్ ఐఫోన్స్, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అన్నీ ముందస్తు ఆన్‌లైన్ ఆర్డర్‌తో పూర్తిగా అమ్మేసినట్టు, ప్రస్తుతం ఎలాంటి ఇన్వెంటరీ లేదని తెలిపింది. ఒకవేళ జెట్ బ్లాక్ రంగులో ఐఫోన్ కావాలనుకుంటే, ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసి, కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని ఆపిల్ పేర్కొంది. స్టోర్లలో ఈ ఫోన్లను పొందలేరని వెల్లడించింది.

ఐఫోన్లు ఆపిల్.కామ్‌లోనే

అన్ని రంగుల అన్ని మోడల్స్ ఐఫోన్లు ఆపిల్.కామ్‌లోనే ఆర్డరు చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కస్టమర్ల సహనాన్ని తాము అభినందిస్తున్నామని, త్వరలోనే ఈ ఫోన్లను వినియోగదారుల చేతులోకి తీసుకొస్తామని ఆపిల్ వివరించింది.

అంచనాలకు మించి డిమాండ్

అంచనాలకు మించి డిమాండ్ వెల్లువెత్తుండడంతో, కంపెనీ స్టాక్స్ కూడా అంతర్జాతీయంగా ఈ వారంలో 8 శాతం ఎగిశాయి. అయితే ఇది అక్టోబర్ 7న ఇండియాకి రానున్న నేపథ్యంలో ఇండియాలో దీని అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.

ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు

త్వరపడండి :ఐఫోన్ 6 సీరిస్ ఫోన్లపై రూ.22 వేలు తగ్గింపు..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

ఐఫోన్ 7,7 ప్లస్ బుకింగ్స్ రెడీ

ఐఫోన్ 7,7 ప్లస్ బుకింగ్స్ రెడీ..అడ్వాన్స్ ఎంతంటే.. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Apple’s iPhone 7 will be super limited in stores and all jet black and Plus models are sold out Read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot