Home
News

రెడ్‌మి నోట్ 8 & 8 ప్రోమొదటి సేల్స్ మీద గ్రేట్ ఆఫర్స్--- మిస్ చేయకండి

ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇటీవల ఇండియాలో రెడ్‌మి నోట్ 7S మరియు రెడ్‌మి నోట్ 7 ప్రోకు అప్డేట్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మి నోట్ 8 మరియు రెడ్‌మి నోట్ 8 ప్రోలను విడుదల చేసింది. క్వాడ్ కెమెరా సెటప్, మెరుగైన చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ వంటి అప్డేట్ లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఈ రోజు మొదటిసారిగా అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి.

రెడ్‌మి

ఈ రోజు ఇండియాలో రెడ్‌మి నోట్ 8 ప్రో, రెడ్‌మి నోట్ 8 సేల్స్ జరగనున్నాయి. కొత్త రెడ్‌మి నోట్-సిరీస్ ఫోన్‌లు అమెజాన్, Mi.com మరియు Mi హోమ్ స్టోర్స్ ద్వారా వివిధ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. గొప్ప ఫీచర్స్ తో వస్తున్న ఈ రెండు షియోమి ఫోన్లు మొదటి దశలోనే వినియోగదారులను ఆకర్షించడానికి రెడ్‌మి నోట్ 8 మరియు రెడ్‌మి నోట్ 8 ప్రో రెండింటి మీద గొప్ప ఆఫర్లను అందిస్తున్నాయి.

 

ధర వివరాలు

ధర వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 8 ప్రో మూడు వేరియంట్‌లలో మరియు రెడ్‌మి నోట్ 8 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 8 ప్రో

6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర ---- రూ.14,999
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.15,999.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.17,999. ఇది గామా గ్రీన్, హాలో వైట్ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

రెడ్‌మి నోట్ 8

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర ----- రూ. 9,999.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర ----- రూ. 12,999. ఇది మూన్‌లైట్ వైట్, నెప్ట్యూన్ బ్లూ మరియు స్పేస్ బ్లాక్ కలర్ లలో వస్తుంది.

లభ్యత & ఆఫర్స్

లభ్యత & ఆఫర్స్

రెడ్‌మి నోట్ 8 మరియు రెడ్‌మి నోట్ 8 ప్రో రెండూ అమెజాన్, Mi. com, మరియు Mi హోమ్ స్టోర్స్ లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ మొదలవుతాయి. రెండు ఫోన్‌లలోని సేల్ ఆఫర్‌లలో ఎయిర్‌టెల్ కస్టమర్లకు ప్రత్యేకంగా రూ. 249 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ల రీఛార్జ్ తో పాటు 10 నెలల డబుల్ డేటా ఆఫర్ లభిస్తుంది.

 

రెడ్‌మి నోట్ 8 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 స్పెసిఫికేషన్స్

షియోమి రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 6.3-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లే 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంది. మిగిలిన కెమెరాలు 8 మెగాపిక్సెల్ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. మరియు పోర్ట్రెయిట్ షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి తక్కువ-కాంతిలో కూడా మెరుగైన ఫోటోలను పొందడానికి నైట్ మోడ్‌ ఫీచర్ తో కూడా వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది AI బ్యూటిఫై, పోర్ట్రెయిట్ మోడ్ మరియు AI సీన్ డిటెక్షన్ వంటి లక్షణాలకు మద్దతును అందిస్తుంది.

 

బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ మద్దతుతో పొందుతారు. కొత్త ఫోన్‌లో స్పీకర్లు 40 శాతం బిగ్గరగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది ఇతర రెడ్‌మి ఫోన్‌ల మాదిరిగానే స్ప్లాష్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ డిజైన్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 91.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.53-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 8 యొక్క ప్రో వెర్షన్ వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని ప్రదర్శిస్తుంది. ఇందులో మెడిటెక్ G90t గేమింగ్ చిప్‌సెట్ మద్దతు లభిస్తుంది.

కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.7 ఇమేజ్ సెన్సార్ తో వస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన ఫోటో షాట్లను అందిస్తుందని చైనా కంపెనీ తెలిపింది. ఇంకా దీని ద్వారా గరిష్టంగా 9248 x 6936 రిజల్యూషన్ వద్ద కూడా షూట్ చేయగలరు. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కాకుండా ఇతర సెన్సార్లు ప్రామాణిక వెర్షన్ వలె ఉంటాయి. ఇది స్లో-మోషన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతును కూడా అందిస్తుంది. ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. చివరగా ఈ షియోమి ఫోన్ లోపల 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని జోడించి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 8 and 8 Pro Sales Start Today in India via Amazon, Mi.com: Price,Offers,Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X