బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘First look’

Posted By:

కెనాడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ బ్లాక్‌బెర్రీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘BlackBerry Priv'కు సంబంధించిన అధికారిక ఫోటోలను విడుదల చేసింది. ఈ ఆండ్రాయిడ్ డివైస్ స్లైడింగ్ స్ర్కీన్‌తో పాటు బ్లాక్‌బెర్రీ సాంప్రదాయ ట్రెడేషనల్ QWERTY కీప్యాడ్‌ను కలిగి ఉంది. పవర్ బటన్‌ను ఫోన్ కుడి వైపున వాల్యుమ్ రాకర్ బటన్‌ల మధ్య ప్లేస్ చేయటం జరిగింది.

Read More : రూ.12,999కే 3జీబి ర్యామ్ ఫోన్, 4జీ కనెక్టువిటీతో

ఫోన్ బాటమ్ భాగంలో స్పీకర్ గ్రిల్, మైక్రోయూఎస్బీ పోర్ట్ అలానే 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌లను ఏర్పాటు చేసారు. ఈ ఫోన్ స్పెక్స్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలను బ్లాక్‌బెర్రీ వెల్లడించలేదు. ఈ ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఉహాజనిత స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

Read More : హ్యాకర్లకు చుక్కలు చూపించే ‘Blackphone 2'

5.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హెక్సా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, అడ్రినో 416 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సదుపాయం, 18 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఓఐఎస్, పీడీఏఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), 3650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. BlackBerry Priv స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్‌ నాటికి అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.  ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఈ తరహా సాంకేతికత త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

కెనాడాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ టెక్నాలజీని సమకూర్చనుంది.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

భారత మార్కెట్లో ఈ ఏడాది చివరి నాటికి ఈ వర్చువల్ సిమ్ సొల్యూషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని బ్లాక్‌బెర్రీ భావిస్తోంది.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారుడు ఒకే సిమ్ కార్డ్‌తో తనకు సంబంధించిన అనేక రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకోగలుగుతాడు.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

బిల్లింగ్ కూడా ప్రతి నెంబర్‌కు వేరువేరుగా వస్తుంది.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఏ వ్యక్తి ఒకటికి మించి మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు వాడనవసరం లేదు.

ఒకే సిమ్ కార్డ్‌తో తొమ్మిది ఫోన్ నెంబర్లు, బ్లాక్‌బెర్రీ కొత్త టెక్నాలజీ

బ్లాక్‌బెర్రీ అందిస్తోన్న ఈ టెక్నాలజీ ఎక్స్‌క్లూజివ్‌గా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల పైనే పని చేస్తుందా లేకుంటే ఇతర కంపెనీల మొబైల్ ఫోన్‌లలోనూ పని చేస్తుందా అనే అంశం పై స్పష్టత రావల్సి ఉంది.

గొప్ప చరిత్ర..

ప్రపంచానికి మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసిన బ్రాండ్‌లలో ఒకటైన బ్లాక్‌బెర్రీ తొలినాళ్లలో ప్రపంచమార్కెట్‌లను శాసించింది.

 

 

పోటీ పరిస్థితులు బ్లాక్‌బెర్రీని వెనక్కినెట్టాయి

కాల క్రమంలో నెలకున్న పోటీ పరిస్థితులు బ్లాక్‌బెర్రీని వెనక్కినెట్టాయి.

 

గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు

ఈ అవరోధాలను అధిగమించే క్రమంలో తాజాగా కొత్త వోఎస్ ఇంకా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన బ్లాక్‌బెర్రీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలమన్న ధృడ నిశ్చయాన్ని వ్యక్తం చేస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Blackberry Unveiled Official Photos of Android Powered Priv Smartphone. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot