16 ఎంపీ సెల్ఫీతో జియోని A1, ధర ఎంతంటే..?

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ జియోనీ.. మార్కెట్లోకి ఎ1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

By Hazarath
|

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ జియోనీ.. మార్కెట్లోకి ఎ1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అద్భుతమైన అనుభూతి కోసం సూపర్‌ సెల్ఫీ, సూపర్‌ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది. జియోనీ బ్రాండ్‌ గొప్పదనానికి కొనసాగింపుగా ఈ ఏడాది తొలిసారిగా ఎ1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు జియోనీ ఇండియా కంట్రీ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ వోహ్రా వెల్లడించారు.

వరుసగా షాకిస్తున్న బిల్‌గేట్స్ , అంబాని ప్లేస్ ఎక్కడ..?

సెల్ఫీ ఫ్లాష్‌తో 16 ఎంపి ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకతని ఆయన తెలిపారు. దీని ధర సుమారుగా రూ. 24, 600 ఉండే అవకాశం ఉంది. అలాగే జియోని ఏ1 ప్లస్ ధర రూ. 35,200 ఉండే అవకాశం ఉంది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంది.

కెమెరా

కెమెరా

ప్రత్యేకించి సెల్ఫీ అభిమానుల కోసం ఈ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈఫోన్ కలిగి ఉంది.

అదనపు ఆకర్షణలు

అదనపు ఆకర్షణలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలు.

ఫ్రీ బుకింగ్స్ మార్చి 31 నుంచి

ఫ్రీ బుకింగ్స్ మార్చి 31 నుంచి

ఫ్రీ బుకింగ్స్ మార్చి 31 నుంచి స్టార్ట్ అవుతాయి. ధర సుమారుగా రూ. 24, 600 ఉండే అవకాశం ఉంది. అలాగే జియోని ఏ1 ప్లస్ ధర రూ. 35,200 ఉండే అవకాశం ఉంది

Best Mobiles in India

English summary
Gionee A1 With 16MP Front Camera Launched, Pre-Booking Starts March 31 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X