అద్దం లాంటి స్మార్ట్‌ఫోన్..భవిష్యత్‌లో సాధ్యమే!

Posted By:

అద్దం లాంటి స్మార్ట్‌ఫోన్..భవిష్యత్‌లో సాధ్యమే!
ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ (transparent technology) గురించి మీరు వినేఉంటారు. ఇందుకు ఉదాహరణ మీరు జేమ్స్ బాండ్ సినిమా 007 (డై అనథర్ డే) చూసినట్లియతే , అందులోని ఆస్టన్ మార్టిన్ కారును ఒక్క బటన్ నొక్కగాని ఎదుటి వారికి కనిపించకుండా మయమైపోతుంది. టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న తరుణంలో ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లకు సైతం విస్తరించనుంది.


ల్యాప్‌టాప్‌ల చరిత్ర 1981 నుంచి 2010 వరకు.....

తైవాన్‌కు చెందిన ‘పోలిట్రాన్ టెక్నాలజీస్' ట్రాన్స్‌పరెంట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే‌ను వృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతను స్విచబుల్ గ్లాస్ ( Switchable Glass) అని పిలుస్తున్నారు. ఈ డిస్‌ప్లే‌లో వినియోగించిన వోఎల్ఈడి వ్యవస్థ లక్విడ్ క్రిస్టల్ అణువులను డిస్‌ప్లే ఇమేజ్‌లుగా మలుస్తుంది. పవర్ ఆఫ్ చేసిన సమయంలో ఫోన్ గ్లాస్‌లా మారిపోతుంది.

ట్రెండీ పెన్‌డ్రైవ్‌లు

స్విచబుల్ గ్లాస్ టెక్నాలజీతో వృద్ధి కాబడే ఫోన్‌లో ఎస్డీ కార్డ్, సిమ్‌కార్డ్ స్లాట్, మైక్రోఫోన్, కెమెరా ఇంకా బ్యాటరీలు స్పష్టంగా కనిపిస్తాయి. హ్యాండ్‌సెట్‌లోని మరికొన్ని మూలకాలు ప్లాస్టిక్‌తో కవర్ చేసి ఉంటాయి. ఫోన్ రెండు వైపులా మల్టీ-టచ్ డిస్‌ప్లే వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. స్విచబుల్ గ్లాస్ టెక్నాలజీతో రూపొందించబడే స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించే ఆపరేటింగ్ సిస్టం ఇంకా ఇతర సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.

మరింత స్మార్ట్ ఫోన్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot