షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

Written By:

చైనా దిగ్గజ మొబైల్ సంస్థ దేశంలో తన రెండో ప్లాంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో, కేవలం షియామీ ఫోన్ల తయారీ కోసమే కొత్త యూనిట్‌ సిద్ధమైంది. శ్రీసిటీలోనే ఫాక్స్‌కాన్‌ ఆధ్వర్యంలోని ప్లాంటులోనే షియోమీ ఫోన్లు ఇప్పటివరకు తయారవుతున్నాయి. అయితే అదే యూనిట్ లో ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్లు కూడా తయారవుతున్నాయి. అయితే రెండో యూనిట్‌లో మాత్రం కేవలం షియోమిమీ ఫోన్లే తయారు కానున్నాయి.

ఎయిర్‌టెల్‌ను దాటేసిన ఐడియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంత పెట్టుబడి పెట్టిందీ

ఈ కొత్త యూనిట్‌కు ఎంత పెట్టుబడి పెట్టిందీ వెల్లడించేందుకు షియోమి సంస్థ నిరాకరించింది.

సెకనుకు ఒక ఫోన్‌

ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వెల్లడించను. అయితే యంత్రాలు పనిచేస్తున్నప్పుడు, భారత్‌లో సెకనుకు ఒక ఫోన్‌ తయారు చేసే సామర్థ్యం సమకూరిందని షియోమి ఇండియా అధిపతి మను జైన్‌ తెలిపారు.

దేశీయ విక్రయాల్లో 95 శాతాన్ని

దేశీయ విక్రయాల్లో 95 శాతాన్ని ఇక్కడే తయారు చేస్తున్నామన్నారు. వీటికి విడిభాగాలను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఖరీదైన ఎంఐ 5 ఫోన్‌ను మాత్రం చైనా నుంచే దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నట్లు తెలిపారు.

రూ.5,999కే రెడ్ మి 4ఏ

దేశీయబ్రాండ్లను సవాల్ చేస్తూ రూ.5,999కే షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్ మి 4ఏను రిలీజ్ చేసింది. 5 అంగుళాల తెర, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 చిప్‌సెట్‌ కలిగిన 1.4 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ తో ఫోన్ వచ్చింది.

2జీబీ మెమొరీ

2జీబీ మెమొరీ, 16/32 జీబీ అంతర్గత మెమొరీ (ఎస్‌డీకార్డుతో 256 జీబీకి పెంచుకునే అవకాశం), వెనుక-ముందు 13-5 మెగాపిక్సెల్‌ కెమేరాలు, 3120 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ మార్ష్‌మలో 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Making one-phone-per-second Xiaomi wants to dominate India’s smartphone market read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot