Home
Mobile

గూగుల్ ఫోన్లకు ఫ్రీ ఆర్డర్లు షురూ

By Hazarath

గూగుల్ గ‌త వారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించిన 'పిక్స‌ల్' స్మార్ట్‌ఫోన్ల‌కు భార‌త్‌లో ప్రీ ఆర్డ‌ర్లు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూజ‌ర్లు ఈ పిక్స‌ల్ ఫోన్‌ను ముందుగానే ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. ప్రీ ఆర్డ‌ర్లు చేసుకున్న యూజ‌ర్ల‌కు ఈ నెల 25వ తేదీ నుంచి పిక్స‌ల్ ఫోన్ల‌ను డెలివ‌రీ చేయ‌నున్నారు.

జియోకి మైండ్ బ్లాక్ : 1+1 ఆఫర్‌తో దడ పుట్టిస్తున్న BSNL

ఈ సైట్‌లో మాత్ర‌మే కాకుండా రిల‌య‌న్స్ డిజిటల్‌, క్రోమా వంటి మ‌ల్టీ బ్రాండ్ రిటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు. కాగా గూగుల్ పిక్స‌ల్ 32 జీబీ ధ‌ర రూ.57వేలుగానూ, గూగుల్ పిక్సల్ 128 జీబీ ధ‌ర రూ.66వేలుగానూ ఉంది.ఇక గూగుల్ పిక్స‌ల్ ఎక్స్ఎల్ 32 జీబీ ధర రూ.67వేలుగానూ, గూగుల్ పిక్స‌ల్ ఎక్స్ఎల్ 128 జీబీ ధర రూ.76వేలు గాను ఉంది.

మార్కెట్లోకి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు, 13 నుంచి ప్లిప్‌కార్ట్‌లో

Google Pixel XL

Google Pixel XL

స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే Google Pixel XL 5.5 ఇంచ్ QHD అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది. దీంతో పాటు 534ppi గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. 2.15GHz స్నాప్ డ్రాగన్ 821 క్వాడ్ కోర్ చిప్ సెట్ మీ ద రన్ అవుతుంది. 2560×1440 pixels రిజల్యూషన్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్, కెమెరా

ర్యామ్, కెమెరా

4జిబి ర్యామ్ తో పాటు 256 జిబి ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్లు రానున్నాయి. అయితే విస్తరణ సామర్థ్యం ఉందాలేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ రేర్ కెమెరాతో ఫోటోలు షూట్ చేయవచ్చు. సెల్ఫీ విషయానికొస్తే 8 ఎంపీ సెల్ఫీ కెమెరానిపొందుపరిచారు.

3,450mAh బ్యాటరీ

3,450mAh బ్యాటరీ

3,450mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. 26 గంటల పాటు టాక్ టైం అలాగే 456 గంటలు స్టాండ్ బై మోడ్ లో ఫోన్ ఉంటుందని లీకయిన వివరాలు తెలియజేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు 4G support, Wi-Fi, Bluetooth, and NFC అదనపు ఆకర్షణలు.ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఫ్లాట్ ఫాం నౌగట్ మీద రన్ అవుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Google Pixel స్పెసిఫికేషన్స్

Google Pixel స్పెసిఫికేషన్స్

Google Pixel స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 5 ఇంచ్ QHD డిస్ ప్లే తో రానుంది. ఇక మిగిలినవన్నీ సేమ్ పీచర్లే ఉంటాయి. బ్యాటరీ మాత్రం 2,770mAhతో రానుంది. టాక్ టైం విషయానికొస్తే 32 గంటలు వరకు ఉంటుంది. స్టాండ్ బై టైం 552 గంటలు.

గూగుల్ యాప్స్ అల్లో అలాగే డ్యుయో

గూగుల్ యాప్స్ అల్లో అలాగే డ్యుయో

ఈ ఫోన్లలో గూగుల్ తన యాప్స్ అల్లో అలాగే డ్యుయో యాప్ లను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఫిక్సల్ ఫోన్లలో అన్ లిమిటెడ్ ఫోటో బ్యాకప్ ఇస్తామని ప్రామిస్ చేసింది. మాగ్జిమమ్ రిజల్యూషన్ తో మీరు అన్ లిమిటెడ్ ఫోటోలను ఇందులో భద్రపరుచుకోవచ్చు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Google Pixel, Pixel XL pre-orders open: Here are the unique features read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X