గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపు.. 8.03 డిస్‌ప్లే, 16GB RAM, ఇంకెన్నో అద్భుతమైన ఫీచర్లు!
Google Pixel 9 Pro Fold: తక్కువ ధరల్లో చాలా వేగవంతమైన పనితీరు అందించే ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్‌తో తక్కువ ధరల్లోనే లభిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏకంగా 8.03 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే ఇచ్చారు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
2152 x 2076 రిజల్యూషన్‌తో ప్రతిదీ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు, లేదా ఏదైనా స్క్రోల్ చేసేటప్పుడు ఎక్కడా ఫోన్ స్లో అవ్వదు. పంచ్-హోల్ డిజైన్ వల్ల స్క్రీన్ మొత్తం వాడుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేయడానికి, సినిమాలు చూసుకోవచ్చు.

* పనితీరు విషయానికొస్తే
ఈ ఫోన్‌లో గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్ ఉంది. ఇది చాలా శక్తివంతమైన ప్రాసెసర్, 3.1GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గేమ్స్ ఆడాలన్నా, వీడియోలు ఎడిట్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఈ ప్రాసెసర్‌తో సులభంగా చేసుకోవచ్చు. 16GB RAM, 256GB స్టోరేజ్ ఉండటం వల్ల ఫోన్ అస్సలు హాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
మీకు కావాల్సిన యాప్స్, ఫొటోలు, వీడియోలు అన్నిటికీ స్టోరేజ్ కూడా సరిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఆండ్రాయిడ్ v14 తో వస్తుంది, దీన్ని ఆండ్రాయిడ్ v15 కి కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. అంటే లేటెస్ట్ ఫీచర్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి.
* కెమెరాలు
వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 48MP మెయిన్ కెమెరా, 10.8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10.5MP టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. ఈ కెమెరాలు తక్కువ వెలుతురులో కూడా చాలా స్పష్టంగా, మంచి వివరాలతో ఫొటోలు తీస్తాయి. సెల్ఫీల కోసం ముందువైపు రెండు 10MP కెమెరాలు ఉన్నాయి. వీటితో మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు.
ఇంకా నైట్ సైట్, మ్యాజిక్ ఎరేజర్, 4K వీడియో రికార్డింగ్ లాంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో ఫోటోలు, వీడియోలు మరింత క్వాలిటీగా వస్తాయి. బ్యాటరీ విషయానికొస్తే, 4650mAh బ్యాటరీ ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఫోన్ త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. 5G, వై-ఫై, NFC, VoLTE, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ డిజైన్ అయితే చాలా ప్రీమియంగా, స్టైలిష్‌గా ఉంది. పర్ఫార్మెన్స్, లుక్స్ రెండూ కావాలనుకునే వాళ్లకి ఈ ఫోన్ చాలా బాగా సరిపోతుంది. మరి ఇప్పుడు ధర, ఆఫర్ల విషయానికి వద్దాం.
* ధర, ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అసలు ధర ఇండియాలో రూ.1,72,999. కానీ ఇప్పుడు ఆఫర్లో తక్కువకే వస్తోంది. ఈ ఫోన్ క్రోమా, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొంటే వెంటనే రూ17,000 డిస్కౌంట్ వస్తుంది.
ఫోన్ UPI ద్వారా పేమెంట్ చేస్తే 1 శాతం డిస్కౌంట్ (గరిష్టంగా రూ.2,000 వరకు) కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లకి 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇంకా నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది, నెలకి రూ.7,209 నుంచి EMI స్టార్ట్ అవుతుంది. మొత్తానికి గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అదిరిపోయే ఫీచర్లతో, మంచి ఆఫర్లతో వస్తోంది.


Click it and Unblock the Notifications








