200MP కెమెరా, 12GB ర్యామ్, 25W ఛార్జింగ్‌తో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్.. FCCలో వివరాలు లీక్..
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ప్రియులకు గుడ్ న్యూస్. కంపెనీ తన నెక్స్ట్-జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్, గెలాక్సీ S25 ఎడ్జ్ ను తీసుకురావడానికి శరవేగంగా సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ అమెరికా ప్రభుత్వానికి చెందిన FCC (ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ ఏడాది జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో S25 సిరీస్‌తో పాటు దీని గురించి శాంసంగ్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.
ఇది చాలా సన్నగా, చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. ఇప్పుడు FCC లిస్టింగ్ ద్వారా అమెరికా, ఇండియా వేరియంట్ల కీలక వివరాలు బయటకు వచ్చాయి. మరి అవేంటో చూద్దామా, FCC డాక్యుమెంట్ల ప్రకారం, అమెరికాలో విడుదలయ్యే గెలాక్సీ S25 ఎడ్జ్ మోడల్ నంబర్లు SM-S937U, SM-S937U1 (FCC ID: A3LSMS937U).

టెక్నాలజీలో ఓ అద్భుతం నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌బడ్స్.. ఇంతకీ అవి ఎలా పనిచేస్తాయో తెలుసా?
* మరి ఇండియాలో..
మన ఇండియాలో వచ్చే వేరియంట్ మోడల్ నంబర్లు SM-S937B/DS, SM-S937B (FCC ID: A3LSMS937B). అయితే, FCC లిస్టింగ్‌లో ఫోన్ అసలు పేరు (మార్కెటింగ్ పేరు) చెప్పలేదు, కానీ అందరూ ఇది గెలాక్సీ S25 ఎడ్జ్ అనే నమ్ముతున్నారు. ఇది దాదాపు నిజమయ్యే అవకాశం ఉంది.
* FCC సర్టిఫికేషన్ ద్వారా తెలిసిన విషయం
ఈ ఫోన్ లేటెస్ట్ 5G కనెక్టివిటీ, బ్లూటూత్ LE (తక్కువ పవర్ తీసుకునేది), వై-ఫై, NFC (దగ్గరి పరికరాలతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, డేటా షేరింగ్ కోసం), WPT (వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్/ఛార్జింగ్), UWB (అల్ట్రా-వైడ్‌బ్యాండ్ - కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం) టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుంది.
అంతేకాదు, EP-T2510 మోడల్ నంబర్‌తో ఛార్జింగ్ అడాప్టర్, EP-DN980 లేబుల్‌తో డేటా కేబుల్ వివరాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఫోన్‌కు 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని అర్థమవుతోంది. ఇంకాస్త వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే, ఈ రోజుల్లో వినియోగదారులు కనీసం 45 వాట్ల ఛార్జింగ్‌ను ఆశిస్తున్నారు.
* శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
గెలాక్సీ S25 ఎడ్జ్ చాలా అంటే చాలా సన్నగా కేవలం 5.84mm మందం ఉండబోతుందని సమాచారం. ఇదే నిజమైతే, ఇది మార్కెట్‌లోని అత్యంత పలచని ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటి అవుతుంది. అంతేకాదు, గెలాక్సీ S25 అల్ట్రా లాగానే దీనికి కూడా టైటానియం అలాయ్ ఫ్రేమ్ ఉంటుందని అంటున్నారు, ఇది ఫోన్‌కు మరింత గట్టిదనాన్ని ఇస్తుంది.
* డిస్‌ప్లే
6.7-అంగుళాల అమోలెడ్ (AMOLED) స్క్రీన్, అదిరిపోయే విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్, సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, చాలా సన్నని 1.32mm అంచులు (బెజెల్స్), గీతలు, పగుళ్ల నుంచి రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉండొచ్చని అంచనా.
* పెర్ఫార్మెన్స్, కెమెరాలు
ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, దానికి జతగా అడ్రినో GPU ఉండవచ్చు. మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం కనీసం 12GB ర్యామ్, ఫైల్స్, యాప్స్ స్టోర్ చేసుకోవడానికి 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది 3,900mAh బ్యాటరీతో రావచ్చు.
ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7పై నడుస్తుందని భావిస్తున్నారు. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం, వెనుకవైపు 200MP భారీ మెయిన్ కెమెరా, దానికి తోడుగా 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉండొచ్చని టాక్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12MP కెమెరా ఇవ్వొచ్చు.
* లాంచ్ ఎప్పుడు.. ఏ రంగుల్లో వస్తుంది?
వస్తున్న లీక్స్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యి, మేలో అమ్మకాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది టైటానియం ఐసీ బ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్ అనే మూడు స్టైలిష్ రంగుల్లో లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
* ధరలు
దక్షిణ కొరియాలో బేస్ 256GB వేరియంట్ ధర సుమారు 1,500,000 వోన్ (దాదాపు రూ.87,900), 512GB మోడల్ ధర 1,630,000 వోన్ (దాదాపు రూ.95,500) ఉండొచ్చని అంచనా. యూరప్‌లో దీని ధర 1,200 యూరోలు (సుమారు రూ.1,11,200) నుంచి 1,400 యూరోల (సుమారు రూ.1,29,700) మధ్య ఉండవచ్చు.
ఇండియాలో, ఈ ఫోన్ ధర సాధారణ గెలాక్సీ S25, టాప్-ఎండ్ S25 అల్ట్రా మధ్యలో ఉంటుందని, అంటే సుమారుగా రూ.80,999 నుంచి రూ.1,29,999 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








